S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/19/2017 - 01:49

శ్రీనగర్, నవంబర్ 18: కాశ్మీర్‌లో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు పాకిస్తానీ మిలిటెంట్లు హతమయ్యారు. హతమైన ఉగ్రవాదుల్లో 26/11 దాడుల సూత్రధారి జకీర్ రెహ్మాన్ లఖ్వీ మేనల్లుడితో పాటు లష్కర్-ఇ-తైబాకు చెందిన ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారని జమ్మూ కాశ్మీర్ డిజిపి ఎస్‌పి వైద్ తెలిపారు. శనివారం ఉదయం ప్రారంభమైన ఈ ఎదురుకాల్పులు రాత్రి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి.

11/18/2017 - 02:39

విశాఖపట్నం, నవంబర్ 17: మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ పర్యటన శుక్రవారం విశాఖలో సాదాసీదాగా జరిగింది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న బిల్‌గేట్స్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి బిల్‌గేట్స్, చంద్రబాబు కలిసి ఒకే వాహనంలో అగ్రిటెక్ సమ్మిట్ జరుగుతున్న ఏపిఐఐసి గ్రౌండ్స్‌కు చేరుకున్నారు.

11/18/2017 - 02:36

న్యూఢిల్లీ, నవంబర్ 17: ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజనను అమలు చేయటంలో విశిష్ట ప్రగతిని సాధించారు. ఈ పథకం కింద లక్షా నలభై ఐదు వేల గ్రామాలను రోడ్డు మార్గంతో కలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి దాదాపు రెండు గంటల పాటు కీలక, వౌలిక సదుపాయాల రంగాలైన పీఏంజీఎస్‌వై, గృహ నిర్మాణం, బొగ్గు, విద్యుత్ రంగాల పనితీరును సమీక్షించారు.

11/18/2017 - 02:34

ముంబయి, నవంబర్ 17: దేశంలో గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులపై శుక్రవారం నాడిక్కడ జరిగిన ఓ సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. కొన్ని చట్టాలను గోరక్షకులు తమ చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడుతున్నారని పౌర హక్కుల నేత తీస్తా సెతల్వాద్ ఆరోపించారు. చట్టాలను తమకు అనుకూలంగా మార్చేసుకుని గోరక్షకుల ఆగడాలను అదుపుచేయాలని ఆమె డిమాండ్ చేశారు. అలాంటి చట్టాలను రద్దుచేయాలని ఆమె కోరారు.

11/18/2017 - 02:32

చిత్రాలు.. పార్లమెంటు వీధిలో శుక్రవారం భారతీయ మజ్దూర్ సంఘ్ జరిపిన మహా ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళా కార్మికులు...
*డిమాండ్ల సాధన కోసం ఒడిశా అసెంబ్లీ భవనం ముందు జరిగిన నిరసన ప్రదర్శనలో భారీ సంఖ్యలో పాల్గొన్న ఆశా కార్యకర్తలు

11/18/2017 - 02:28

ఢిల్లీలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఇ బ్రోకర్ నుంచి రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్న ఆదాయపన్ను అధికారులు

11/18/2017 - 02:24

న్యూఢిల్లీ, నవంబర్ 17: ప్రమాదస్థాయిలో కాలుష్య వాతావరణం దాపురించినపుడు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) రాష్ట్రాలను ఆదేశించింది. చర్యల ప్రణాళిక అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని గట్టిగా సూచించింది.

11/18/2017 - 02:23

శ్రీనగర్, నవంబర్ 17: జమ్మూ కాశ్మీర్‌లోని హజ్రత్‌బల్ ప్రాంతంలో శుక్రవారం కారులో వెళుతున్న ముగ్గురు ఉగ్రవాదులు పోలీసు బృందంపై కాల్పులు జరపగా ఓ సబ్-ఇన్స్‌పెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు. శ్రీనగర్- గండేర్బల్ రహదారిపై జకుర క్రాసింగ్ వద్ద పోలీసు బృందంపై ఉగ్రవాదులు ఆకస్మికంగా కాల్పులు ప్రారంభించారు.

11/18/2017 - 02:23

న్యూఢిల్లీ, నవంబర్ 17: మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌లకు శుక్రవారం మళ్లీ సమన్లు జారీ చేసింది. యూపీఏ-1 హయాంలో రైల్వే హోటళ్ల కేటాయింపు అవినీతి కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు భావిస్తున్న ఈడీ దర్యాప్తు జరుపుతోందని అధికార వర్గాలు శుక్రవారం ఇక్కడ చెప్పాయి.

11/18/2017 - 02:22

న్యూఢిల్లీ, నవంబర్ 17: రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంపై విమర్శలకు దిగడం సిగ్గుచేటని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై కువిమర్శలు గుప్పించడం అంటే రక్షణ దళాల ఆత్మ స్థయిర్యాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages