S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/07/2017 - 03:24

భోపాల్, జూన్ 6: రుణమాఫీ, గిట్టుబాటు ధరకోసం రైతుల చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతిచెందారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్‌లో నిషేధాజ్ఞలు విధించారు. పిపాల్య మండీ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు.

06/07/2017 - 02:47

న్యూఢిల్లీ, జూన్ 6: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి పార్టీ పగ్గాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో రాహుల్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలును ఖరారు చేశారు.

06/07/2017 - 02:43

న్యూఢిల్లీ, జూన్ 6: పెద్ద నోట్ల రద్దు కారణంగా దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర స్వరంతో అన్నారు. ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందని, దీని ప్రభావం ఉపాధి అవకాశాల సృజనపైనా పడే అవకాశం ఉందని చెప్పారు. మంగళవారం ఇక్కడ జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన మన్మోహన్ ఆర్థిక వృద్ధి రేటు మందగించడానికి దారితీసిన కారణాలను విశే్లషించారు.

06/06/2017 - 01:59

సూళ్లూరుపేట, జూన్ 5: రోదసి పరిశోధనలో భారత్ మరో కొత్త రికార్డు సృష్టించింది. అగ్రదేశాలు సైతం చేయలేని సాహసాన్ని మన శాస్తవ్రేత్తలు సుసాధ్యం చేసి భారత్‌ను తిరుగులేని శక్తిగా నిలబెట్టారు. దీంతో రోదసిలో తివర్ణ పతాకం మరోమారు రెపరెపలాడింది. ఇస్రో కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేస్తూ, 17 ఏళ్ల కలను శాస్తవ్రేత్తలు సాకారం చేశారు.

06/06/2017 - 01:58

న్యూఢిల్లీ, జూన్ 5: మార్క్3 ప్రయోగం విజయవంతం కావటంపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన విజయం సాధించినందుకు భారత శాస్తవ్రేత్తలను వారు అభినందించారు. ‘2002 నుంచి ఈరోజు విజయం కోసం ప్రతి నిత్యం అహరహం శ్రమించిన శాస్తవ్రేత్తల బృందాన్ని నేను మన:స్ఫూర్తిగా అభినందిస్తున్నాను.’’ అని రాష్టప్రతి వ్యాఖ్యానించారు.

06/06/2017 - 01:52

సూళ్లూరుపేట, జూన్ 5: ఇస్రో శాస్తవ్రేత్తలు జిఎస్‌ఎల్‌వి-మార్క్ 3-డి1 రాకెట్‌ను మూడు దశల్లో రూపకల్పన చేశారు. దీని బరువు 640టన్నులు, 43.43 మీటర్ల ఎత్తు కలిగి ఉన్న రాకెట్ ప్రయోగం మూడు దశల్లో జరిగింది. కౌంట్‌డౌన్ 0కు చేరగానే మొదటి దశలో ఉన్న 200టన్నుల ఘన ఇంధనాన్ని ఎస్ 200 బూస్టర్లతో మండించడంతో రాకెట్ పయనం ప్రారంభమైంది.

06/06/2017 - 01:52

సూళ్లూరుపేట, జూన్ 5: వరుస రాకెట్ విజయాలతో భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచ దేశాలకు పాకడమే కాకుండా మంచి గుర్తింపు సైతం సంపాదించుకుంది. ఇక్కడ నుండి ప్రయోగించే ప్రతి రాకెట్ స్వదేశీ పరిజ్ఞానం కావడం ఒకవంతైతే వినూత్న ప్రయోగాలు చేపట్టి మన శాస్తవ్రేత్తలు ప్రపంచ దేశాలకు దీటుగా నిలుస్తున్నారు.

06/06/2017 - 01:51

సూళ్లూరుపేట, జూన్ 5: భారతదేశ చరిత్రలోనే ఇది మరుపురాని రోజని ఇస్రో చైర్మన్ ఎ ఎస్.కిరణ్‌కుమార్ అన్నారు. సోమవారం జిఎస్‌ఎల్‌వి మార్క్ 3-డి1 విజయం అనంతరం ఆయన శాస్తవ్రేత్తలతో కలసి మీడియా సెంటర్‌లో విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రయోగంతో ఇస్రో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంలో ఇది తొలి అడుగు మాత్రమేనని స్పష్టం చేశారు.

06/06/2017 - 01:51

న్యూఢిల్లీ, జూన్ 5: దేశ ఆర్థిక వ్యవస్థకు జిఎస్టీ పెద్ద మలుపులాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సోమవారం ఉన్నత స్థాయి సమావేశంలో జిఎస్టీ స్థితిగతులను సమీక్షించారు. జూలై 1నుండి జిఎస్టీని దేశవ్యాప్తంగా అమలు చేయనుండటం తెలిసిందే.

06/06/2017 - 01:50

న్యూఢిల్లీ, జూన్ 5: దేశంలో నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్‌ఎస్‌జి) వ్యవస్థ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. బ్లాక్ కాట్ కమాండోలుగా పిలిచే ఈ వ్యవస్థ పనితీరును ఆయన సోమవారం సమీక్షించారు. ఎన్‌ఎస్‌జి డైరెక్టర్ జనరల్ సుధీర్ ప్రతాప్‌సింగ్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

Pages