S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/18/2019 - 01:46

వెంకటాచలం, ఫిబ్రవరి 17: వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కనుపూరు సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు నెల్లూరు రూరల్ మండలం బుజబుజనెల్లూరు ప్రాంతానికి చెందిన షేక్ రియాజ్ (19), షేక్ ఫయాజ్ (17), షేక్ షాన్‌వాజ్ (16) వరుసకు సోదరులు అవుతారు.

02/18/2019 - 01:32

శామీర్‌పేట, ఫిబ్రవరి 17: కూలి పనికి వెళుతున్న వారిపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందగా, నలుగురికి తీవ్ర గాయాలైన సంఘటన శామీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.

02/18/2019 - 01:32

జీడిమెట్ల, ఫిబ్రవరి 17: దేవరయాంజాల్‌లో కాల్పుల కలకలం రేగింది. భూ వివాదంతో ఓ వ్యక్తి గన్‌తో ఎదుటి వ్యక్తిపై కాల్పులు జరిపిన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొంపల్లి గ్రామంలోని జీఎల్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో నివాసముండే పిసారి నర్సింహా రెడ్డి (60) వ్యవసాయం చేస్తుంటాడు.

02/17/2019 - 05:37

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఎన్నారై, పారిశ్రామిక వేత్త చిగురిపాటి జయరాం హత్య కేసులో ఇక పోలీస్ అధికారులను విచారిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేష్‌రెడ్డితో సంబంధాలు ఉన్న ఎసీపీ( ఇబ్రహీంపట్నం), నల్లకుంట సీఐ శ్రీనివాస్, రాయదుర్గం సీఐ రాంబాబులపై బదిలీ వేటు పడింది. జయరాం హత్య తర్వాత నిందితుడు రాకేష్‌రెడ్డి దాదాపు 11మంది పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు.

02/17/2019 - 05:54

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన రైల్వే కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల్లో అప్పట్లో సీఎం కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్, ఈ.

02/17/2019 - 05:13

కైకలూరు, ఫిబ్రవరి 16: కైకలూరు పరిసర ప్రాంతాల నుండి తాబేళ్లను ఇతర రాష్ట్రాలకు యధేచ్చగా తరలిస్తున్న లారీని శుక్రవారం రాత్రి స్థానిక అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. వన్యప్రాణ సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఫారెస్ట్ రేంజర్ బత్తిన విజయ తెలిపారు.

02/17/2019 - 05:05

కేశంపేట, ఫిబ్రవరి 16: రోడ్డు పక్కన ఉన్న దిమ్మెకు కారు ఢీకొన్న ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైపోయిందని కేశంపేట పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి కేశంపేట మండలం బోధునంపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన ఉన్న దిమ్మెను ఢీకొనడంతో ఆడి కారు పూర్తిగా దగ్ధమైపోయింది.

02/17/2019 - 05:04

ఉప్పల్, ఫిబ్రవరి 16: నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ పైనుంచి ప్రమాదవశాత్తు జారిపడి కార్మికుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా చందనపల్లి గ్రామానికి చెందిన అజయ్ నెహాక్(22) కార్మికుడు. చిల్కానగర్ రోడ్డులోని గణేష్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న అపురూప జగపతి హైట్స్‌లో పని చేస్తున్నాడు. ఐదో అంతస్తు పైనుంచి ప్రమాదశాత్తు జారి కింద పడ్డాడు.

02/17/2019 - 05:04

తాండూరు, ఫిబ్రవరి 16: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్‌కు గురై ఒకరు మృతిచెందారు. మృతుడి బంధువులు, గ్రామస్థులు, బషిరాబాద్ మండల పోలీసుల సమాచారం మేరకు సంఘటన వివరాలిలా ఉన్నాయి.

02/17/2019 - 05:03

నేరేడ్‌మెట్, ఫిబ్రవరి 16: వ్యక్తి వద్ద ప్లాట్లు కొనుగొలు చేసి డబ్బులు అడిగితే గన్‌తో బెదిరించేందుకు ప్రయత్నించిన ఎనిమిది మందిని అరెస్టు చేసిన సంఘటన నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం మల్కాజిగిరి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను ఏసీపీ శివకుమార్ వెల్లడించారు. నేరేడ్‌మెట్ మధురానగర్‌లో నివసించే రామనర్సింహులు సిమెంట్ వ్యాపారి.

Pages