S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/07/2016 - 04:50

న్యూఢిల్లీ, జూన్ 6: ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ధనబలాన్ని ఉపయోగించడం అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ‘ఓటుకు నోటు’ ఆధారంగా ఎన్నికలను రద్దు చేసేందుకు వీలు కల్పిస్తూ ఎన్నికల చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరే అంశాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది.

06/07/2016 - 04:45

న్యూఢిల్లీ, జూన్ 6: నిలువ నీడలేని పేదలకు ధార్మిక సంస్థలు పట్టెడన్నం పెట్టడం, బట్టలివ్వడం, ఆశ్రయం కల్పించడం చూస్తుంటాం. కాని, ఢిల్లీలోని మానవతా దృక్పథం కలిగిన ఒక స్వచ్ఛంద సంస్థ ఓ అడుగు ముందుకేసి అలాంటి అభాగ్యులకు పుస్తక పఠనానికి అవకాశం కల్పించడం ద్వారా వారిలో విజ్ఞానాన్ని, వికాసాన్ని పెంపొందించడానికి నడుం కట్టింది.

06/07/2016 - 04:40

న్యూఢిల్లీ, జూన్ 6: తీరప్రాంత భద్రతపై కేంద్రం దృష్టిసారించింది. ఉగ్రవాదుల దాడులను నుంచి తీరప్రాంతాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈ నెల 16న ముంబయిలో ముఖ్యమంత్రుల సమాశం ఏర్పాటు చేశారు. కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరవుతారని ఓ అధికార ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగనుంది.

,
06/07/2016 - 04:32

న్యూఢిల్లీ, జూన్ 6: తెలుగు రాష్ట్రాలు రెండూ విభజన చట్టం ప్రకారమే నడుచుకోవాలని, కృష్ణా జలాల పంపకాలు కేటాయింపుల ప్రకారం సాగాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి స్పష్టం చేశారు. ఈమేరకు బోర్డు అధికారులకు టెలిఫోన్‌లో ఆదేశాలిస్తూ, తెలంగాణ, ఆంధ్రకు దేనికీ నష్టం వాటిల్లకుండా వ్యవహరించాలని సూచించారు. ఒక రాష్ట్రం పట్ల పక్షపాతంతో వ్యవహరించటం ఎంతమాత్రం మంచిదికాదని బోర్డు అధికారులకు ఉమాభారతి స్పష్టం చేశారు.

06/06/2016 - 18:09

పాట్నా: సంపూర్ణ మద్య నిషేధ చట్టాన్ని ఉల్లంఘించినందుకు కొన్నాళ్లుగా జైలులో ఉంటున్న జెడియు ఎమ్మెల్సీ మనోరమా దేవికి పాట్నా హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. గయలోని జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చేందుకు రెండుసార్లు నిరాకరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. మనోరమ కుమారుడు రాకీ యాదవ్ గయలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడిని రివాల్వర్‌తో కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

06/06/2016 - 16:53

దిల్లీ: యుపిలోని మథురలో గత శుక్రవారం జరిగిన అల్లర్లపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ సుప్రీం కోర్టులో సోమవారం నాడు పిటిషన్ దాఖలైంది. దీనిపై మంగళవారం విచారణ ప్రారంభిస్తామని వెకేషన్ బెంచ్‌లోని న్యాయమూర్తులు ప్రకటించారు. మథురలో జరిగిన అల్లర్లలో ఐపిఎస్ అధికారి సహా 29 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఒక పార్కును ఆక్రమించిన ముఠా ఈ అరాచకానికి కారణమంటూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

06/06/2016 - 14:30

దిల్లీ: దేశ రాజధానిలో అరాచకశక్తులు పెచ్చుమీరడానికి ప్రధాని మోదీ, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రధాన కారకులని సిఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆయన సోమవారం తన ట్విట్టర్ ఖాతాలో ఈమేరకు పలు పోస్టింగ్‌లు చేశారు. దిల్లీలో అత్యాచారాలు, విధ్వంసక సంఘటనలు జరుగుతున్నా పోలీసులపై తమకు అజమాయిషీ లేకుండా పోతోందన్నారు.

06/06/2016 - 14:26

చండీగఢ్: హింసాత్మక సంఘటనలతో అరాచకత్వం పెచ్చుమీరుతున్నందున పంజాబ్‌లో తక్షణమే రాష్టప్రతి పాలన విధించాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అమరేందర్ సింగ్ సోమవారం డిమాండ్ చేశారు. ఇటీవలి విధ్వంసకాండలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లూధియానాలో గత నెల 17న జరిగిన దాడుల్లో మరణించిన భూపేందర్‌సింగ్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

06/06/2016 - 12:21

పుదుచ్చేరి: పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి నారాయణ స్వామి సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో అయిదుగురు మంత్రుల చేత గవర్నర్ కిరణ్ బేడీ ప్రమాణం చేయించారు. ఇటీవల జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-డిఎంకె కూటమి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

06/06/2016 - 08:23

చండీగఢ్, జూన్ 5: రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జాట్ సామాజికవర్గ నాయకులు హర్యానాలో మళ్లీ ఉద్యమానికి ఉద్యుక్తులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీ మొత్తంలో రాష్ట్ర పోలీసు బలగాలతోపాటు 5 వేల మందికి పైగా పారామిలటరీ సిబ్బందిని మోహరించినప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయని జాట్ నాయకులు రోహ్తక్ జిల్లాలో తమ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న జస్సియా గ్రామంలో ఆదివారం హవనాన్ని నిర్వహించి తాజాగా ఆందోళన ప్రారంభించారు.

Pages