S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/17/2018 - 00:08

పెదపూడి, ఫిబ్రవరి 16: అక్రమ సంబంధం నేపథ్యంలో ప్రియురాలిపై అనుమానంతో వివాహిత మహిళను ఆమె ప్రియుడే హత్య చేసి ఎవరికీ అనుమానం కలగకుండా కాలువ గట్టుపై పూడ్చివేసిన ఘటన మండలంలోని అచ్యుతాపురత్రయంలో జరిగింది. దీంతో గ్రామం ఉలిక్కిపడింది.

02/17/2018 - 00:05

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16: జిల్లాలో నిర్వహించిన దాడుల్లో రూ. 18.14 లక్షల విలువైన 124.25 టన్నుల ఎరువులను సీజ్ చేయడం జరిగిందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీ రెడ్డి గంగాధరరావు తెలియజేశారు.

02/17/2018 - 00:02

వి.కోట, ఫిబ్రవరి 16: మండల కేంద్రమైన వి.కోటలో తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి సభ్యురాలు శుక్రవారం హత్యకు గురయ్యారు. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వి.కోట 1 ఎంపిటిసి సభ్యురాలుగా భాగ్యలక్ష్మి(45) వైకాపా తరపున గెలుపొందింది. ఇటీవల పార్టీ మారి తెలుగుదేశం సభ్యురాలుగా కొనసాగుతున్నారు. సత్యసాయి నగర్‌లోని సరిత ఇంటిలో నివసిస్తున్నారు.

02/16/2018 - 23:59

మదనపల్లె, ఫిబ్రవరి 16: మదనపల్లె మున్సిపల్ ఉద్యోగి సుధాకర్‌ను సస్పెండ్ చేస్తు శుక్రవారం కమీషనర్ భవానిప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. తాను ఏతప్పు చేయకుండానే సస్పెన్షన్ ఎందుకు చేశారంటూ సుధాకర్ కార్యాలయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మున్సిపల్ మేనేజర్ ఫిర్యాదుతో వన్‌టౌన్ ఎస్‌ఐ సుమన్ సుధాకర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

02/16/2018 - 23:48

శెట్టూరు, ఫిబ్రవరి 16 : మండల పరిధిలో శుక్రవారం యాటకల్లు గ్రామంలో గొల్ల శివ (20) శుక్రవారం ఇంట్లో దూలానికి లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు శివకు ఈమధ్యనే తల్లిదండ్రులు చనిపోయారు. ఈనేపథ్యంలో తనకు ఎవరూ దిక్కు లేరని విరక్తి చెంది ఇంట్లో ఉన్న దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

02/16/2018 - 23:47

బత్తలపల్లి, ఫిబ్రవరి 16: అనంతపురం- కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని రాగవంపల్లి బస్టాపు సమీపంలో శుక్రవారం ఆటోను లారీని ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

02/16/2018 - 23:47

హిందూపురం రూరల్, ఫిబ్రవరి 16 : పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన అనిల్‌కుమార్ శుక్రవారం మలుగూరు వద్ద రైలు కిందపడి మృతి చెందాడు. అనిల్‌కుమార్ కొంతకాలంగా విచ్చలవిడిగా తిరిగేవాడని, గురువారం ఇంటి నుంచి వెళ్లి శుక్రవారం శవమై కనిపించాడని బంధువులు తెలిపారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

02/16/2018 - 03:33

చీరాల, ఫిబ్రవరి 15: రైలు కింద పడి వివాహితతో పాటు ఓ యువకుడు మృతి చెందిన సంఘటన వేటపాలెం మండలంలో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు చీరాల లోని ఎంజి హెచ్ కాలనీకి చెందిన చీరాల సాయిరామ్(24)కు జాండ్రపేటకు చెందిన పి రమ్య(24)తో చదువుకునే సమయం నుంచి పరిచయం ఉంది. అయితే రమ్యకు వేరే వ్యక్తితో వివాహం జరిగింది.

02/16/2018 - 03:09

కడప, ఫిబ్రవరి 15: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అశోక్‌కుమార్ అగర్వాల్(57)ను కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఇతని నుంచి రూ. 4 కోట్ల విలువ చేసే ఎర్రచందనం దుంగలు, చందనం బొమ్మలు స్వాధీనం చేసుకున్నారు. అగర్వాల్ స్వస్థలం రాజస్తాన్ రాష్ట్రం జైపూర్ సిటీ. ఇండోనేషియాకు చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అలీబాయికి అగర్వాల్ ప్రధాన అనుచరుడు.

02/16/2018 - 02:36

హైదరాబాద్/ఉప్పల్, ఫిబ్రవరి 15: చిల్కానగర్‌లో సంచలనం సృష్టించిన చిన్నారి బలి కేసును పోలీసులు చేధించారు. తల లభ్యమైన ఇంటి యజమాని క్యాబ్ డ్రైవర్ కేరుకొండ రాజశేఖర్ గౌడ్ అసలు నిందితుడని పోలీసుల విచారణలో వెల్లడయింది. భార్య శ్రీలత ఆరోగ్యం, ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకే నరబలి ఇచ్చినట్టు పోలీసుల ముందు నిందితుడు రాజశేఖర్ ఒప్పుకున్నాడు. ఈ కేసు వివరాలను కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు.

Pages