S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2016 - 00:22

స్టేషన్ ఘన్‌పూర్, ఆగస్టు 28: గోదావరి జలాలతోనే నియోజకవర్గంలోని గ్రామాలు సస్యశ్యామలంగా మారుతాయని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. దేవాదుల ఎత్తిపోతల పధకంలో ఘన్‌పూర్ రిజర్వాయర్‌కు చేరుకున్న గోదావరి జలాలను తూం ద్వారా పంట పొలాలకు ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా నియోజక వర్గంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించడమే ప్రధాన లక్ష్యమన్నారు.

08/29/2016 - 00:22

వరంగల్, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటుచేయనున్న కొత్త జిల్లాల ఏర్పాటు రియలెస్టేట్ వ్యాపారులకు వరంగా మారింది. దసరా పండుగ నుండే కొత్త జిల్లాలు ఏర్పాటు కానుండటంతో ఆయా జిల్లాలో రియలెస్టేట్ రంగం మరింత ఊపందుకుంటోంది. ప్రధానంగా వరంగల్ జిల్లాలో కొత్తగా ఏర్పడనున్న మహాబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలో భూముల ప్రభావం ఎక్కువగాఉంది. ఈ రెండు జిల్లాల పరిధిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి.

08/29/2016 - 00:21

వరంగల్, ఆగస్టు28: హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఆదివారం హన్మకొండలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రతిపాదనలో హన్మకొండ జిల్లా ప్రతిపాదన ఉండటం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు.

08/29/2016 - 00:21

వరంగల్, ఆగస్టు 28: రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయం సేకరిస్తూనే మరోవైపు జిల్లా కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించారు.

08/28/2016 - 23:58

పెద్దపల్లి రూరల్, ఆగస్టు 28: పెద్దపల్లి జిల్లాగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా జారీ చేసిన నేపథ్యంలో పెద్దపల్లి ప్రాంతంలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. 10 రోజుల కిందట భూమి కొనడానికి ముందుకు రాని వారు ఇప్పుడు నచ్చితే అంత అయిన పెట్టి కొనుగోలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో రియల్ వ్యాపారులు అందినంత దోచుకోవడానికి ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.

08/28/2016 - 23:58

సిరిసిల్ల, ఆగస్టు 28: సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం బద్దెనపల్లిలోని టెక్స్‌టైల్ పార్కులోని తుక్కు గోదాములో షార్కు సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో సుమారు రూ.25 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. గోదాములోని మూడు తుక్కు మిషనరీలు, భవనం, తుక్కు నిల్వలు ఆగ్నికి ఆహుతయ్యాయి.

08/28/2016 - 23:57

కోహెడ, ఆగస్టు 28: నూతనంగా ఏర్పాటు చేసే సిద్దిపేట జిల్లాలో కోహెడ మండలాన్ని చేర్చవద్దంటూ మండలంలోని వరికోలుకు చెందిన రైతు జాప మల్లారెడ్డి గ్రామ చావడి వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు. నూతనంగా ఏర్పాటు చేసే సిద్దిపేట జిల్లాలో మండలాన్ని కలుపొద్దని ఆందోళనలు చేస్తున్నా స్పందన రాకపోవడంతో తానీ దీక్షకు పూనుకున్నట్లు మల్లారెడ్డి తెలిపారు.

08/28/2016 - 23:57

గోదావరిఖని, ఆగస్టు 28: కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని.. ప్రాజెక్ట్ నిర్మాణం పేరిట తమ భూములకు తక్కువ పరిహారం చెల్లించి భూములు తీసుకుంటానంటే సరికాదని.. న్యాయమైన పరిహారం చెల్లిస్తూ.. భూములు కోల్పోయిన వారందరికి ప్రాజెక్ట్‌లో ఉపాధి అవకాశం కల్పిస్తానంటేనే తమ భూములిస్తామని గోలివాడ రైతులు తెగేసి చెప్పారు.

08/28/2016 - 23:56

జగిత్యాల, ఆగస్టు 28: ఇళ్ల పట్టాలకు సంబంధించి నకిలీ ప్రొసిడింగ్‌లతో పట్టాలు విక్రయించడం జగిత్యాలలో కలకలం రేపుతోంది. నిరుపేదలకు మంజూరైన ఇళ్ల పట్టాలనే నకిలీ ప్రొసిడింగ్‌లను తయారు చేసి విక్రయించడం స్థానికంగా చర్చనీయంగా మారింది. ఇదివరకు పని చేసిన గృహ నిర్మాణ శాఖ అధికారే సూత్రదారిగా అనుమానిస్తున్నారు.

08/28/2016 - 23:56

బోయినిపల్లి, ఆగస్టు 28: ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడే ప్రతిఘటన ప్రారంభమవుతుందని తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ విమలక్క అన్నారు. ఆదివారం బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలో పోరాటాల రాజవ్వ సంస్మరణ సభ చెన్నమనేని పురుషోత్తం రావు అధ్యక్షతన జరిగింది.

Pages