S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/24/2016 - 04:27

న్యూఢిల్లీ, నవంబర్ 23: పాకిస్తాన్ ముష్కర మూకలు జరిపిన పైశాచిక దాడికి ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తీవ్రస్థాయిలో దాడులు జరిపింది. దాడుల్లో ఓ అధికారి సహా ముగ్గురు పాక్ సైనికులు మరణించారు. మంగళవారం అధీన రేఖ ప్రాంతంలో గస్తీ తిరుగుతున్న భారత సైనికులపై పాక్ దళాలు దాడి జరిపి ముగ్గుర్ని హతమార్చాయి.

11/24/2016 - 04:26

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రధాని నరేంద్ర మోదీకి దేశాన్ని పాలించే అర్హతే లేదని విపక్షాలు నిప్పులు చెరిగాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో బుధవారం జంతర్‌మంతర్‌లో జరిగిన భారీ ర్యాలీలో నాలుగు పార్టీల నేతలు కేంద్ర ధోరణిని ఎండగట్టారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశ వ్యాప్తంగా కోటానుకోట్ల మంది ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలు ప్రధాని మోదీకి పట్టడం లేదని..

11/24/2016 - 04:22

చెన్నై, నవంబర్ 23:దశాబ్దాల పాటు భారతీయ సంగీతానికి ప్రతిరూపంగా, కొత్త సంగీత ప్రక్రియల ప్రయోక్తగా రాణించి కోటానుకోట్ల మందిని అలరించిన గాన గంధర్వుడు బాల మురళీ కృష్ణకు అనంతవాయువుల్లో కలిసిపోయారు. ఆయన భౌతిక కాయానికి వందలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య బుధవారం ఇక్కడి బీసెంట్‌నగర్ ఎలక్ట్రిక్ శ్మశానవాటికలో అంత్య క్రియలు జరిగాయి.

11/24/2016 - 04:17

న్యూఢిల్లీ, నవంబర్ 23:పెద్ద నోట్ల రద్దుతో జన్‌ధన్ ఖాతాల్లో నిధుల పంట పండింది. కేవలం 13రోజుల వ్యవధిలో ఈ ఖాతాల్లోకి అనూహ్య రీతిలో 21వేల కోట్ల రూపాయల మేర డిపాజిట్లు వచ్చాయని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. గత రెండు వారాలుగా ఈ ఖాతాల్లోకి డిపాజిట్లు పోటెత్తాయని..వీటిలో మమతా బెనర్జీ సారధ్యంలోని పశ్చిమ బెంగాల్ మొదటిస్థానంలో కాంగ్రెస్ సారథ్యంలోని కర్నాటక రెండోస్థానంలో ఉందని వెల్లడించాయి.

11/24/2016 - 04:16

న్యూఢిల్లీ, నవంబర్ 23: రాష్ట్రాల్లో శాసన సభా స్థానాలు ఇప్పట్లో పెంచలేమని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. 2026 జనాభా లెక్కలు ప్రకటించనంత వరకు స్థానాల పెంపు అసాధ్యమని పేర్కొంది. ఆర్టికల్ 170ని సవరించకుండా తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కి పెంచటం సాధ్యంకాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ స్పష్టం చేశారు.

11/23/2016 - 02:33

న్యూఢిల్లీ, నవంబర్ 22: ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో జరిగిన ఉపఎన్నికల్లో అధికార పార్టీలు తమ పట్టును నిలబెట్టుకున్నాయి. పశ్చిమ బెంగాల్, అసోం, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నాలుగు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బిజెపిలు చెరి రెండు స్థానాలను దక్కించుకున్నాయి.

11/23/2016 - 02:27

శ్రీనగర్, నవంబర్ 22: ఏ ఉగ్రవాదులకైతే పెద్దనోట్ల సరఫరాను అడ్డుకోవాలని రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో- ఆ ప్రభుత్వానికే ఉగ్రవాదులు షాక్ ఇచ్చారు. జమ్మూలోని బండీపురా ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయ.

11/23/2016 - 02:26

అల్మోరా, నవంబర్ 22: నల్లధనం దాచుకున్నవాళ్లే పెద్దనోట్ల రద్దుపట్ల భయపడుతున్నారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. అల్మోరాలో మంగళవారం జరిగిన ఓ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇళ్లల్లో నల్లధనం లేనివాళ్లు భయపడటానికి కారణాలు ఏవైనా ఉన్నాయా? మన నేత ముఖాల్లో ఆందోళనలను మీరు గమనిస్తున్నారా? రాహుల్ బాబా ముఖాన్ని గమనించండి.. ఆయన ఎంత ఆందోళనతో ఉన్నారో కనిపిస్తుంది’’ అన్నారు.

11/23/2016 - 02:23

న్యూఢిల్లీ / కోల్‌కతా, నవంబర్ 22: దేశవ్యాప్తంగా పెద్దనోట్ల రద్దు సామాన్య జన జీవనాన్ని కకావికలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఢిల్లీలో భారీఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించాయి. మరోపక్క వారం పాటు దేశ వ్యాప్తంగా సంయుక్త ఉద్యమం చేపట్టాలని ఆరు వామపక్ష పార్టీలు నిర్ణయించాయి.

11/23/2016 - 02:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో పెద్ద నోట్ల రద్దును మీరు సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇదే ప్రశ్నను ప్రజలందరినీ అడుగుతున్నారు. నేరుగా తనకే జవాబివ్వాలంటూ అవకాశం ఇస్తున్నారు. ‘నమో’ యాప్ ద్వారా ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చు.

Pages