S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/22/2017 - 22:18

న్యూఢిల్లీ, నవంబర్ 22: తెలుగు రాష్ట్రాల్లో 2010-16 మధ్యకాలంలో తపాల శాఖలో గ్రామీణ్ డాక్ సేవక్ (జీడిఎస్) విభాగంలో కారుణ్య నియామకానికి అర్హత ఉండి తిరస్కరణకు గురైనవారికి ఉద్యోగ అవకాశం కల్పించాలని పోస్టల్ శాఖలో పనిచేసినవారి కుంటుబ సభ్యులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం కుటుంబ సభ్యులు కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా, పోస్టల్ ఉన్నతాధికారులను కలిశారు.

11/22/2017 - 22:18

పంచకుల, నవంబర్ 22: అల్లారుముద్దుగా చూసుకోవల్సిన తండ్రే పిల్లల పాలిట కాలయముడయ్యాడు. సొంత పిల్లలను బావమరిదితో చంపించిన కన్నతండ్రి ఘాతుక చర్య ఇది. హర్యానా కురుక్షేత్రలోని మోర్నీ అటవీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. సోనూ మాలిక్ ఓ ఫొటో స్టుడియో నడిపేవాడు. అతడికి ముగ్గురు పిల్లలు. సమీర్ (11), సిమ్రాన్ (8), సమర్ (4) ఉన్నారు.

11/22/2017 - 22:17

చండీగఢ్, నవంబర్ 22: భర్తను దారుణంగా చంపేసి మృతదేహాన్ని ఎనిమిది ముక్కలు చేసిన ఓ మహిళకు హర్యానా కోర్టు 30 ఏళ్లు జైలుశిక్ష విధించింది. హర్యానాలోని అసందా అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గత ఏడాది ఏప్రిల్‌లో పూజ అనే వివాహిత తన భర్త బల్జీత్ (38)ను దారుణంగా హత్య చేసింది. ఇంకా కసితీరక భర్త శవాన్ని ఎనిమిది ముక్కలు చేసింది.

11/22/2017 - 03:23

భావ్‌నగర్, నవంబర్ 21: గుజరాత్ శాసనసభ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగుతున్న సమరం కాదని, నిజానికి ఇది కులతత్వానికి, అభివృద్ధికి మధ్య జరుగుతున్న యుద్ధమని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ కులతత్వానికి, వారసత్వ రాజకీయాలకు ప్రతీకగా ఉండగా, ప్రధాని నరేంద్ర మోదీ విధానాలు అభివృద్ధికి సరికొత్త మార్గాలు తెరిచాయని ఆయన మంగళవారం ఇక్కడ జరిగిన బీజేపీ ర్యాలీలో అన్నారు.

11/22/2017 - 03:21

న్యూఢిల్లీ, నవంబర్ 21: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం లేదని, అందుకే పార్లమెంటు శీతాకాల సమావేశాలను నిర్వహించడం లేదని కాంగ్రెస్ తీవ్రంగా దుయ్యబట్టింది.

11/22/2017 - 03:19

న్యూఢిల్లీ, నవంబర్ 21: ఢిల్లీలోని ‘అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ’ (ఎయిమ్స్)లో అక్రమాలకు పాల్పడ్డ సీనియర్ అధికారులపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ కేసులను మూసేసిందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, ఐఎఫ్‌ఎస్ అధికారి సంజీవ్ చతుర్వేది ఆరోపించారు.

11/22/2017 - 03:18

న్యూఢిల్లీ, నవంబరు 21: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు నిర్వహిచాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని, దేశవ్యాప్తంగా రైతు రుణాలను మాఫీ చేయాలని రెండు ప్రధాన డిమాండ్లతో దేశవ్యాప్తంగా ఉన్న 184 రైతు సంఘాలు ఢిల్లీలో రెండోరోజూ వేలాది మంది రైతులతో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాయి.

11/22/2017 - 03:16

జైపూర్, నవంబర్ 21: దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ‘పద్మావతి’ హిందీ చలనచిత్రానికి సంబంధించి వివాదాలు, కోర్టు కేసులకు అంతేలేకుండా పోతోంది. రాజపుత్రులను అవమానించారని కొందరు ఫిర్యాదు చేయడంతో సినీగీత రచయిత జావెద్ అఖ్తర్‌పై జైపూర్‌లోని సింధీ క్యాంప్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజపుత్రులు 200 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలకులతో ఏనాడూ యుద్ధం చేయలేదని అఖ్తర్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.

11/22/2017 - 03:15

లక్నో, నవంబర్ 21: రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపడితే తమ పార్టీ పని మరింత సులువవుతుందని బీజీపీ నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అన్న బీజేపీ నినాదం రాహుల్ వల్ల సాకారం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

11/22/2017 - 03:14

న్యూఢిల్లీ, నవంబర్ 21: ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కేటాయింపులపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ వచ్చే జనవరి 16వ తేదీకి వాయిదా పండింది. ఇళ్ల స్థలాల కేటాయింపులపై దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Pages