S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

07/07/2018 - 01:22

చిత్తూరు, జూలై 6: జిల్లాలోని మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఆరుగురు రౌడీ షీటర్లపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు.

07/07/2018 - 00:13

కర్నూలు, జూలై 6 : కర్నూలు వైద్య కళాశాలలో ర్యాగింగ్ భూతం మరో నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ కళాశాలలో గురువారం అర్ధరాత్రి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షప్రణీత్‌రెడ్డి(18) ఆత్మహత్యకు పాల్పడడంతో ర్యాగింగ్ భూతం వెలుగులోకి వచ్చింది. కడప నగరానికి చెందిన రామాంజులురెడ్డి కుమారుడు హర్షప్రణీత్‌రెడ్డి కర్నూలు మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్నాడు.

07/07/2018 - 00:12

ఆదోనిటౌన్, జూలై 6:మండల పరిధిలోని గోనబావి గ్రామానికి చెందిన మహిళా రైతు మల్కాబీ పొలంలో శుక్రవారం రెవెన్యూ అధికారులు సర్వే పనులు చేపట్టారు. దీంతో అధికారులు తన పొలం స్వాధీనం చేసుకుంటారోనన్న భయంతో మల్కాబీ పొలంలోనే పురుగుల ముందు తాగి తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషయంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించాలని వైద్యులు సూచించారు.

07/07/2018 - 00:10

గడివేముల, జూలై 6:స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలోని బిలకలగూడూరు గ్రామానికి చెందిన చిన్న చిట్టెపు చెన్నపురెడ్డి కుమార్తె హన్సిక(20నెలలు) శుక్రవారం ఉదయం స్కూల్ వ్యాన్ టైరు కింద పడి మృతిచెందింది. ఉదయం గడివేముల గ్రామంలోని సెయింట్ పాల్స్ పాఠశాలకు చెందిన వ్యాన్ బిలకలగూడూరు గ్రామానికి చెందిన విద్యార్థులను ఎక్కించుకుని తిరుగు ప్రయాణంలో హన్సికను ఢీకొంది.

07/07/2018 - 00:09

మిడుతూరు, జూలై 6:మండల పరిధిలోని జలకనూరు గ్రామానికి చెందిన దేవన్న కుమారుడు దేవదాసు(28) అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. అలగనూరు రిజర్వాయర్ కట్టపై గత రెండు రోజులుగా ఒక బైక్, పక్కనే చెప్పుల జత వుండడంతో అనుమానం వచ్చిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

07/06/2018 - 23:59

చేజర్ల, జూలై 6: మండలంలోని తిరుపతినాయుడుపల్లిలో ఒక ఇంటిలో అక్రమంగా నిలువ చేసిన లక్ష రూపాయల విలువైన ఐదు ఎర్రచందనం దుంగలను శుక్రవారం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. ముందుగా అందిన సమాచారం మేరకు డీఆర్‌వో రమణయ్య తన సిబ్బందితో దాడి చేసి దుంగలతో పాటు నిందితుడు పెంచల ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు చేజర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

07/06/2018 - 23:54

మార్కాపురం, జూలై 6: రెండురోజుల కిందట కందుకూరు డివిజన్‌లోని తర్లుపాడు మండలంలో సుమారు 300 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోగా 24 గంటలు గడవకముందే మార్కాపురం పట్టణంలో 310 బస్తాల రేషన్ బియ్యాన్ని, లక్షా 5వేల రూపాయల నగదు, కాటా మిషన్, లారీని స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం అర్థరాత్రి జరిగింది.

07/06/2018 - 23:20

ఏలూరు, జూలై 6 : చేపల లోడుతో వెళుతున్న ఒక లారీ అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. పెదపాడు మండలం వీరమ్మకుంట నుంచి చేపల లోడుతో ఏలూరు వచ్చేందుకు ముప్పర్రు మీదుగా శుక్రవారం లారీ బయలుదేరింది. కొద్దిదూరం వచ్చిన అనంతరం రోడ్డు అధ్వాన్నంగా ఉండడం, అదుపు తప్పి బోల్తా పడింది.

07/06/2018 - 02:50

జీడిమెట్ల, జూలై 5: చిన్నపిల్లలను టార్గెట్ చేసుకున్న దొంగలు ఎత్తుకెళ్లి ఒంటి పై ఉన్న ఆభరణాలను దొంగిలించుకుని పరారవుతున్నారు. ఇలాంటి ఘటనలు సూరారంలో కలకలం రేకితిస్తున్నాయ. వివరాల్లోకి వెళ్తే.. సూరారం కాలనీలో నివాసముండే యాదగిరి, సరిత దంపతులకు ప్రణతి (6) కుమార్తె. ఓ గుర్తుతెలియని మహిళ వచ్చి ఓ ఇంట్లో పని చేస్తున్నామని నమ్మించింది. సరిత కుమార్తె ప్రణతికి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లింది.

07/06/2018 - 02:48

హైదరాబాద్, జూలై 5: నగరంలో సంచలనం సృష్టించిన ఆరు రోజుల పసిపాప అపహరణ కేసులో నిందితురాలు నైనా రాణి (30)ని అరెస్టు చేశారు. ఈ నెల 2న కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి కేంద్రం నుంచి పాపను టీకా వేయించి తీసుకు వస్తానని చెప్పి గుర్తు తెలియని మహిళ పరారైన సంగతి తెలిసిందే.

Pages