S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

05/01/2016 - 00:42

గచ్బిబౌలి, ఏప్రిల్ 30: ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. కమిషనరేట్‌లో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. జెఎన్‌టియు అధికారులను సంప్రదించిన తర్వాత వారి సూచనల మేరకు కమిషనరేట్‌లో ఆరు ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

05/01/2016 - 00:41

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30: తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 2016-17 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురుకులంలో ప్రవేశానికి మే 5 నుండి 7 వరకు మూడు రోజుల పాటు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని అన్నారు.

05/01/2016 - 00:41

ముషీరాబాద్, ఏప్రిల్ 30: తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువుపై సమగ్ర నివేదిక పంపిస్తే కేంద్రం నుంచి సహాయం అందిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఇప్పటికే రూ.385 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.

05/01/2016 - 00:40

మంచాల: రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పట్నం మహేంధర్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కందుకూరు మండల పరిధిలోని ముచ్చర్లలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీలో భూనిర్వాసితులైన యాచారం మండలం కుర్మిద్ధ గ్రామ రైతులకు పరిహారాన్ని పంపిణీ చేశారు.

05/01/2016 - 00:38

హైదరాబాద్, చార్మినార్, ఏప్రిల్ 30: నగరంలో మధ్యాహ్నం పూట ఎండలు బాగా మండిపోతూనే సాయంత్రం వేళల్లో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై గాలి దుమారం రేగింది. దీంతో పలు చోట్ల చెత్తాచెదారం ఎగిరిపడటంతో బైక్‌లపై ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు.

05/01/2016 - 00:38

హైదరాబాద్, ఏప్రిల్ 30: రైల్వేలో కొనసాగుతున్న ఇంజనీరింగ్ పనులను నిర్ధేశిత లక్ష్యం మేరకు పూర్తిచేసేందుకు ప్రయత్నించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా తమ విభాగానికి చెందిన ఇంజనీర్లను ఆదేశించారు. ఇందుకు రైల్వేలోని సంబందిత శాఖలన్నీ పూర్తి సహకారం అందిస్తాయని ఆయన భరోసా ఇచ్చారు.

05/01/2016 - 00:38

ఖైరతాబాద్, ఏప్రిల్ 30: ఎన్నో పోరాటాల అనంతరం ఏర్పడ్డ తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. శనివారం లక్డీకాపూల్‌లోని ఫ్యాప్సీ భవన్‌లో యుద్ధవీర్ ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

05/01/2016 - 00:37

సికింద్రాబాద్, నాచారం, ఏప్రిల్ 30: దొంగలందరినీ పిలిచి కండువాలు కప్పుతున్న కెసిఆర్ ఇదే తెలంగాణ పునరేకీకరణ అంటున్నారని తెలంగాణ ఉద్యమసంఘాల జెఎసి చైర్మన్ డాక్టర్ చెరుకు సుధాకర్‌గౌడ్ పేర్కొన్నారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి నుంచి యావత్ తెలంగాణలో బస్సుయాత్రను నిర్వహించి శనివారం ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద ముగింపు సమావేశాన్ని నిర్వహించారు.

05/01/2016 - 00:36

హైదరాబాద్, ఏప్రిల్ 30: గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లో జరుగుతుందా? లేదా అన్న అనుమానానికి తెర పడింది. సాగర్ కలుషితం, చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై జిహెచ్‌ఎంసి అధికారులు ప్రత్యేక కార్యచరణను సిద్దం చేయాలని ఆదేశిస్తూ, శాస్ర్తియంగా నిమజ్జనం జరగాలని సూచించటంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు.

05/01/2016 - 00:36

హైదరాబాద్, ఏప్రిల్ 30: బాలల న్యాయ చట్టం (జువనైల్ జస్టిస్) 2015ను సమర్ధవంతంగా అమలు చేసి బాధిత పిల్లలకు సత్వర న్యాయం జరిగేలా అన్నిచర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయ సేవల సంస్థ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Pages