S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 00:35

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఉద్యోగం కోసం ఒడిసా నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ యువకుడు ఫిజికల్ ఫిట్నెస్‌లో భాగంగా మైదానంలో అందరితో కలిసి రన్నింగ్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంఘటన శనివారం ఉదయం చాంద్రాయణగుట్ట పోలీస్టేషన్ పరిధిలో జరిగింది.

05/01/2016 - 00:35

హైదరాబాద్, ఏప్రిల్ 30: మహానగర పాలక సంస్థకు ప్రధాన ఆర్ధిక వనరైన ఆస్తిపన్నులో రిబేటు పొందేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎర్లీబర్డ్ స్కీం శనివారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీ నుంచి రాష్టవ్య్రాప్తంగా అమలైన ఈ పథకానికి సంబంధించి జిహెచ్‌ఎంసిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రూ. 200 కోట్ల వరకు ఆస్తిపన్ను వసూలైంది.

05/01/2016 - 00:34

సికింద్రాబాద్, ఏప్రిల్ 30: తెరాస ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తుందని తార్నాక డివిజన్ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి పేర్కొన్నారు.

05/01/2016 - 00:33

హైదరాబాద్, ఏప్రిల్ 30: జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి శనివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. కార్పొరేషన్ జంటనగరవాసులకు అందిస్తున్న పౌరసేవల నిర్వహణ, వివిధ అభివృద్ధి పనులు పురోగతిని ఆయన పరిశీలించారు. కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌసర్ మోహియుద్దిన్‌తో కలిసి కమిషనర్ పనులు పనులను పరిశీలించారు.

05/01/2016 - 00:33

హైదరాబాద్, చార్మినార్, ఏప్రిల్ 30: పాతబస్తీ పెట్లబుర్జ్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఓ వైద్యురాలిపై మహిళ దాడి చేసిన సంఘటనలో చార్మినార్ పోలీసులు ఇద్దరు మహిళలను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం కర్నూలు జిల్లా కల్లూరు ప్రాంతానికి చెందిన లలిత అనే మహిళ ప్రసవం రెండు రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చి మగబిడ్డకు జన్మనిచ్చింది.

05/01/2016 - 00:32

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30: ఆగి ఉన్న ఇన్నోవా కారు అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న ఐదు లక్షల రూపాయల నగదు, విలువైన పత్రాలు చోరీ చేసిన ఘటన ఇబ్రహీంపట్నంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. సిఐ జగదీశ్వర్, బాధితుని కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రామంతాపూర్‌కు చెందిన వ్యాపారి ఆంథోనీ.. సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్టేషన్ పని నిమిత్తం వచ్చి సమీపంలో కారును నిలిపాడు.

05/01/2016 - 00:32

నాచారం, తార్నాక, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెవెన్యూలో మిగులు రాష్ట్రంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సలహాదారుడు డాక్టర్ జిఆర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఓయులోని ఐసిఎస్‌ఎస్‌ఆర్ హాల్‌లో ఓయు ఎకనామిక్స్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ’అనే అంశంపై జరిగిన ఒకరోజు సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా విచ్చేశారు.

05/01/2016 - 00:31

ఘట్‌కేసర్, ఏప్రిల్ 30: అంకిత భావంతో ఉద్యోగం నిర్వర్తించి అందరి మన్నలను పొందిన ఫీల్డ్ ఆఫిసర్ జగదీశ్వర్‌రెడ్డిని తోటి ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీటిసి సభ్యడు మంద సంజీవరెడ్డి అన్నారు. మండల రైతు సేవా సహకార సంఘంలో 33 సంవత్సరాలు ఫీల్డ్ ఆఫిసర్‌గా విధులు నిర్వర్తిస్తు మండల రైతులకు అనేక విశిష్ఠ సేవలు అందించి మన్నలను పొందినట్లు తెలిపారు.

05/01/2016 - 00:31

కీసర, ఏప్రిల్ 30: కీసర మండలంలో కల్యాణలక్ష్మీ లబ్ధిదారులను ఎసిబి అధికారులు శనివారం విచారించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు పక్కదారి పడుతున్నట్లు సమాచారం అందటంతో ఎసిబి డిఎస్‌పి ప్రభాకర్ కీసర, నాగారం, దమ్మాయిగూడ, నర్సంపల్లి, కుందన్‌పల్లి గ్రామాల్లోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి విచారణ జరిపారు. 16 మంది లబ్ధిదారులను విచారించారు.

05/01/2016 - 00:30

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30: రాష్ట్రంలోని ప్రతి పల్లెకు, గ్రామానికి, మారుమూల తండాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పిస్తామని రాష్ట్ర రోడ్డ రవాణాశాఖ మంత్రి పట్నం మహేంధర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. శనివారం స్థానిక బస్‌డిపోలో 5 రూట్లలో ఐదు బస్సులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

Pages