S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/03/2017 - 01:02

న్యూఢిల్లీ, జూన్ 2: రెండు లక్షల రూపాయలు, ఆపైన నగదు లావాదేవీలు జరిపే వారిపై ఆదాయపన్ను విభాగం కొరడా ఝళిపించింది. ఇంత భారీ మొత్తాన్ని పొందిన వ్యక్తి నుంచి తత్సమానమైన మొత్తాన్ని పెనాల్టీగా వసూలు చేస్తామని శుక్రవారం నాడిక్కడ హెచ్చరించింది. అలాగే ఈ రకమైన లావాదేవీలు జరిపేవారి వివరాలను తమ ఈ-మెయిల్‌కు పంపాలని కూడా ప్రజలను కోరింది.

06/03/2017 - 02:07

న్యూఢిల్లీ, జూన్ 2: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అదృశ్యం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణించాడంటూ ఆ నాటి యూపీఏ సర్కార్ నిర్ణయానే్న తాము పునరుద్ఘాటించామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించి కొత్త వాస్తవాలు వెలుగు చూస్తే వాటిని పునః పరిశీలించేందుకు సిద్ధమని ప్రకటిస్తూ ఇందుకు సంబంధించి ఇచ్చిన ప్రకటనపై చేతులు దులిపేసుకుంది.

06/02/2017 - 01:59

న్యూఢిల్లీ, జూన్ 1: రెండు దేశాల మధ్య శాంతి నెలకొనటం పాకిస్తాన్‌కు ఇష్టం లేదని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోపించారు. గత నాలుగైదు వారాల నుండి వాస్తవాధీన రేఖ వద్ద భారత సైన్యం పైచేయి కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఎన్‌డిఏ ప్రభుత్వం మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జైట్లీ గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు.

06/02/2017 - 01:58

న్యూఢిల్లీ, జూన్ 1: గో విక్రయాలపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురువారం కూడా దేశ వ్యాప్తంగా ఆందోళనకు కారణమైంది. కేంద్ర నోటిఫికేషన్ ఏ విధంగానూ రాష్ట్రాల చట్టాల అమల్లో జోక్యం చేసుకునేది కాదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేసినప్పటికీ పరిస్థితిలో వేడి తగ్గలేదు.

06/02/2017 - 01:57

న్యూఢిల్లీ, జూన్ 1: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో పేరుకుపోయిన కేసుల పరిష్కారం దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. కక్షిదారులు కోర్టు వెలుపల కేసులు పరిష్కరించుకునేలా ప్రోత్సహించడంతోపాటు దీనికి కొత్త చట్టం తీసుకురానుంది. కోర్టులపై సాధ్యమైనంత వరకూ భారం తగ్గించేలా చూడాలన్నదే ప్రభుత్వ యోచన.

06/01/2017 - 04:38

లక్నో, మే 31: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అయోధ్యలోని రామమందిరంలో పూజలు నిర్వహించారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బిజెపి సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతిలపై చార్జిషీట్ దాఖలైన మర్నాడే అయోధ్యంలో ఆయన పర్యటించడం గమనార్హం. వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు స్థలంలో తాత్కాలికంగా ఏర్పాటైన రామ మందిరంలో యోగి ఆదిత్యనాథ్ పూజలు చేశారు.

06/01/2017 - 04:21

చెన్నై, మే 31: వధకోసం పశువు ల విక్రయాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డిఎంకె తీవ్రంగా మండిపడింది. ప్రధానమంత్రి కోరుకున్న వాటినే మనం తినాల్సిన పరిస్థితి తలెత్తిందని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై మరో ఉద్యమం వస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె స్టాలిన్ హెచ్చరించారు.

06/01/2017 - 04:12

న్యూఢిల్లీ, మే 31: మూడేళ్ల కాలంలో ఏన్డీఏ ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా విఫలమయిందని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రధాని మోదీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సిపిఎం పార్టీ ‘తీన్‌సాల్ నా రోటి నా దాల్ - హజారో సవాల్’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ఆ పార్టీ నాయకులు సీతారాం ఏచూరి, బృందకారత్ తదితరులు విడుదల చేశారు.

06/01/2017 - 04:09

న్యూఢిల్లీ, మే 31: అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు దాదాపు 56 ఏళ్ల తర్వాత ఊహించని బహుమతి లభించబోతోంది. 1962లో చైనాతో జరిగిన యుద్ధం తర్వాత రాష్ట్రంలో సైన్యంస్వాధీనం చేసుకున్న భూములకుగాను నష్టపరిహారం చెల్లించాలని కేంద్రం భావిస్తోంది. ఈ పరిహారం ఏ విధంగా చెల్లించాలనే దానిపై కేంద్రం, అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి.

06/01/2017 - 04:08

న్యూఢిల్లీ, మే 31: కర్నాటక శాసనసభకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ ప్రస్తుత ముఖ్యమంత్రి కె. సిద్దరామయ్య నేతృత్వంలోనే ఎదుర్కొంటుందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. కర్నాటకలో రెండోసారి అధికారంలోకి రావటం ద్వారా తన ఉనికి కాపాడుకునేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది.

Pages