S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/10/2017 - 02:00

భద్రాచలం టౌన్, డిసెంబర్ 9: ఛత్తీస్‌గఢ్‌లో ఘోరం జరిగింది. సీఆర్‌పీఎఫ్ క్యాంపులో తోటి అధికారులు, సిబ్బందిపై జవాను విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు మృతిచెందారు. అందరూ క్యాంప్‌లో ఉన్న సమయంలో భీకరమైన కాల్పులతో జవాన్ విరుచుకుపడ్డాడు. కాల్పుల్లో ఇద్దరు ఎస్సైలు సహా మొత్తం నలుగురు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు.

12/10/2017 - 02:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిసెంబర్ 11 సోమవారం పార్టీ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినోత్సవ వేడుకలు పూర్తవడంతో, రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు సోమవారం ప్రకటించాలని కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జి ముల్లపల్లి రామచంద్రన్ నిర్ణయించినట్టు తెలిసింది.

12/09/2017 - 04:02

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు ఎన్‌డీఏ ప్రభుత్వానికి అగ్ని పరీక్షగా మారిన గుజరాత్ శాసనసభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ శనివారం జరుగబోతోంది. బీజేపీని భయపెట్టిస్తున్న పటేల్ వర్గం బాగా బలంగా ఉన్న సౌరాష్టత్రోపాటు దక్షిణ గుజరాత్‌లోని 89 సీట్లకు పోలింగ్ జరగనుంది.

12/09/2017 - 03:42

కిసమా (నాగాలాండ్), డిసెంబర్ 8: ఉజ్వల భవిష్యత్ దిశగా నాగాల ఆకాంక్షలను నెరవేర్చే శాంతిదినం ఎంతో దూరంలో లేదని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా పోరాటపథాన నడుస్తున్న నాగాల ఆకాంక్షలు నేరవేర్చడానికి కేంద్రం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు.

12/09/2017 - 03:42

వదోదర, డిసెంబర్ 8: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలయాల సందర్శన పెద్ద నాటకం అంటూ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. సయాజీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గ బిజెపి అభ్యర్థి జితేంద్ర సుఖాడియాకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆదిత్యనాథ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిపై నిప్పులు చెరిగారు.

12/09/2017 - 03:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: తన వ్యాఖ్యల వల్ల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం జరిగినా తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని బహిష్కృత కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ అన్నారు. ప్రధాని మోదీని కించపరచేలా వ్యాఖ్యానించినందుకు కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన మరుసటి రోజున మణి తన గళం విప్పారు.

12/09/2017 - 02:59

జెట్‌పూర్ (గుజరాత్), డిసెంబర్ 8: ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, చైనా సమస్యలు ప్రస్తావిస్తున్నారే తప్ప, గుజరాత్‌కు ఏం చేయాలనుకుంటున్నారో ప్రధాని నరేంద్ర మోదీ పెదవి విప్పటం లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మరో వందేళ్లు అధికారంలో ఉంటామని చెప్పుకుంటున్న మోదీకి, అందుకే ఏం చేయాలో, ఏం చేయబోతున్నారో చెప్పడం తెలీదా? అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు.

12/09/2017 - 02:58

అహ్మదాబాద్, డిసెంబర్ 8: అభివృద్ధి, ఐక్యతలే ప్రధాన ఎజెండాగా పేర్కొంటూ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతాపార్టీ తన మేనిఫెస్టోను ప్రకటించింది. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ మేనిఫెస్టోను శుక్రవారం ఇక్కడ విడుదల చేశారు. గుజరాత్‌లో తొలి విడత పోలింగ్ శనివారం జరుగనున్న నేపథ్యంలో మేనిఫెస్టోను ప్రకటించారు.

12/09/2017 - 02:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: రాజధాని ఢిల్లీలోని షాలిమార్‌బాగ్ మేక్స్ ఆసుపత్రి లైసెన్స్ రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసుపత్రిలో జన్మించిన కవలల్లో ఒకరు బతికి ఉన్నప్పటికీ ఇద్దరూ చనిపోయారని ప్లాస్టిక్ కవర్‌లో ప్యాక్ చేసి ఇచ్చేశారు. తీరా ఇంటికెళ్లి చూడగా ఒకరు ప్రాణంతోనే ఉన్నట్టు గమనించి కుటుంబ సభ్యులు హతాశులయ్యారు.

12/09/2017 - 02:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దళితుల సమస్యలను పరిష్కరించని పక్షంలో ఎపీ, తెలంగాణ ప్రభుత్వాలపై తాము ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని సీపీఐ పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. అఖిల భారత దళిత హక్కుల సమాఖ్య అధ్యక్షుడు ఆనందరావు నేతృత్వంలో తెలుగు రాష్ట్రాలలో దళితులపై దాడులు, సాంఘిక బహిష్కరణలపై ఢిల్లీలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

Pages