S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/06/2016 - 05:59

భద్రాచలం, మే 5: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి ఆ రాష్ట్రంలోని బలరాంపూర్ జిల్లా దల్దోవా ఘాట్‌లో బైకును తప్పించబోయి మహేంద్ర ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి వంతెనపై నుంచి లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉండగా 14 మంది సంఘటన స్థలంలోనే చనిపోయారు. 16 మంది పరిస్థితి విషమంగా ఉంది.

05/06/2016 - 05:12

నాగాలాండ్‌లోని మోకోక్‌చుంగ్ జిల్లాలో గురువారం నిర్వహించిన ఒక గిరిజన ఉత్సవంలో పాల్గొన్న కేంద్ర గిరిజన శాఖ మంత్రి జుయల్ ఓరమ్‌ను స్థానికులు ఇలా అలంకరించారు.

05/06/2016 - 05:06

న్యూఢిల్లీ, మే 5: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆయన కుమారుడు రాహుల్ గాంధీకి, మరో అయిదుగురికి వ్యతిరేకంగా సాక్ష్యాల మొత్తం జాబితాను సమర్పిస్తానని బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి గురువారం కోర్టుకు తెలిపారు. కొంతమంది నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై హైకోర్టు తన ఆదేశాలను జారీ చేసిన వెంటనే ఈ జాబితాను సమర్పిస్తానని ఆయన కోర్టుకు తెలియజేశారు.

05/06/2016 - 05:00

న్యూఢిల్లీ, మే 5: ప్రధాని నరేంద్ర మోదీ బిఏ డిగ్రీ వివరాలను వెల్లడించి, వాటిని వెబ్‌సైట్‌లో ఉంచాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఈమేరకు ఢిల్లీ యూనివర్శిటీ వైస్‌చాన్సలర్ యోగేశ్ త్యాగీకి ఆయనొక లేఖ రాశారు. ప్రధాని విద్యార్హతలు దేశ ప్రజలందరికీ తెలియాల్సి ఉందని కేజ్రీవాల్ అన్నారు.

05/06/2016 - 04:48

న్యూఢిల్లీ, మే 5: వివాదాస్పద స్టింగ్ సిడిపై ప్రాథమిక విచారణకోసం తన ముందు హాజరు కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీశ్ రావత్‌కు సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడం కోసం ఒక మధ్యవర్తితో రావత్ మాట్లాడుతున్నట్లు ఈ సిడిలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

05/06/2016 - 04:44

రన్నీ (కేరళ), మే 5: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం విషయంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీపై తీవ్రస్థాయిలో దాడికి దిగారు. ఎవరి ఆదేశం మేరకు హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో మార్పులు చేశారో, హెలికాప్టర్ క్షేత్ర స్థాయి పరీక్షలను విదేశాలకు ఎందుకు మార్చారో వెల్లడించాలని ఆయన ఆంటోనీని డిమాండ్ చేశారు.

05/06/2016 - 03:03

ముంబయి, మే 5: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని అడ్డుకోవడానికి యత్నించిన ఇద్దరు యువకులను దారుణంగా హత్య చేసిన నలుగురికి ప్రత్యేక మహిళా కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. నేరస్థులు నలుగురు తమ శేష జీవితమంతా జైల్లోనే ఉండాలని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వృశాలి జోషీ స్పష్టం చేశారు. 2011 అక్టోబర్ 11న ముంబయి శివార్లలోని అంధేరిలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

05/06/2016 - 02:57

కోల్‌కతా, మే 5: పశ్చిమ బెంగాల్‌లో గురువారం జరిగిన ఆరవ తుది విడత అసెంబ్లీ ఎన్నిల్లో సాయం త్రం 5 గంటల వరకు 84 శాతానికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తూర్పు మిడ్నపూర్ జిల్లాలో 85.09 శాతం పోలింగ్ నమోదు కాగా, కూచ్ బిహార్ జిల్లా లో 82.71 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయం త్రం 5 గంటల వరకు మొత్తంమీద సగటున 84.24 శాతం పోలింగ్ జరిగింది.

05/06/2016 - 02:50

న్యూఢిల్లీ, మే 5: గత ఫిబ్రవరి 9న జెఎన్‌యు క్యాంపస్‌లో జరిగిన సంఘటనకు సంబంధించి యూనివర్శిటీ అధికారులు విద్యార్థులకు విధించిన శిక్షలకు నిరసనగా గత ఎనిమిది రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను గురువారం యూనివర్శిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

05/06/2016 - 02:48

ఉజ్జయిని, మే 6: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరుగుతున్న కుంభమేళా ప్రాంతంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వడగళ్లతో కురిసిన భారీ వర్షానికి కుంభమేళా ప్రాంతంలో యాత్రికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టెంట్లు కుప్ప కూలడం, పిడుగులు పడ్డంతో కనీసం ఏడుగురు చనిపోగా, 90 మందికి పైగా గాయపడ్డారు.

Pages