S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/17/2018 - 23:44

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్ కాలేజీలు డిఇడి కోర్సులను నిర్వహించడంపై వస్తున్న అభియోగాలు, అవకతవకలపై విచారణ చేయాలని హైకోర్టు నిర్ణయించింది. కర్నూలు ఎస్‌విఎన్‌డిఇడి కాలేజీకి చెందిన విద్యార్థులు పంపిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కాలేజీ యాజమాన్యాల అవకతవకల వల్ల తమ భవిష్యత్తు దెబ్బతింటోందన్నారు. ఈ పిల్‌ను విచారిస్తామని హైకోర్టు పేర్కొంది.

02/17/2018 - 02:07

గచ్చిబౌలి, ఫిబ్రవరి 16: కొండాపూర్‌లో కారు బీభత్సం సృష్టించింది. కారు నడుపుతున్న వ్యక్తి.. పీకలదాక మద్యం సేవించి అతివేగంగా వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీకొట్టాడని స్థానికలు చెప్పారు. కారు యజమానిని పోలీసులు కాపాడేందుకు, నిందితుని వివరాలు గోప్యంగా ఉంచేందుకు విశ్వప్రయత్నం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.

02/17/2018 - 02:02

శంకర్‌పల్లి ఫిబ్రవరి 16: స్నేహితునిగా నటిం చి ఇల్లు కొనిస్తానని ఓ వ్యక్తి వద్ద రూ.21లక్షలు కాజేసిన సంఘటన శంకర్‌పల్లిలో జరిగింది. చేవెళ్ల ఏసీపీ టీ.స్వామి శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మండల పరిధిలోని సింగాపురం, క్రిస్టల్ కాలనీలో మున్నూరు జగదీశ్వర్ తమ తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు.

02/17/2018 - 02:00

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న కేసులో ప్రధాన నిందితుడు హెచ్‌ఎండీఏ డైరెక్టర్ పురుషోత్తమ్ రెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. గత 15 రోజులుగా కనిపించకుండా పోయిన అతను అనూహ్యంగా శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ న్యాయస్థానంలో లొంగిపాయారు. ఈ కేసును విచారించిన కోర్టు ఆయనకు రెండు వారాల పాటు జ్యూడీషల్ కస్టడీ విధించింది.

02/17/2018 - 01:56

రేగొండ, ఫిబ్రవరి 16: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనపర్తిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కనపర్తి గ్రామానికి చెందిన మునిగాల రాజసమ్మయ్య (60) తనకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిలో గత ఏడాది మిర్చి, పత్తి పంటలను సాగు చేశాడు. గిట్టుబాటు ధర లేకపోవడంతో కళ్లాల్లోనే మిర్చిని తగులబెట్టాడు.

02/17/2018 - 01:52

సిరిసిల్ల, ఫిబ్రవరి 15: రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న మందాడి గోపాల్‌రెడ్డి(56) గురువారం సిరిసిల్ల కార్గిల్ లేక్‌లో శవమై తేలాడు. కొంత కాలం క్రితం సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న సమయంలో అవినీతి నిరోధక శాఖకు లంచం తీసుకుంటూ పట్టుబడిన గోపాల్‌రెడ్డి, ఇటీవలే తిరిగి డ్యూటీలో చేరి ప్రస్తుతం వేములవాడ రూరల్ మండల రెవెన్యూ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు.

02/17/2018 - 01:51

కరీంనగర్ (లీగల్), ఫిబ్రవరి 15: పోలీస్ శాఖలో ఎఎస్‌ఐగా ఉద్యోగం చేస్తూ రెండు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసీబీ అధికారులకు పట్టుబడ్డ ఎఎస్‌ఐ బుజ్జనగారి వేణుగోపాల్ (56)కు కరీంనగర్ ఎసీబీ కోర్టు న్యాయమూర్తి భాస్కర్‌రావు గురువారం సంవత్సరం జైలుశిక్ష విధించారు.

02/17/2018 - 01:31

తిప్పర్తి, ఫిబ్రవరి 16: మండలంలోని తానేదార్‌పల్లి గ్రామానికి చెందిన యువ రైతు బొంత వీరయ్య(28) తనకున్న మూడెకరాలతో పాటు ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. పంట దిగుబడి సరిగా రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు.

02/17/2018 - 00:27

నందికొట్కూరు/కర్నూలు, ఫిబ్రవరి 16:పట్టణానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పఠాన్ హనీఫ్‌ఖాన్(50) వారం రోజుల క్రితం అదృశ్యం కాగా, శుక్రవారం కర్నూలు సమీపంలోని హంద్రీనీవా కాలువలో శవమై తేలాడు. వారం రోజుల క్రితం కర్నూలుకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన పఠాన్‌ఖాన్ ఆ రోజు నుంచి కన్పించకుండాపోవడంతో అతడి కుటుంబీకులు ఈ నెల 11వ తేదీ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

02/17/2018 - 00:27

క్రిష్ణగిరి, ఫిబ్రవరి 16:మండల పరిధిలోని కంబాలపాడు గ్రామం వద్ద ప్రవహిస్తున్న హంద్రీనీవా కాలువలో కాలుజారి ప్రమాదవశాత్తూ పడి శ్రీనివాసులు(24) మృతి చెందాడని ఎస్‌ఐ విజయభాస్కర్ తెలిపారు. అనంతపురం నగరంలోని సోమనాథ్‌నగర్ కాలనీకి చెందిన శ్రీనివాసులు అనంతయ్య బోర్‌వెల్స్ మిషన్‌లో వర్కర్‌గా పని చేస్తున్నాడు.

Pages