S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/03/2016 - 15:41

న్యూదిల్లి:బాలీవుడ్ నటి, బిజెపి ఎంపి హేమమాలినిపై సామాజిక మాధ్యమంలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న మధరలో నిన్న పోలీసులకు, ఒకవర్గానికి చెందినవారికి జరిగిన ఘర్షణలో 24మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె ఈ విషయాన్ని పట్టించుకోకుండా తను పాల్గొన్న ఓ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను వెబ్‌మీడియాలో పోస్ట్ చేయడంతో అంతా భగ్గుమన్నారు.

06/03/2016 - 15:40

న్యూదిల్లి:మధురలో జరిగిన ఘర్షణల్లో పెద్దసంఖ్యలో పౌరులు, ఇద్దరు అధికారులు మరణించిన సంఘటనపై హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజా పరిస్థితులపై ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో చర్చించారు. కేంద్రంనుంచి ఎటువంటి సహాయం కావలసినా అందిస్తామని హామీ ఇచ్చారు.

06/03/2016 - 15:40

మధుర:ఉత్తరప్రదేశ్‌లోని ఓ పార్కులో ఆక్రమణలు తొలగింపు కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా ఒకవర్గానికి చెందిన ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య చెలరేగిన ఘర్షణలో 24మంది మరణించారు. మరణించినవారిలో ఎస్‌పి ముకుల్ ద్వివేది, ఓ ఎస్‌ఐతోపాటు 22మంది పౌరులు ఉన్నారు. కత్తులు, బాకులు, గ్రెనేడ్లు, రాళ్లతో ఆందోళనకారులు దాడులు చేశారు.

06/03/2016 - 07:03

న్యూఢిల్లీ, జూన్ 2: దేశ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో దేశంలోకి ప్రవేశిస్తాయని వాతావరం శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది సగటుకంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని వారు వెల్లడించారు. సాధారణ నుంచి అతి సాధారణ స్థాయిలో వర్షాలుంటాయని చల్లని కబురు చెప్పారు. సగటు కంటే ఎక్కువగా వర్షాలుపడే అవకాశం 96 శాతం ఉందన్నారు.

06/03/2016 - 06:54

న్యూఢిల్లీ, జూన్ 2: తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు చనిపోతుంటే మరోవైపు రూ. వందల కోట్లు ఖర్చు చేసి వేడుకలు చేసుకుంటారా అని కాంగ్రెస్ సీనియర్ నేత రాష్ట్ర ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఉత్సవాలపై మండిపడ్డారు.

06/03/2016 - 04:55

సూళ్లూరుపేట, జూన్ 2: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల కాలంలో ఇస్రో ప్రతి ప్రయోగాన్ని ఏదో ఒక కొత్తదనంతో చేపట్టేందుకు సన్నాహం చేస్తోంది. ఈసారి ఒకేసారి 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నద్ధమయింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు సైతం షార్‌లో శాస్తవ్రేత్తలు చురుకుగా చేస్తున్నారు.

06/03/2016 - 04:41

బాలాసోర్ (ఒడిశా), జూన్ 2: దేశాన్ని పేదరికం నుంచి విముక్తి చేయటంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. రెండేళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా గురువారం బాలాసోర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలన్నింటిలోనూ అభివృద్ధే ప్రధాన చర్చనీయాంశమైందన్నారు.

06/03/2016 - 04:39

భోపాల్, మే 2: మహారాష్ట్ర బిజెపి ఎంపీ పూనం మహాజన్ కోసం ప్రత్యే రైలు ప్రయాణం చేయడం, ఆమెకు రైల్వే అధికారులు రాచమార్యాదలు చేశారన్న వార్తలు దుమారం రేపాయి. ముంబయి వెళ్లే విమానాన్ని అందుకోడానికి బినా నుంచి భోపాల్‌కు ఎంపీ ప్రత్యేక రైలులో ప్రయాణం చేశారు. మే 31న ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే రైల్వే అధికారులు వీటన్నింటినీ తోసిపుచ్చారు.

06/03/2016 - 04:38

న్యూఢిల్లీ, జూన్ 2: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల లీవ్ ట్రావెల్ కనె్సషన్(ఎల్‌టిసి) నిబంధనలు మార్చారు. జమ్మూకాశ్మీర్‌కు ఇక నుంచి ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌లో వెళ్లొచ్చు. ఇంతకు ముందు ఈ వెసులుబాటులేదు. ఒక్క ఎయిర్ ఇండియాలో ప్రయాణిస్తేనే ఎల్‌టిసి వర్తించేది. ఇప్పుడా నిబంధనల్లో మార్పులు చేశారు.

06/03/2016 - 04:35

న్యూఢిల్లీ, జూన్ 2: ఆయుధాల వ్యాపా రి సంజయ్ భండారితో తన ఓఎస్‌డి అప్పారావు టెలిఫోన్‌లో వందాలాదిసార్లు సంభాషించినట్లు వచ్చిన ఆరోపణల్లోని నిజానిజాలు తెలుసుకుంటానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. అశోక్ గజపతిరాజు గురువారం విలేఖరులతో మాట్లాడుతూ నిజ నిర్ధారణ జరగకుండా ఎవ్వరినీ శిక్షించలేమన్నారు.

Pages