S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/03/2017 - 22:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ముచ్చటగా మూడోసారి చేసిన కేంద్ర మంత్రివర్గం విస్తరణలో తెలుగు రాష్ట్రాలవారికి చోటు దక్కలేదు. రెండు రాష్ట్రాల్లో ఒక్కరికీ మంత్రి పదవి లభించలేదు సరికదా, కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను తొలగించి బిజెపి అధినాయకత్వం చేతులు దులుపుకున్నది.

09/03/2017 - 03:03

చిత్రం..ఢిల్లీలో శనివారం ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడును కలుసుకున్న
విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్

09/03/2017 - 03:01

గోరఖ్‌పూర్, సెప్టెంబర్ 2: గోరఖ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ముగ్గురు పిల్లల మరణానికి సంబంధించి డాక్టర్ ఖఫీల్ ఖాన్‌ను శనివారం అరెస్టు చేశారు. ఇప్పటికే ఆయనను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశామని, మరో ఆరుగురికి ఎన్‌బిడబ్ల్యూలు జారీ చేశామని పోలీసులు చెప్పారు.

09/03/2017 - 03:00

ముంబయి, సెప్టెంబర్ 2: సామాజిక కార్యకర్త అన్నాహజారే తాజాగా లోక్‌పాల్ ఏర్పాటును డిమాండ్ చేయడం వెనక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని ఎన్‌సిపి ఆరోపించింది. ఆర్‌ఎస్‌ఎస్ గుర్తుచేయడం వల్లే దీర్ఘకాల విరామం తరువాత ఆయన లోక్‌పాల్ అంశాన్ని తెరమీదకు తెచ్చారంటూ ధ్వజమెత్తింది.

09/03/2017 - 02:54

పాండిచ్చేరి, సెప్టెంబర్ 2: తమిళనాడులో అసాధారణ రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయని, దీనిదృష్ట్యా రాష్టప్రతి జోక్యం చేసుకోవాలని అన్నాడిఎంకె నేత టిటివి దినకరన్ శనివారం డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో దినకరన్ తనకు విధేయులైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

09/03/2017 - 02:52

చెన్నై, సెప్టెంబర్ 2: నీట్ పరీక్షలకు వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టుకు ఎక్కిన 17 ఏళ్ల గిరిజన బాలిక ఆత్మహత్య చేసుకోవడంపై తమిళనాడు అంతటా నిరసనలు రాజుకున్నాయి. రాజకీయ పార్టీలు, తమిళ సంఘాలు నిరసన ప్రదర్శలను జరిపాయి. వెంటనే ఈ ఉమ్మడి ప్రవేశపరీక్షను వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశాయి. సిపిఎం దాని అనుబంధం సంస్థలైన యువజన సంఘాలు అనేక ప్రాంతాల్లో రహదారులను దిగ్బంధించాయి.

09/03/2017 - 02:47

సిమ్లా, సెప్టెంబర్ 2: హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని ఓ హైవేలో శనివారం కొండ చరియలు భారీ పరిమాణంలో విరిగి పడిన సంఘటనలో దాదాపు 6 వాహనాలు కూరుకుపోయాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం ఏమీ జరగలేదని తెలుస్తోంది. ఈ వాహనాలతోపాటు హైవేలో ఉన్న ఓ ఆలయానికి చెందిన కొన్ని భాగాలను కూడా ఈ కొండచరియము ముంచెత్తాయని తెలుస్తోంది.

09/03/2017 - 02:45

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: చైనాలో జరుగనున్న బ్రిగ్స్ శిఖరాగ్ర సదస్సులో ఉత్పాదక చర్చలు, సానుకూల ఫలితాలు సాధ్యం కాగలవన్న ఆశాభావాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు. అలాగే ప్రపంచ శాంతి భద్రతలను పరిరక్షించడంలోనూ, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలోనూ చైనా సారథ్యంలో జరుగుతున్న ఈ సదస్సు విజయవంతం కాగలదన్న నమ్మకాన్ని మోదీ వ్యక్తం చేశారు.

09/03/2017 - 01:38

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకునే తొమ్మిది మంది కొత్త మంత్రులు- శివప్రతాప్ శుక్లా (రాజ్యసభ), అశ్వినీకుమార్ చౌబే (లోక్‌సభ).
వీరేంద్ర కుమార్ (లోక్‌సభ), అనంత కుమార్ హెగ్డే (లోక్‌సభ), రాజ్‌కుమార్ సింగ్ (ఐఎఫ్‌ఎస్), హర్దీప్ పురి (లోక్‌సభ), గజేంద్ర సింగ్ షేకావత్ (లోక్‌సభ), సత్యపాల్ సింగ్ (ఐపిఎస్), ఆల్ఫోన్స్ కన్నంతనం (ఐఏఎస్).

09/03/2017 - 01:34

బెంగళూరు, సెప్టెంబర్ 2: ఇంజనీరింగ్ చదువులకు డిమాండ్ తగ్గిపోతూ ఉండడంతో దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోతోంది. పేరున్న ఇంజనీరింగ్ కాలేజీల్లో తప్పించి మిగతా ఇంజనీరింగ్ కాలేజీల్లో నామమాత్రంగానే విద్యార్థులు ఉంటున్నారు.

Pages