S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

02/21/2018 - 02:03

జమ్మికుంట, ఫిబ్రవరి 20: జమ్మికుంట మండలంలోన వావిలాల గ్రామ పంచాయితీ పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన దుగ్యాల కోంరయ్య (35) అనే యువ రైతు మంగళవారం విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివారాల ప్రకారం నాగారం గ్రామానికి చెందిన దుగ్యాల కోంరయ్య తన పోలానికి నీరు పెట్టేందుకు వెళ్ళాడు.

02/21/2018 - 01:37

హైదరాబాద్, ఫిబ్రవరి 20: బంజారాహిల్స్‌లోని లగ్జరీ మసాజ్ సెంటర్ యజమానిని బెదిరించేందుకు యత్నించిన నలుగురు పోలీసులు అడ్డంగా దొరికి పోయారు. రోడ్డు నెంబర్ 10లోని లగ్జరీ మసాజ్ సెంటర్‌కు వెళ్ళిన నలుగురు పోలీసులు తాము టాస్క్ఫోర్సు పోలీసులమని, మసాజ్ పేరిట వ్యభిచారం చేయిస్తున్నారంటూ యజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేశారు.

02/21/2018 - 01:33

జీడిమెట్ల, ఫిబ్రవరి 20: ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించి విక్రయానికి పెట్టిన ఇద్దరు వ్యక్తుల పై బాచుపల్లి పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అదుపులో మాజీ కార్పొరేటర్ ఉన్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే బాచుపల్లి సర్వేనెంబర్ 140, 141లోని 32 ఎకరాల స్థలంపై సంవత్సరం క్రితం ఫోర్జరీ డాక్యుమెంట్లను సృష్టించారు.

02/21/2018 - 01:01

నెల్లూరు, ఫిబ్రవరి 20: అగ్నిసాక్షిగా మూడు ముళ్లు వేసిన భర్త అనారోగ్యానికి గురికావడంతో ఆందోళన చెందిన భార్య అసువులు బాసిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంతపేటకు చెందిన గాదంశెట్టి రాధాకృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. గత పక్షం రోజులుగా బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో స్థానిక బృందావనంలోని మరో ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

02/21/2018 - 00:55

మిడుతూరు, ఫిబ్రవరి 20:మండల పరిధిలోని జలకనూరు గ్రామంలో మంగళవారం భవన నిర్మాణ కార్మికుడు సయ్యద్ అజ్మత్‌బాషా(43) ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. వివరాలు.. నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబాపేటలో నివాసం వుంటున్న అజ్మత్‌బాషా గౌండ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు.

02/21/2018 - 00:50

భద్రాచలం టౌన్, ఫిబ్రవరి 20: పోడు భూమి విషయంలో తలెత్తిన వివాదాలు.. తమ బంధువులను మంత్రాలు చేసి చంపాడనే నెపంతో ఇరువురు వ్యక్తులు కలిసి ఒకరిని అంతమొందించారు. కర్రలతో కొట్టి చంపి రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

02/21/2018 - 00:46

సత్తెనపల్లి, ఫిబ్రవరి 20: సత్తెనపల్లి నుండి మాచర్ల వెళ్ళు ప్రధాన రహదారిలోగల నరసరావుపేట అడ్డరోడ్డు వద్దగత చెక్‌పోస్టువద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తెనపల్లి మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన వివాహిత మహిళ మందడి రజని (32) మృతి చెందింది.

02/21/2018 - 00:28

సామర్లకోట, ఫిబ్రవరి 20: ఇద్దరు భార్యల వివాదం చినికిచినికి గాలి వానగా మారి న్యాయం కోసం రెండో భార్య పోలీసులను ఆశ్రయించడం, భర్త సామర్లకోట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దాపురం పట్టణానికి చెందిన దుర్గాప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం సామర్లకోట పోలీస్ స్టేషన్ వద్ద భార్యలతో ఘర్షణ పడి దోమల చక్రం వెలిగించే స్టాండుతో పీకకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

02/21/2018 - 00:17

హుకుంపేట, ఫిబ్రవరి 20: మండల కేంద్రంలో మంగళవారం ఉదయం చేపట్టిన వాహన తనిఖీల్లో 100 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్.ఐ.

02/21/2018 - 00:17

జి.మాడుగుల, ఫిబ్రవరి 20: మారుమూల ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా ఉన్న రాళ్లను తొలగించే యంత్రం బోల్తాపడిన ఘటనలో అనకాపల్లి మండలం దర్జీనగర్ గ్రామానికి చెందిన నారాయణ(45) మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే భీరం పంచాయితీ వంజర్భ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకోగా భీరం నుంచి గడ్డిబందలు వరకూ రోడ్డు పనులు చేయిస్తున్నారు.

Pages