S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/04/2017 - 01:41

న్యూఢిల్లీ, జూన్ 3: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ఆరోపణలు గుప్పించిన విపక్షాలు, యంత్రాలను ట్యాంపర్ చేసి చూపించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సవాల్‌కు చివరిక్షణంలో ప్రతిపక్షాలు తోకముడిచాయి. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన హ్యాకథాన్‌కు కేవలం సిపిఎం, ఎన్సీపీ హాజరైనా, ట్యాంపర్ సవాల్‌కు నిరాకరించి ఓటమిని పరోక్షంగా అంగీకరించాయి.

06/04/2017 - 01:40

న్యూఢిల్లీ, జూన్ 3: వచ్చే నెల 1నుంచి వస్తు సేవల పన్ను(జిఎస్‌టి)ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు పన్ను రేట్లు నిర్ణయించని బంగారం లాంటి కొన్ని వస్తువులపై పన్నును నిర్ణయించడం కోసం జిఎస్‌టి కౌన్సిల్ శనివారం ఇక్కడ సమావేశం అయింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.

06/04/2017 - 01:39

న్యూఢిల్లీ, జూన్ 3: కాశ్మీర్ లోయలో హింసకు పాకిస్తానే కారణమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని, అయితే దీనికి కొంత సమయం పట్టవచ్చని ఆయన అన్నారు. ‘1947నుంచి ఈ సమస్య రగులుతూనే ఉంది. అందువల్ల దీనికి పరిష్కారం చిటికలోనో లేదా ఒకటి రెండు నెలల్లోనో సాధ్యం కాదు.

06/04/2017 - 00:53

చెన్నై, జూన్ 3: రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణపై దాదాపు నెల రోజులు జైల్లో గడిపిన అనంతరం బెయిలుపై విడుదలయిన అన్నాడిఎంకె ఉప ప్రధాన కార్యదర్శి టిటివి దినకరన్ ఈ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని చెప్పారు. ఢిల్లీలోని తీహార్ జైలునుంచి విడుదలయిన అనంతరం శనివారం ఇక్కడికి చేరుకున్న దినకరన్‌కు ఆయన అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

06/04/2017 - 00:52

న్యూఢిల్లీ, జూన్ 3: దేశ రాజధాని ఢిల్లీలో సైనిక ప్రధాన కార్యాలంలో ‘బదిలీల రాకెట్’ను సిబిఐ ఛేదించింది. అక్రమ బదిలీలకు సంబంధించి ఓ లెఫ్టినెంటర్ కల్నల్‌తోపాటు దళారిని సిబిఐ శనివారం అరెస్టు చేసింది. తమకు కావల్సిన చోటకు బదిలీ చేయించుకోడానికి లక్షలాది రూపాయలు లంచంగా ఇచ్చినట్టు విచారణలో వెల్లడైంది.

06/04/2017 - 02:17

లక్నో, జూన్ 3: రాష్ట్రంలో తాను పర్యటించేటప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేయవద్దని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు. ఆయన ఎక్కడికెళ్లినా అధికారులు నానాఆర్భాటాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుండడంతో వాటిపై యోగి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలను గౌరవించినప్పుడే ముఖ్యమంత్రికి గౌరవమని ఆయన స్పష్టం చేశారు.

06/04/2017 - 00:48

న్యూఢిల్లీ, జూన్ 3: కాశ్మీర్ లోయలో అల్లర్లకు పాకిస్తాన్‌నుంచి నిధులు లభిస్తున్నాయన్న సమాచారం అందడంతో ఈ హవాలా కార్యకలాపాలకు చెక్ పెట్టే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. శనివారం జాతీయ భద్రతా ఏజన్సీ (ఎన్‌ఐఏ) వేర్పాటువాదులు, హురియత్ నేతలే లక్ష్యంగా న్యూఢిల్లీ, హర్యానా, కాశ్మీర్‌లో ఏకకాలంలో దాడులు జరిపింది.

06/04/2017 - 02:13

న్యూఢిల్లీ, జూన్ 3: భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న రెండో దేశం అయినప్పటికీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్ మన దేశంలో కాలు మోపలేకపోయిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.

06/03/2017 - 01:35

న్యూఢిల్లీ, జూన్ 2: వాతావరణ మార్పుల వలన ఎదురవుతున్న సమస్యల నుంచి మానవాళిని గట్టెక్కించేందుకు భారత్ చేస్తున్న కృషిని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది.

06/03/2017 - 02:07

కోల్‌కతా, జూన్ 2: వస్తుసేవల పన్ను (జిఎస్‌టి)కి ఎట్టిపరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేదిలేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశా రు. కేంద్రం తీసుకొచ్చిప్రతిపాదించిన జిఎస్‌టి బిల్లు లో సవరణలు చేయాల్సిందేనని శుక్రవారం ఇక్కడ చెప్పారు. ఈమేరకు కొన్ని సవరణలు చేయాల్సిందిగా కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసినట్టు ఆమె వెల్లడించారు.

Pages