S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/19/2018 - 00:08

పెద్దారవీడు, ఫిబ్రవరి 18: మండలంలోని ఓబులక్కపల్లి గ్రామసమీపంలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పెద్దారవీడు ఎస్సై పి ముక్కంటి ఆదివారం తెలిపారు. పొలాల్లోని కాలువలో మృతదేహం పడి ఉందని, అందిన సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి మృతదేహాన్ని పరిశీలించామని, అయితే ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని తెలిపారు. మృతదేహాన్ని మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించామని తెలిపారు.

02/19/2018 - 00:02

కోవూరు, ఫిబ్రవరి 18: నందలగుంటకు సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కావలి నుండి నెల్లూరు వైపు వెళుతున్న లారీని మోటార్ సైకిలిస్టు వెనుక వైపు నుంచి ఢీకొనడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి జలదంకి మండలం బ్రాహ్మణకాకకు చెందిన ఎస్ ఏడుకొండలుగా గుర్తించారు.

02/18/2018 - 22:51

ఆత్మకూరు, ఫిబ్రవరి 18:ఆత్మకూరు పట్టణ శివారులో ఆదివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. ఆత్మకూరు డీఎస్పీ మాధవరెడ్డి, సీఐ క్రిష్ణయ్య తెలిపిన వివరాలు.. పాములపాడు మండల పరిధిలోని భానుముక్కల గ్రామానికి చెందిన మల్లికార్జున(30) భార్య మహాలక్ష్మితో గొడవపడి నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

02/18/2018 - 22:47

అశ్వారావుపేట, ఫిబ్రవరి 18: మండల పరిధిలోని కొత్తూరు గ్రామానికి చెందిన పరివి రాంరెడ్డి (68) వృద్ధుడు టిప్పర్ ఢీకొనడంతో ఆదివారం మృతిచెందాడు. గ్రామసమీపంలోని బ్రిడ్జి వద్ద నిలబడివున్న రాంరెడ్డిని అశ్వారావుపేట నుండి కొత్తూరు వైపు వస్తున్న టిప్పర్ ఢీకొనడంతో రెండు కాళ్ళు విరిగిపోయి తీవ్రగాయాలయ్యాయి.

02/18/2018 - 22:46

ఇల్లెందు, ఫిబ్రవరి 18: పట్టణ సమీపంలో ఉన్న కోటిలింగాల ప్రాంతంలో ఆదివారం బైక్ అదుపుతప్పడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఇల్లెందు, మహబూబాబాద్ ప్రాంతాల మధ్యగల ప్రధాన రహదారిపై బైక్‌పై వెళ్తున్న వీరభద్రం (34)అనే వ్యక్తి బైక్ అదుపుతప్పి లోయలోపడడం వలన ఈదుర్ఘటన జరిగింది.

02/18/2018 - 22:34

ఒంటిమిట్ట, ఫిబ్రవరి 18:కడప-చెన్నై జాతీయ రహదారిలోని మండల కేంద్రమైన ఒంటిమిట్ట చెరువులో ఆదివారం అనుమానస్పదస్థితిలో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలు పురుషులుగా ఉన్నాయి. వీరంతా లుంగీ, చొక్కా ధరించి ఉన్నారు. మృతదేహాల తీరుపై పలు ఆరోపణలు గుప్పుమంటున్నారు. వీరు ఏమైనా ఎర్రచందనం కూలీలా, వ్యవసాయ కూలీలా అన్న అనుమానాలు చూసినవారిలో తలెత్తుతున్నాయి. మృతదేహాలను చూసేవారిని శోకసముద్రంలో ముంచుతుంది.

02/18/2018 - 02:47

విజయవాడ, ఫిబ్రవరి 17: ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో ఉద్యోగాల కోసం పరితపిస్తున్న నిరుద్యోగులను కొందరు ఇట్టే మోసగిస్తున్నారు. అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు ఏకంగా ఫోర్జరీ సంతకాలతో నియామక ఉత్తర్వులను జారీ చేస్తుంటే ఆ పిదప వాస్తవాలు తెలుసుకుని బాధితులు లబోదిబోమంటున్నారు. కడప ఆర్టీసీ రీజియన్‌లో ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టు కోసం షేక్ మహ్మద్ అనే వ్యక్తికి ఓ దళారి నుంచి నియామక పత్రం అందింది.

02/18/2018 - 01:50

హైదరాబాద్, ఫిబ్రవరి 17: త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల వీధి వ్యాపారుల కోసం వీధి వ్యాపార జోన్లను ఏర్పాటు చేస్తామని, ఈ విషయమై నోటిఫికేషన్ జారీ చేస్తామని, ప్రస్తుతం వీధి వ్యాపారులపై సర్వే నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా 67,313 మంది వీధి వ్యాపారులు ఉన్నారని, ఇంకా సర్వే కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు.

02/18/2018 - 01:49

మచిలీపట్నం, ఫిబ్రవరి 17: అగ్రిగోల్డ్ మాదిరిగా ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టి గత మూడేళ్లుగా పరారీలో ఉన్న బొమ్మరిల్లు ఫారమ్స్ అండ్ విల్లాస్ అధినేత రాయల రాజాను ఎట్టకేలకు సీఐడీ అధికారులు పట్టుకుని శనివారం మచిలీపట్నం సబ్ జైలుకు పంపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

02/18/2018 - 01:04

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లబ్ధి చేకూర్చిన ఇద్దరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) అధికారులను సీబీఐ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పీఎన్‌బీలో చోటుచేసుకున్న 11,400కోట్ల రూపాయల కుంభకోణం కేసులో సూత్రధారి నీరవ్ మోదీకి ఈ అధికారులు ఇద్దరూ సహకరించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. అరస్టయిన ఇద్దరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల్లో ఒకరు ఇటీవలే పదవీ విరమణ చేశారు.

Pages