S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/30/2017 - 07:51

బెంగళూరు, మే 29: సోమవారం బెంగళూరు మహానగరం విషపు నురగలతో ఉక్కిరిబిక్కిరి అయింది. నగరంలోని రెండు పెద్ద సరస్సులు బెల్లందూరు, వర్తూర్‌లు పెద్దఎత్తున విషపూరిత నురగలను వెదజల్లాయి. ఒక్కసారిగా రోడ్లమీదకు నురగలు రావటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైట్‌ఫీల్డ్ రోడ్డులోని వార్తూర్ సరస్సు నుంచి నురగలు మబ్బుల్లా రోడ్డు మీదకు వచ్చేశాయి. దీంతో ట్రాఫిక్ చాలాసేపు జామ్ అయ్యియి.

05/30/2017 - 07:48

న్యూఢిల్లీ, మే 29: పాట్నా, చెన్నై విమానాశ్రయాలు సహా దేశంలోని మరో ఆరు విమానాశ్రయాలు జూన్ 1వ తేదీ నుంచి దేశీయ ప్రయాణికుల హ్యాండ్ బ్యాగ్‌లకు ట్యాగ్‌లు, స్టాంపింగ్‌లు వేసే పద్ధతికి స్వస్తి పలకనున్నాయి. వీటిలో పాట్నా, చెన్నై విమానాశ్రయాలతో పాటు జైపూర్, గౌహతి, లక్నో, త్రివేండ్రం విమానాశ్రయాలు ఉన్నాయని సిఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఓపి.సింగ్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు.

05/30/2017 - 03:33

న్యూఢిల్లీ, మే 29: ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి బాహ్య వలయ రహదారి నిర్మాణం పనులకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించటం లేదని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడుతో చెప్పారు. ఆయన సోమవారం నితిన్ గడ్కరీతో సమావేశమై ఏపీకి సంబంధించిన ఉపరితల రవాణా ప్రాజెక్టు పనితీరును సమీక్షించారు.

05/30/2017 - 03:27

న్యూఢిల్లీ/ కోల్‌కతా/ చెన్నై, మే 29: వధించటం కోసం పశుగణాల విక్రయాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా విధించిన ఆంక్షలపై దేశవ్యాప్తంగా రాజకీయ వివాదం రాజుకుంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని తాము ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించేది లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సోమవారం నాడు తేల్చి చెప్పారు. కేంద్రం విధించిన ఈ నిషేధం అప్రజాస్వామికమని, రాజ్యాంగ విరుద్ధమంటూ ఆమె మండిపడ్డారు.

05/30/2017 - 03:50

న్యూఢిల్లీ, మే 29: సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ స్వస్తి పలకనంత వరకు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక క్రికెట్‌ను అనుమతించేది లేదని కేంద్ర క్రీడామంత్రి విజయ్ గోయల్ సోమవారం నాడిక్కడ ఉద్ఘాటించారు. 2012నుంచి నిలిచిపోయిన ద్వైపాక్షిక సంబంధాల అంశంపై బిసిసి ఐ, పాకిస్తాన్ క్రికెట్‌బోర్డు దుబాయ్‌లో సమావేశమైన తరుణంలోనే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా ప్రకటించటం గమనార్హం.

05/29/2017 - 08:29

న్యూఢిల్లీ, మే 28: రాళ్ల దాడినుంచి బయట పడేందుకు ఆర్మీ అధికారి ఒకరు ఆందోళనకారుడిని మానవ కవచంగా చేసుకొని జీపు బాయ్‌నెట్‌కు కట్టడాన్ని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గట్టిగా సమర్థిస్తూ జమ్మూ, కాశ్మీర్‌లో జరుగుతున్నది ఓ అసహ్యకరమైన యుద్ధమని, దాన్ని ఎదుర్కోవాలంటే వినూత్నమైన మార్గాలు కావాలని అన్నారు.

05/29/2017 - 08:27

న్యూఢిల్లీ, మే 28: ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరెషన్ (డిఎంఆర్‌సి) మరో మైలురాయిని అధిగమించింది. ఢిల్లీ మెట్రో హెరిటేజ్ కారిడార్ లైన్‌ను ఆదివారంనాడు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ లైన్ ప్రారంభంతో ఢిల్లీగేట్, ఎర్రకోట, జామా మసీదు వంటి చారిత్రక ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు.

05/29/2017 - 08:23

న్యూఢిల్లీ, మే 28: అప్పుడే పుట్టిన శిశువులు కష్టంమీద తమ కళ్లను తెరవగలరు. మనం ఇప్పటివరకు నేర్చుకున్నది, చెప్పింది, చూసింది ఇదే. కాని, తల్లి గర్భంనుంచి అప్పుడే బయటకు వచ్చిన ఒక శిశువు పడిపోకుండా తన కాళ్ల మీద తాను నిలబడటమే కాకుండా, నడిచిన దృశ్యంతో కూడిన ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో హల్‌చల్ చేస్తోంది. నమ్మశక్యం కాని ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని ఆకర్షిస్తోంది.

05/29/2017 - 08:22

రాంపూర్ (ఉత్తరప్రదేశ్), మే 28: ఉత్తరప్రదేశ్‌లో వ్యాపిస్తున్న చట్టరాహిత్యాన్ని ఎత్తిచూపే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. రాంపూర్ జిల్లాలో పట్టపగలు కొంతమంది యువకులు ఇద్దరు బాలికలను లైంగికంగా వేధించిన ఉదంతాన్ని వెల్లడించే ఒక వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. సుమారు 12 నుంచి 14 మంది యువకులు ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడటం ఈ వీడియోలో కనిపిస్తోంది.

05/29/2017 - 01:59

చిత్రదుర్గ, మే 28: దేశ రక్షణ దళాలు గరిష్ఠ స్ధాయిలో అప్రమత్తంగా ఉండాలని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ పిలుపునిచ్చారు. ఇటీవల చోటుచేసుకున్న సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ పెఢ ధోరణిని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. భారత దేశ భౌగోలిక స్థితి గతుల దృష్ట్యా ఏ క్షణంలోనైనా ఎక్కడి నుంచైనా ముప్పు ముంచుకు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ‘మన పొరుగున ఉన్న దేశంతో మనకు ఏడు దశాబ్దాలుగా ఘర్షణలున్నాయి.

Pages