S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/16/2016 - 05:34

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 15: పట్టణంలో పార్కులు ఉనికిని కోల్పోతున్నాయి. దశాబ్ధాల తరబడి చరిత్ర కలిగిన పార్కులు కూడా మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఒకవైపు అధికారులు..మరోవైపుప్రజల ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. జిల్లా కేంద్రంలో సరైన పార్కులు లేకపోవడం వల్ల ఆహ్లాదం కోసం పట్టణ ప్రజలు విశాఖ వెళుతున్నారు.

04/16/2016 - 05:33

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 15: పట్టణంలో ఇంటినెంబర్ల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ జి.నాగరాజు తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాకలెక్టర్ ఉత్తర్వులను అనుసరించి ఈ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అన్నారు. ఇంటినెంబర్ల సర్వేకు సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారి వి.రాజేశ్వరరావు, టౌన్ సర్వేయర్ పి.శ్రీనివాసరావుతో సమీక్షించారు.

04/16/2016 - 05:33

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 15: తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ చలనచిత్ర టెలివిజన్ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఆరు గంటలకు గురజాడ కళాభారతి ఆడిటోరియంలో తెలుగు నాటకరంగ దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసారు.

04/16/2016 - 05:32

దత్తిరాజేరు, ఏప్రిల్ 15:గ్రామాలలో అర్హులైన నిరుపేదలకు ఎన్టీఆర్ గృహ సముదాయం కింద పక్కాగృహాలు మంజూరుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు అన్నారు. శుక్రవారం మండలంలోని దత్తి గ్రామంలో ఎన్టీ ఆర్ గృహ సముదాయం కింద 49 గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేసారు.

04/16/2016 - 05:32

చీపురుపల్లి, ఏప్రిల్ 15: చీపురుపల్లి అగ్నిమాపక దళం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ వారోత్సవాలలో భాగంగా శుక్రవారం స్థానిక మూడు రోడ్లు జంక్షన్ వద్ద అగ్నిమాపక గల వాహనంతో వివిధ విన్యాసాలను ప్రదర్శించారు. అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు.

04/16/2016 - 05:31

విజయనగరం(టౌన్), ఏప్రిల్ 15: గ్రామాల అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి మాణిక్యాలరావు అన్నారు. శుక్రవారం జిల్లా బిజెపి కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోఅంబేద్కర్‌ను విస్మరించారని ఆరోపించారు. ఆయన పుట్టిన ఊరు కూడా ప్రజలకు తెలియదని అన్నారు.

04/16/2016 - 05:30

విజయనగరం (్ఫర్టు), ఏప్రిల్ 15: విజయనగరం మున్సిపాలిటీలో పాలకవర్గసభ్యులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఫలితంగా అభివృద్ధి పనులకు శాపంగా మారింది. దీనికి తోడు కౌన్సిల్ సభ్యుల మధ్య అవగాహన, అధికారుల మధ్య సయోధ్య లేకపోవడం వల్ల పాలనాపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

04/16/2016 - 05:30

నెల్లిమర్ల, ఏప్రిల్ 15: పవిత్ర పుణ్యక్షేత్ర, దివ్యస్థలం రామతీర్థంలో కొలువుదీరిన శ్రీసీతారాముల కల్యాణం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కిమిడి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి, ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామినాయుడు కల్యాణాన్ని తిలకించారు.

04/16/2016 - 05:28

విశాఖపట్నం, ఏప్రిల్ 15: నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే విశాఖ రైల్వేస్టేషన్‌లో వై-ఫై సేవలు మరింత విస్తృతమవుతున్నాయి. గూగుల్ ద్వారా సరికొత్త ప్రయోగాన్ని ఆవిష్కరించింది. ఫ్రీ హై-స్పీడ్ పబ్లిక్ వై-ఫై సేవలను శుక్రవారం నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా రోజుకి 1.9 లక్షల మంది ప్రయాణికులు ప్రయోజనం పొందుతారు.

04/16/2016 - 05:27

విశాఖపట్నం, ఏప్రిల్ 15: రాష్ట్ర ప్రభుత్వం క్రీడావిధానానికి రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో చాలాకాలంగా భర్తీ కాకుండా ఉన్న ఆర్ట్స్, క్రాఫ్ట్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల భర్తీ అంశం తెరపైకి వస్తోంది.

Pages