S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/18/2017 - 02:22

న్యూఢిల్లీ, నవంబర్ 17: జమ్మూకాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (అఫ్‌స్పా) అమలును ఎత్తివేయాలని అనేక వర్గాలు డిమాండ్ చేస్తున్న సమయంలో అమెరికాకు చెందిన పేవ్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక సర్వేలో పాల్గొన్న 60 శాతానికి పైగా మంది మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో మరిన్ని బలగాలను మోహరించాలని అభిప్రాయపడటం విశేషం.

11/18/2017 - 02:21

అహ్మదాబాద్, నవంబర్ 17: వచ్చే నెలలో జరిగే గుజరాత్ శాసనసభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ 70 మంది అభ్యర్థులతో శుక్రవారం తొలి జాబితాను విడుదల చేసింది. పార్టీ టిక్కెట్లు పొందిన వారిలో ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీతూ వఘానీ ఉన్నారు.

11/18/2017 - 02:20

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఆశారాం బాపు లైంగిక వేధింపుల కేసులో ప్రత్యక్ష సాక్షులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో సాక్షులకు పటిష్ఠమైన భద్రత కల్పించేందుకు తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

11/18/2017 - 02:41

లక్నో, నవంబర్ 17: ఏ సమస్యకైనా చర్చలే సరైన పరిష్కార మార్గాన్ని చూపుతాయని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ శుక్రవారం నాడిక్కడ స్పష్టం చేశారు. కోర్టు తీర్పులకంటే కూడా చర్చల ద్వారా జరిగే పరిష్కారాలు తరతరాలుగా గుర్తుండిపోతాయని అన్నారు. అయోధ్య సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంలో భాగంగా వివిధ ముస్లిం సంస్థల నాయకులతో జరిపిన చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

11/18/2017 - 01:32

న్యూఢిల్లీ, నవంబర్ 17: అభివృద్ధే లక్ష్యంగా సంస్కరణలతో దూసుకుపోతున్న మోదీ ప్రభుత్వానికి ఇపుడు మరింత బలం చేకూరింది. అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్’ భారత సార్వభౌమ క్రెడిట్ రేటింగ్‌ను ఉన్నతీకరించింది. భారత క్రెడిట్ రేటింగ్‌ను అత్యల్ప పెట్టుబడి స్థాయి ‘బిఏఏ 3’ నుంచి ‘బిఏఏ 2’కు అమెరికాకు చెందిన ‘మూడీస్’ సవరించింది.

11/18/2017 - 01:23

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి జాతీయ హరిత ధర్మాసనం (ఎన్జీటీ) పచ్చజెండా ఊపింది. పర్యావరణ శాఖ 2015 అక్టోబర్ 9న ఇచ్చిన పర్యావరణ అనుమతులు కొట్టివేసేందుకు తిరస్కరించింది. అయితే ఆ శాఖ తమ అనుమతితో విధించిన 90 షరతులను తు.చ తప్పకుండా పాటించాలని ధర్మాసనం ఆదేశించింది.

11/17/2017 - 04:13

జలంధర్, నవంబర్ 16: శాంతి కోసం అంకితభావంతో పని చేస్తున్నట్టే దేశ సార్వభౌమత్వ పరిరక్షణకూ భారత్ కట్టుబడి ఉందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవిం ద్ స్పష్టం చేశారు. ఆదంపూర్ (పంజా బ్) ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 223 స్క్వాడ్రన్, 117 హెలికాప్టర్ యూనిట్‌లో సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాయుసేనలో పనిచేస్తున్న వారి సేవలను కొనియాడారు.

11/17/2017 - 04:13

న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజాదరణ నానాటికీ పెరుగుతున్నదనడానికి అమెరికా సంస్థ ‘ప్యూ’ నివేదికే తార్కాణమని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో మోదీకి తిరుగులేదని, ప్రజల్లో ఆదరణ ఎక్కడా తగ్గలేదని ఆ సంస్థ బుధవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమిత్ షా ‘ప్రతి పదిమందిలో ఎనిమిది మంది ప్రధాని మోదీ పాలనపై అమితమైన విశ్వాసాన్ని కనబరిచారు.

11/17/2017 - 03:53

జైపూర్, నవంబర్ 16: హిందీ చలనచిత్రం ‘పద్మావతి’లో అభ్యంతరక సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్న ఆందోళనకారులు తమ స్వరాన్ని రోజురోజుకూ మరింతగా పెంచుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకొనె కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను విడుదల చేస్తే సహించేది లేదని రాజస్థాన్‌కు చెందిన ‘కర్ని సేన’ గురువారం తీవ్రస్థాయిలో హెచ్చరించింది.

11/17/2017 - 03:50

న్యూఢిల్లీ, నవంబర్ 16: రాఫెల్ యుద్ధ విమానాల దిగుమతి ఒప్పందంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశ్నించాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియా ప్రతినిధులకు సలహా ఇచ్చారు.

Pages