S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/05/2016 - 02:59

హైదరాబాద్, ఆగస్టు 4: తెలంగాణ జల వనరుల సమాచార వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి, ఇస్రోకు మధ్య అవగాహనా ఒప్పందం రేపు కుదురనుంది. ఆరవ తేదీన ఉదయం 8.30కి మంత్రి హరీశ్‌రావు, ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్‌ల సమక్షంలో ఎంఓయు కుదురుతుంది.

,
08/05/2016 - 03:00

హైదరాబాద్, ఆగస్టు 4: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పదవీకాలాన్ని పొడిగిస్తారా? లేక తాజాగా గుజరాత్ సీఎం పదవికి రాజీనామా చేసిన ఆనందీ బెన్‌ను తమిళనాడు గవర్నర్‌గా నియమిస్తారా? అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రోశయ్య పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. అయితే ఆయనకు పొడిగింపు ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం జయలలిత మోదీని కోరారన్న ప్రచారం తమిళ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

,
08/05/2016 - 02:48

న్యూఢిల్లీ, ఆగస్టు 4: అరుణాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలను రద్దు చేయడంపై, ఈ వ్యవహారంలో గవర్నర్లు నిర్వహించిన పాత్రపై గురువారం రాజ్యసభలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

,
08/05/2016 - 02:43

మహద్, ఆగస్టు 4: ముంబయి-గోవా రహదారిపై వంతెన కూలిపోయిన ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం జుడీషియల్ విచారణకు ఆదేశించింది. బ్రిటీష్ కాలంనాటి వంతెన కొట్టుకుపోయి 22 మంది మృతిచెందారు. రెండు ప్రయాణికుల బస్సులు వరద నీట్లో కొట్టుకుపోయాయి. రాజధాని ముంబయికి 170 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సావిత్రి నదిపై ఉన్న పురాతన వంతెన వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది.

08/05/2016 - 02:40

న్యూఢిల్లీ, ఆగస్టు 4: వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) చట్టాన్ని అమలులోకి తెస్తామని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ఖచ్చితంగా చెప్పిన నేపథ్యంలో అందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. మరో పక్క ఈ బిల్లును ఆమోదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రకటించారు.

08/05/2016 - 02:38

న్యూఢిల్లీ, ఆగస్టు 4: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరుగుతున్న సార్క్ దేశాల మంత్రుల స్థాయి సమావేశంలో గురువారం హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగాన్ని మొత్తం మీడియా బహిష్కరించిందంటూ (బ్లాక్ అవుట్) వచ్చిన వార్తలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

08/05/2016 - 02:35

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. పోలీసు వ్యవస్థపై లెఫ్టినెంట్ గవర్నర్ పెత్తనంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి భంగపడింది. దేశ రాజధానిలో శాంతిభద్రతలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను తగ్గించలేనని కోర్టు తేల్చిచెప్పింది.

08/05/2016 - 02:33

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు వెంటనే ప్రత్యేక హోదా ఇవ్వాలన్న తమ డిమాండ్‌కు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పందించనందుకు నిరసనగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు గురువారం లోక్‌సభ జీరో అవర్‌లో వాకౌట్ చేశారు. ఎస్‌వి సుబ్బారెడ్డి, బుట్టా రేణుక, అవినాష్ రెడ్డి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పోడియం వద్ద నిలబడి ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ గొడవ చేశారు.

08/05/2016 - 02:31

న్యూఢిల్లీ, ఆగస్టు 4: సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న వందలాది మంది భారతీయుల సమస్య సంతృప్తికరంగా పరిష్కారమైందని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ గురువారం పార్లమెంటుకు చెప్పారు.

08/05/2016 - 02:29

అహ్మదాబాద్, ఆగస్టు 4: పటేళ్లకు రిజర్వేషన్ల విషయంలో గుజరాత్‌లోని బిజెపి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. అగ్రవర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడినవారికి (ఇబిసిలకు) పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాష్ట్ర హైకోర్టు గురువారం కొట్టివేసింది. రిజర్వేషన్లకోసం ఆందోళనకు దిగిన పటేళ్లను శాంతపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను జారీచేసిన విషయం తెలిసిందే.

Pages