-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఆదిలాబాద్, ఫిబ్రవరి 15: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మావోయిస్టు అగ్రనేత ఆజాద్ అలియాస్ చెరుకూరి రాజకుమార్, సీనియర్ జర్నలిస్టు హేమచంద్ర పాండే ఎన్‌కౌంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈమేరకు గురువారం ఆదిలాబాద్ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 29 మంది పోలీసులకు సమన్లు జారీ చేస్తూ కేసు విచారణకు ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ‘అత్యాచారం విలువ 6500 రూపాయలుగా వెలకడతారా? సమంజమేనా? ఇదేం పని’ అని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. లైంగిక దాడులకు గురైన మహిళలపట్ల మధ్యప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిలదీసింది. లైంగిక దాడులకు, అత్యాచారాలకు గురవుతున్న మహిళలను ఆదుకోవడంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 15: హైదరాబాద్ సమీపంలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి 10 కి.మీ పరిధిలో నిర్మాణాలను నిషేధిస్తూ జారీ చేసిన జీవో 111పై వచ్చే నెలలో పూర్తి స్థాయి విచారణ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. జీవో 111ను రాష్ట్రప్రభుత్వం సరిగా అమలు చేయడంలేదంటూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ వి రామసుబ్రహ్మణ్యం, జస్టిస్ టి అమర్‌నాథ్‌గౌడ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 15: జగన్ అక్రమాస్తుల కేసులో ఇందూ టెక్ జోన్ అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అభియోగాలను పరిగణనలోకి తీసుకుని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభసభ్యుడు విజయ్ సాయిరెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డికి సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.
ఘట్‌కేసర్, ఫిబ్రవరి 13: ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందగా కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలైన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధి జోడిమెట్ల సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
గచ్చిబౌలి, ఫిబ్రవరి 13: అక్రమ సంబంధంతో పాటు ఆర్థిక సమస్యలే గర్భిణి హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. నగరంలో తీవ్ర సంచలన సృష్టించిన మహిళను హత్య చేసి గోనె సంచిలో మూట కట్టి పడవేసిన కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. హత్యకు సంబంధించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేయగా మరో ఇద్దరిని బీహార్‌లో అదుపులోకి తీసుకున్నామని కమిషనర్ సందీప్ శాం డిల్య తెలిపారు.
పాతబస్తీ, ఫిబ్రవరి 13: ఇష్టం లేని వివాహం నిండు జీవితాన్ని బలితీసుకుంది. కాళ్ల పారాణి ఆరక ముందే నూతన వధువు జీవితాన్ని చీకట్లోకి నెట్టేసింది. మూడుముళ్ల బంధం మూడు నిద్రలతోనే తెగిపోయింది. నూతన వరుడు ప్రకాశం బ్యారేజీ మీద నుండి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇప్పటివరకూ రెండు కుటుంబాల్లో పండుగ వాతావరణం కాస్తా మహాశివరాత్రి నాడే విషాదంలోకి నెట్టింది.
గంగాధర, ఫిబ్రవరి 13: మండలంలోని కురిక్యాల గ్రామంలో కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై మంగళవారం లారీ ఢీకొనడంతో రక్షిత (9) అనే చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తన తల్లి వసంతతో కలిసి పండుగ సామానుకు వెళ్లి తిరిగి రోడ్ దాటుతుండగా కరీంనగర్ నుండి జగిత్యాల వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో తల, మొండెం వేర్వేరుగా పడాయి.
భీమ్‌గల్, ఫిబ్రవరి 13: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని పిప్రి గ్రామానికి చెందిన సంపంగి ఎల్లయ్య(40) అనే మేకల కాపరి చిరుతపులి దాడిలో మృతి చెందాడని భీమ్‌గల్ సీ.ఐ సైదయ్య తెలిపారు. ఎప్పటిలాగే తన భార్య గంగామణితో కలిసి ఎల్లయ్య మంగళవారం ఉదయం మేకలు మేపేందుకు పిప్రి గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. మధ్యాహ్న భోజనం కోసం అతని భార్య పిలిచినప్పటికీ పలుకకపోవడంతో ఆమె అటవీ ప్రాంతమంతా గాలించింది.
గోకవరం, ఫిబ్రవరి 13: ఆడుకునేందుకు వెళ్లిన అభం శుభం తెలియని అక్కాతమ్ముడు మండలంలోని తిరుమలాయపాలెం గ్రామంలోని ఊర చెరువు మింగేసింది. ఈ దుర్ఘటనతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. గోకవరం ఏఎస్సై సత్యనారాయణ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి..తిరుమలాయపాలెంకు చెందిన షేక్ నాగూర్ సాహెబ్ గ్రామంలో చికెన్ వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.