S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/19/2018 - 23:42

హైదరాబాద్, ఫిబ్రవరి 19: బ్యాంక్ అక్కౌంట్ల నుంచి ఆ ఖాతాదారులకు తెలియకుండా నగదు బదిలీ చేసి చోరీ చేస్తున్న ఇద్దరిని హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. జార్ఖండ్‌కు చెందిన సుభాష్‌కుమార్, మనోజ్‌కుమార్ బాల్ అనే ఇద్దరిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి సిసిఎస్ డిసిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

02/19/2018 - 23:40

హైదరాబాద్, ఫిబ్రవరి 19: అవినీతి కేసులో నిందిత అధికారికి ఎసిబి కేసుల ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష, ఐదు వేల రూపాయల జరిమాన విధించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ఎసిబి డిజి కార్యాలయం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2010లో కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో ల్యాండ్ రికార్డ్సు విభాగంలో పని చేసే డిప్యూటీ సర్వేయర్ ఎడ్ల పోచయ్య రూ.6 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కాడు.

02/19/2018 - 23:36

హైదరాబాద్, ఫిబ్రవరి 19: కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వైద్యులకు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల రిక్రూట్‌మెంట్‌లో వెయిటేజీ ఇస్తామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన బెంచ్ ముందు అడ్వకేట్ జనరల్ డి ప్రకాశ్‌రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసిన కాలానికి ఈ వెయిటేజీ ఇస్తామని అన్నారు.

02/19/2018 - 01:20

కులకచర్ల/పరిగి, ఫిబ్రవరి 18; కులకచర్లకు చెందిన భారతీయ జనతా యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గుడాల రవి మృతిపై నెలకున్న మిస్టరీని రక్షకభటులు ఛేదించారు.

02/19/2018 - 01:00

సైదాపూర్, ఫిబ్రవరి 18: మండలంలోని గుజ్జులపల్లి గ్రామానికి చెందిన జంపాల రమేష్ (40) అనే కౌలు రైతు పురుగుల మందు తాగి ఆదివారం మృతి చెందాడు. సైదాపూర్ ఎస్‌ఐ నూతి శ్రీ్ధర్ తెలిపిన ప్రకారం.. గ్రామంలో రెండెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు.

02/19/2018 - 00:57

సిరిసిల్ల, ఫిబ్రవరి 18: సిరిసిల్ల పట్టణంలోని సాయినగర్‌లో ఒక కిరాణం వ్యాపారి ఇంటిపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి జరిపి రూ.50 వేల విలువ గల నిషేదిత గుట్కా, అంబర్లు, ఇతర పాన్ మసాలాలు పట్టుకున్నారు. ఆదివారం టాస్క్ ఫోర్స్ సీఐ బన్సీలాల్ ఆధ్వర్యంలో సాయినగర్‌లోని పడకండి వెంకటేశం(32) అనే వ్యాపారికి చెందిన కిరాణ దుకాణంపై దాడి చేసి సోదాలు నిర్వహించారు.

02/19/2018 - 00:56

జగిత్యాల రూరల్, ఫిబ్రవరి 18: జగిత్యాల మండలం పోలాస వ్యవసాయ పరిశోధన స్థానం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చిలుకమర్రి ఉపేంద్ర (27) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రూరల్ ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం ధర్మపురి నుండి జగిత్యాల వైపుకు వస్తుండగా, రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నారు.

02/19/2018 - 00:16

తిప్పర్తి, ఫిబ్రవరి 18: అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన గుండెబోయిన సైదులుముదిరాజ్(34) గత 10 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..నల్లగొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

02/19/2018 - 00:09

ఒంగోలు, ఫిబ్రవరి 18: ఒంగోలు నగరంలోని మొదటి సమ్మర్ స్టోరేజి ట్యాంకు నీటిలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ సిఐ గంగా వెంకటేశ్వర్లు అందించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

02/19/2018 - 00:08

సంతమాగులూరు పిబ్రవరి 18: మతి స్థిమితంలేని మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బల్లికురవ మండలం ముక్తేశ్వరం గ్రామంలో ఆదివారం వెలుగుచూసింది. బల్లికురవ ఎస్సై అనూక్ తెలిపిన వివరాల ప్రకారం ముక్తేశ్వరం గ్రామనికి చెందిన కొండేటి అంజమ్మ(30) గత పదేళ్లుగా మతిస్థిమితం కోల్పోయి సంచరిస్తుంది. ఈమె రెండు రోజులుగా గ్రామంలో కనిపించలేదు.

Pages