S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/08/2018 - 01:01

గజపతినగరం, జూలై 7: మండలంలోని జిన్నాం గ్రామంలో అక్రమంగా మద్యం బెల్టుషాపు నిర్వహిస్తున్న తెప్పల వెంకన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 111 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని గజపతినగరం సబ్ ఇన్‌స్పెక్టర్ పి. వరప్రసాద్ శనివారం విలేఖరులకు తెలిపారు. ఇక నుండి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

07/08/2018 - 00:45

ఉరవకొండ, జూలై 7 : పట్టణంలోని ఇందిరానగర్‌లో ఆటో ఢీకొనడంతో వన్నూరమ్మ (71) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఇందిరానగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయం నడుచుకుంటూ వెళ్తున్న వన్నూరమ్మను ఆటో ఢీకొంది. దీంతో వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తెలిపారు.

07/08/2018 - 00:44

చెనే్నకొత్తపల్లి , జూలై 7 : భార్య తన భర్తను కడతేర్చిన సంఘటన గురువారం రాత్రి జరిగిన విషయం విదితమే. అయితే మంగలి నగేష్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను శనివారం రామగిరి సీఐ యుగంధర్, ఎస్‌ఐ మహమ్మద్ఫ్రీలు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. చెనే్నకొత్తపల్లికి చెందిన నగేష్‌కు 14 సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన వరలక్ష్మితో వివాహం అయినది. వీరికి బాలాజీ, ముఖేష్‌లు సంతానం కలరు.

07/08/2018 - 00:43

అమరాపురం, జూలై 7 : మండల పరిధిలోని ఉదగూరుకు చెందిన అశ్వినీ (25) శనివారం కడుపునొప్పి తాళలేక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అశ్వినీ కొంతకాలంగా కడుపునొప్పితో బాధ పడుతుండటంతో కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

07/07/2018 - 04:07

ముకరంపుర కరీంనగర్, జూలై 6: ఆదాయానికి మించి ఆస్థులు కలిగి ఉన్నాడన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు నీటిపారుదల శాఖ సీఇ సురేష్ కుమార్ ఇంటిపై దాడులు నిర్వహించారు. జిల్లాలో వివిధ స్థాయిలో పనిచేసిన కొంకిమల్ల సురేష్ కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ కృష్ణ బేసిన్‌లో సిఇగా విధులు నిర్వహిస్తున్నారు.

07/07/2018 - 03:55

ఆదిలాబాద్, జూలై 6: ప్రజల ఆరోగ్యాన్ని హరించే గుట్కాను ప్రభుత్వం నిషేధించినప్పటికీ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా యథేచ్ఛగా కోట్లాది రూపాయల అక్రమ వ్యాపారం సాగుతోంది. మహారాష్ట్ర నుంచి గుట్కా, జర్దా, మత్తు పదార్థాలు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా రవాణా జరుగుతున్నట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది.

07/07/2018 - 02:21

ఉప్పల్, జూలై 6: అవినీతి నిరోధక శాఖ పేరుతో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం కోర్టుకు రిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం విజయవాడ ప్రకాష్‌నగర్‌లో నివసిస్తున్న బాలాజీ జశ్వంత్ (35) రామంతాపూర్‌లో నివసిస్తూ జీహెచ్‌ఎంసీ అసిస్టెంట్ డైరెక్టర్ చార సుకునందన్ రెడ్డిని బెదిరిస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.

07/07/2018 - 02:16

హైదరాబాద్, జూలై 6: ఆస్తి తనఖా రుణాల పేరుతో అమాయకులను మోసం చేసి లక్షల్లో దోచుకుంటున్న ముగ్గురిని టాస్క్ఫోర్స్ అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి రూ.45 లక్షల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలను నగర సిపి అంజనీకుమార్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరించారు. నిందితులు సతీషన్ పాలయాడ్ (63), ఎస్.రామ్ నివాస్ (38), ఎస్ హరినివాస్ (40)ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

07/07/2018 - 02:15

హైదరాబాద్, జూలై 6: నగరంలోని జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లో కానిస్టేబుల్ తన ఏకే 47 తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది. కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడా లేదంటే ప్రమాదవశాత్తు పేలిందా అని జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

07/07/2018 - 02:13

వనస్థలిపురం, జూలై 6: క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడిన ఐదుగురు వ్యక్తులను ఎల్బీ నగర్ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. రూ.2లక్షల 9వేలు నగదు, బెట్టింగ్‌కు ఉపయోగించిన ల్యాప్ ట్యాప్‌లు, టీవీలు, క్రిడిట్ కార్డ్సు, డెబిట్ కార్డ్సు, సెల్‌ఫోన్, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

Pages