S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/05/2016 - 05:40

న్యూఢిల్లీ, జూన్ 4: ఢిల్లీలో మెర్సిడెస్ కారుతో ఢీకొట్టి ఒకరి మృతికి కారణమైన టీనేజర్‌ను మైనారిటీ తీరిన వ్యక్తిగానే పరిగణించి విచారించాలని జువెనైల్ జస్టిస్ బోర్డ్ (జెజెబి) శనివారం నిర్ణయించింది. ఈ టీనేజర్ చేసిన నేరం క్రూరమయిందని కూడా పేర్కొంది. ఒక నేరానికి పాల్పడిన మైనర్‌ను మేజర్‌గా భావించి విచారించడం దేశంలో ఇదే మొదటిసారి.

06/05/2016 - 05:38

ముంబయి, జూన్ 4: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు, పుణెలో భూమి కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు లాంటి తీవ్రమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న మహారాష్ట్ర రెవిన్యూ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే శనివారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

06/04/2016 - 20:07

ముంబై:మహారాష్ట్ర మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సేపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. భూదందా, దావూద్‌తో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఖడ్సే మంత్రి పదవిని వదులుకోవల్సి వచ్చింది.

06/04/2016 - 20:06

ముంబై:‘నా చిన్ననాటి రియల్ హీరో మీరే...ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా కలుస్తాననుకున్నా...ఆ పని చేయలేకపోయా’నంటూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిఖ్యాత బాక్సింగ్ యోధుడు మహమ్మద్ అలీకి ఈ విధంగా సచిన్ నివాళి అర్పించారు. ట్విట్టర్‌లో తన బాధను ఇలా తెలియచేశాడు.

06/04/2016 - 13:49

ముంబై: తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర రెవిన్యూమంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే రాజీనామా చేశారు. అథోజగత్తు అధిపతి దావూద్ ఇబ్రహీంసహా పలువురు తీవ్రవాదులతో సంబంధాలున్నాయని, ఆయన కాల్‌లిస్ట్‌లో దావూద్ ఫోన్‌నెంబర్ ఉందన్న విమర్శలు వచ్చాయి. 40 కోట్ల రూపాయల విలువైన ఫ్రభుత్వ భూమిని అల్లుడికి కేవలం నాలుగు కోట్ల రూపాయలకే కట్టబెట్టారన్న ఆరోపణలూ వచ్చాయి.

06/04/2016 - 07:47

సిమ్లా, జూన్ 3:దేశ జనాభాలో 75శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నందున వారికి సమగ్ర రీతిలో వైద్య సేవలను అందించడం ఓ పెద్ద సవాలేనని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. దీని దృష్ట్యా ప్రజలందరికీ నాణ్యతాయుతమైన, సమానత్వంతో కూడిన వైద్య సదుపాయాలను కల్పించే దిశగా బలమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఉద్ఘాటించారు.

06/04/2016 - 07:44

న్యూఢిల్లీ, జూన్ 3: యువ పారిశ్రామికవేత్తల్లో శక్తి, ఉత్సాహాన్ని నింపేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పది ఉన్నత విద్యా ‘స్టార్ట్ అప్స్’లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రకటించారు.

06/04/2016 - 07:41

న్యూఢిల్లీ, జూన్ 3: భారత దేశ విదేశాంగ సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నుంచి అమెరికా, మెక్సికో, ఖతర్, స్విట్జర్లాండ్, అఫ్గానిస్తాన్‌లలో పర్యటించనున్నా రు. 48 సభ్య దేశాలు కలిగిన అణు సరఫరా దేశాల కూటమిలో (ఎన్‌ఎస్‌జి) భారత్‌కు సభ్యత్వం కల్పించే విషయంలో మెక్సికో, స్విట్జర్లాండ్‌ల మద్దతును ఈ సందర్భంగా కోరబోతున్నారు.

06/04/2016 - 07:41

న్యూఢిల్లీ, జూన్ 3: దేశంలోని విద్యాసంస్థల్లో అంతర్జాతీయ స్థాయి సిలబస్ రూపకల్పనకు విదేశీ నిపుణుల సహకారం తీసుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ సంకల్పించింది.

06/04/2016 - 07:40

న్యూఢిల్లీ, జూన్ 3: సొంత నియోజకవర్గం అల్లర్లతో అట్టుడికిపోతుంటే స్పందించడం మానేసి ఎప్పుడో షూ టింగ్‌లో పాల్గొన్న ఫొ టోలను ట్విట్టర్‌లో పో స్టుచేసి మధుర ఎంపీ, న టి హేమమాలిని తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. భూ ఆక్రమణల తొలగింపులో చెలరేగిన అల్లర్లలో మధుర నగర ఎస్‌పి, ఓ సిఐ మృతి చెందినట్టు వార్తలొచ్చాయి. ఘర్షణల్నో 24 మంది వరకూ చనిపోయినట్టు తెలిసింది.

Pages