S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/29/2016 - 01:14

న్యూఢిల్లీ, నవంబర్ 28: తమ అక్రమ సొత్తును న్యాయబద్ధంగా మార్చుకోవడానికి నల్లకుబేరులకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 30 గడువులోగా నల్లకుబేరులు లెక్కల్లేని తమ సొత్తును స్వచ్ఛందంగా బయట పెడితే 50శాతం పన్నుతో తప్పించుకునే అవకాశం కల్పించింది. అంతే కాదు, ఈ అవకాశాన్ని వినియోగించుకునే వారికి ఆదాయం పన్ను అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

11/29/2016 - 01:02

న్యూఢిల్లీ, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన ప్రజా సమస్యల పరిష్కారానికి తగు సూచనలు, సలహాలు అందించి, సముచిత సిఫార్సులు చేసేందుకు ఏపీ సిఎం చంద్రబాబు అధ్యక్షతన ఐదుగురు సిఎంలతో ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో చర్చించిన అనంతరం ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటుపై ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు.

11/29/2016 - 00:52

న్యూఢిల్లీ, నవంబర్ 28: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య పరికరాల అభివృద్ధి సమాఖ్య (ఎండిపిసి)ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఆయన సోమవారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్‌తో పార్లమెంటు ఆవరణలోని తమ కార్యాలయంలో సమావేశమై ఎండిపిసి ఏర్పాటు గురించి చర్చించారు. ఎండిపిసిని త్వరగా ఏర్పాటు చేయాలని అనంతకుమార్‌కు సూచించారు.

11/28/2016 - 08:26

బెంగళూరు, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దు కారణంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీలకు నిద్రపట్టడం లేదని, వారి ముఖంలో కళ తగ్గిందని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. 500, 1000 నోట్ల రద్దువల్ల ఆందోళన చెందుతున్న వారంతా నల్లధనం ఉన్నవారేనని, దాన్ని ఎప్పుడు కోల్పోతామోనన్న భయమే వారిలో నిరంతరం భయాన్ని కలిగిస్తోందని, నిద్ర పట్టనివ్వడం లేదని అమిత్ షా అన్నారు.

11/28/2016 - 08:24

కుషినగర్ (ఉత్తరప్రదేశ్), నవంబర్ 27: ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా పెద్దనోట్లను రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘్భరత్ బంద్’కు పిలుపునిచ్చిన ప్రతిపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. అవినీతిని, నల్లధనాన్ని నిర్మూలించడానికి తాను ప్రయత్నిస్తుంటే వారు బంద్‌లు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆయన పరోక్షంగా ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. భారత్ బంద్ కావాలా, అవినీతి నిర్మూలన కావాలా?

11/28/2016 - 08:23

న్యూఢిల్లీ, నవంబర్ 27: దశాబ్దాలుగా పిల్లలనూ, పెద్దలనూ తన కథల ద్వారా ఆకట్టుకుంటూ భిన్న అంశాలను తెరపైకి తెస్తూ అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రఖ్యాత రచయిత రస్కిన్ బాండ్ తన కథలన్నీ నిజమైన అబద్ధాలేనంటూ ఓ ఆసక్తికర సందేశాన్ని ఇచ్చారు. కథను చెప్పడమన్నది కల్పనకు వాస్తవికతను జోడించడమేనన్నది ఆయన పేర్కొన్నారు.

11/28/2016 - 07:35

న్యూఢిల్లీ, నవంబర్ 27: పేదల బ్యాంకు ఖాతాలను ఆసరా చేసుకుని తమ అక్రమ సొత్తును డిపాజిట్ చేసే వారిని వదిలేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా తెరుచుకున్న జన్‌ధన్ ఖాతాల్లోకి కేవలం రెండు వారాల వ్యవధిలోనే వేలాది కోట్ల రూపాయలు జమ అయ్యాయంటూ వచ్చిన కధనాల నేపథ్యంలో మాట్లాడిన మోదీ ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై బినామీ లావాదేవీల నిరోధక చట్టాన్ని ప్రయోగిస్తామని తెలిపారు.

11/28/2016 - 07:30

పటియాలా, నవంబర్ 27: పంజాబ్‌లో ఆదివారం సాయుధ దుండగులు హై-సెక్యూరిటీ జైలుపై దాడికి పాల్పడి సంచలనం సృష్టించారు. పోలీసు దుస్తుల్లో వచ్చిన వీరు పటియాలా సమీపంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కలిగిన నభా జైలును బద్దలు కొట్టి పది కేసుల్లో నిందితుడిగా ఉన్న ఖలిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (కెఎల్‌ఎఫ్) అధినేత హర్మీందర్ మింటూ సహా ఐదుగురు ఖైదీలతో అక్కడి నుంచి పరారయ్యారు.

11/28/2016 - 07:24

ముంబయి, నవంబర్ 27: పెద్ద నోట్ల రద్దుపై రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు వౌనాన్ని వీడారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని రోజు వారీగా సమీక్షిస్తూ, ప్రజల వాస్తవిక సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని, సాధ్యమైనంత త్వరగా పరిస్థితులను మళ్లీ సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.

11/28/2016 - 05:21

మాటలు కాదు చేతలతోనే మార్పు సాధ్యం
అంటరానితనం పురాణాల్లో లేదు
ఆర్‌ఎస్‌ఎస్ సహ కార్యవాహ్ కృష్ణగోపాల్ ఉద్ఘాటన
వేద విద్య వ్యాప్తికి శ్రద్ధానంద నిరుపమాన కృషి
‘అసలీ మహాత్మా’ పుస్తక ఆవిష్కర్త రాజేంద్ర జిజ్ఞాసు
నిజమైన మహాత్ములకు దర్పణమే ఈ పుస్తకం
పుస్తకావిష్కరణ సభలో ఎంవిఆర్ శాస్ర్తీ

Pages