S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/26/2016 - 07:38

న్యూఢిల్లీ, నవంబర్ 25: పెద్దనోట్ల రద్దుపై పార్లమెంటు హాజరుకావడానికి ప్రధాని మోదీ ఎందుకు భయపడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. ఒక్క పక్క పార్లమెంటు ఉభయ సభలూ ఈ అంశంపై అట్టుడికి పోతుంతే మోదీ హాజరుకాకపోవడం అనేక అనుమానాలు తావిస్తోందని అన్నారు. దమ్ముంటే పార్లమెంటుకు హాజరై ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు మోదీ సమాధానం ఇవ్వాలని ఆయన సవాల్ విసిరారు.

11/26/2016 - 07:37

న్యూఢిల్లీ, నవంబర్ 25: ప్రతిపక్ష పార్టీలు నల్లధనాన్ని ప్రోత్సహిస్తున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు శుక్రవారం పార్లమెంటును కుదిపేశాయి. మోదీ తమకు క్షమాపణ చెప్పాలంటూ ప్రతిపక్ష పార్టీలు గొడవకు దిగడంతో సభాకార్యక్రమాలు స్తంభించాయి. దీంతో సోమవారానికి వాయిదా పడ్డాయి.

11/26/2016 - 07:10

న్యూఢిల్లీ, నవంబర్ 25: చిల్లర లేక సతమతమైన పౌరులకు కొత్తగా వచ్చిన 500 నోటు మరింత ఇరకాటంలో పడేసింది. కొత్త ఐదొందల నోటులో అనేక తేడాలు కనిపించడంవల్ల ప్రజలు బెంబేలెత్తారు. అయితే ఈ తేడా హడావుడిగా ముద్రించడం వల్ల జరిగిందేనని ఆర్‌బిఐ వివరణ ఇచ్చింది. నోటులో ఓ చోట మహాత్మాగాంధీ ముఖం నీడ ఎక్కువగా ఉందని అలాగే జాతీయ చిహ్నంపైనా, సీరియల్ నెంబర్‌పైనా అలైన్‌మెంట్ సరిగ్గాలేదన్న లోపాలు వెలుగులోకి వచ్చాయి.

11/26/2016 - 06:57

నల్లధన కుబేరులకు కేంద్రం మరో అవకాశం ఇచ్చింది. నిర్దేశిత పరిమాణానికి మించిన రీతిలో ఆయా వ్యక్తుల ఖాతాల్లో జమయ్యే మొత్తానికి లెక్కలు చూపించలేని పక్షంలో కనీస పక్షంగా 50 శాతం పన్ను చెల్లిస్తే చాలన్న ప్రకటన చేసింది. అయతే, బ్లాక్‌మనీని సంబంధిత ఖాతాదారు వినియోగానికి అందకుండా నాలుగేళ్ల పాటు తమ వద్దే ఉంచేసుకోవాలని సంకల్పించింది.

11/26/2016 - 06:53

న్యూఢిల్లీ, నవంబర్ 25: దేశ వ్యాప్తంగా రద్దయిన 500, 1000 నోట్లను తమ కౌంటర్ల వద్ద మార్పిడి చేసుకోవచ్చునని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది. అన్ని బ్యాంకుల్లోనూ ఈ నోట్ల మార్పిడి ఇక ఉండదని, వాటిని ఆయా ఖాతాదారులు తమతమ ఖాతాల్లోనే జమజేసుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఈ ప్రకటన చేసింది. ఒక్కో వ్యక్తి రెండు వేల చొప్పున ఈ నోట్లను కొత్త నోట్లతో మార్చుకోవచ్చునని..

11/26/2016 - 06:11

న్యూఢిల్లీ, నవంబర్ 25: ‘అవినీతి, నల్లధనానికి కొందరు బాహాటంగా మద్దతిస్తున్నారు. దీనివల్ల భావితరాలకు తీరని అన్యాయం జరుగుతుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షంపై పరోక్ష ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీ శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని బాలయోగి గ్రంథాలయంలో బిజెపి సీనియర్ నాయకుడు కేదార్‌నాథ్ సహానిపై రచించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించారు.

11/25/2016 - 08:36

న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దనోట్లపై చర్చకు రాకుండా తప్పించుకుంటున్నారంటూ ప్రతిపక్షం గురువారం రాజ్యసభను స్తంభింపజేసింది. నరేంద్ర మోదీ గురువారం మధ్యాహ్నం రాజ్యసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే భోజన విరామం తరువాత ఆయన సభకు రాకపోవడంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. పెద్దనోట్ల రద్దుపై చర్చ జరిగినంత సేపూ మోదీ రాజ్యసభలో ఉండాల్సిందేనని వారు పట్టుపడుతున్నారు.

11/25/2016 - 07:12

న్యూఢిల్లీ, నవంబర్ 24: పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల నల్లధనాన్ని పూర్తిగా అరికట్టడం సాధ్యమవుతుందని, అలాగే, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ పన్నులు ఎగవేత ద్వారా పేరుకు పోయిన నిధులనూ రూపుమాపవచ్చునని కేంద్రం గురువారం సుప్రీం కోర్టుకు తెలిపింది.

11/25/2016 - 07:07

న్యూఢిల్లీ,నవంబర్ 24: ఆదాయంతో పొంతన లేని డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే రెండు వందల శాతం పెనాల్టీ పన్ను విధించే విధానాన్ని సవరించటం గురించి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో చర్చించినట్లు తెలిసింది.

11/25/2016 - 06:55

న్యూఢిల్లీ, నవంబర్ 24: పెద్దనోట్ల రద్దు అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని చీల్చిచెండాడారు. ఐదు వందలు, వెయ్యి నోట్ల రద్దు ద్వారా ప్రధాని మోదీ వ్యవస్థీకృత దోపిడి, చట్టబద్ధ మోసానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల జిడిపి రెండు శాతం పడిపోతుందని హెచ్చరించారు.

Pages