S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/01/2016 - 05:54

అలహాబాద్,మే 31: వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అలాగే బిఎస్‌పిలను పెకిలించివేస్తామని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించారు. కాంగ్రెస్ సారధ్యంలోని అవినీతిమయమైన యుపిఏ సర్కార్‌కు మచ్చలేని ఎన్‌డిఏ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ఆయన వివరించారు.

06/01/2016 - 05:51

చండీగఢ్, మే 31: హర్యానాలో గత ఫిబ్రవరిలో ఉవ్వెత్తున జరిగిన జాట్ల ఆందోళనలో జరిగిన అరాచకాలపై నిగ్గు తేల్చేందుకు ఏర్పడిన ప్రకాష్‌సింగ్ కమిటీ నివ్వెరపోయే నిజాలను బయటపెట్టింది. హైకోర్టు సమర్పించిన ఈ నివేదికలో మూకుమ్మడి అత్యాచారాలు నిజమేనని కమిటీ స్పష్టం చేసింది. ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కార్లలోంచి మహిళలను బయటకు లాగి వివస్తల్రను చేసిన ఆందోళనకారులు మూకుమ్మడి అత్యాచారాలకు పాల్పడ్డారని పేర్కొంది.

06/01/2016 - 05:46

న్యూఢిల్లీ, మే 31: భారత నౌకాదళ ప్రధానాధికారిగా అడ్మిరల్ సునీల్ లాంబా (58) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకూ నౌకాదళ ప్రధానాధికారిగా సేవలు అందించిన అడ్మిరల్ ఆర్‌కె.్ధవన్ పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన సునీల్ లాంబా పూర్తిగా మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు.

06/01/2016 - 05:44

బెంగళూరు, మే 31: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో కర్నాటక నుంచి కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలకు చివరిరోజు మంత్రి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అవుట్‌సైడర్ అన్న విమర్శలపై ఆమె స్పందించారు.‘కర్నాటక ప్రాజెక్టుల పరిరక్షణకు కృషి చేస్తాను. అంతేకాదు కన్నడం నేర్చుకుంటాను’అని సీతారామన్ హామీ ఇచ్చారు.

06/01/2016 - 05:42

పుల్‌గావ్, మే 31: మహారాష్టల్రోని పుల్‌గావ్ ఆయుధగారంలో జరిగిన పేలుళ్ల శబ్దానికి చుట్టుపక్కలంతా దద్దరిల్లిపోయింది. సమీప గ్రామాల్లోని ఇళ్లు ఊగిపోయాంటే ధాటి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆయుధగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో 18మంది భద్రతా సిబ్బంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. భూకంప వస్తే ఎలా ఉంటుందో అలాంటి భయానక పరిస్థితి చూశామని గ్రామస్తులు తెలిపారు.

06/01/2016 - 05:38

రాయ్‌బరేలీ, మే 31: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తనను తాను షహన్‌షా(చక్రవర్తి)గా భావించుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ఆరోపించారు. తన లోక్‌సభ నియోజక వర్గం రాయ్‌బరేలీలో ఆమె విలేఖరులతో మాట్లాడారు. ‘ఇలాంటి పరిస్థితిని నేనెన్నడూ చూడలేదు. ఇక్కడ ప్రధానమంత్రి ఉంటారు.. చక్రవర్తి కాదు. ఆయన దేశానికి ప్రధానమంత్రి. దేశంలో తీవ్రమైన పేదరికం ఉంది. కరవు ఉంది..

06/01/2016 - 05:35

న్యూఢిల్లీ, మే 31: భారత దేశంలో కలుషిత రక్తాన్ని ఎక్కించటం వల్ల గత 17 నెలల్లో 2234 మందికి హెచ్ ఐ వీ వైరస్ సోకిందని హిందూ దినపత్రిక ఓ నివేదికను వెలువరించింది. ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 361 కేసులు ఇలాంటివి నమోదయ్యాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. గుజరాత్‌లో 292 కేసులో, మహారాష్టల్రో 272, ఢిల్లీలో 264 కేసులు నమోదయ్యా యి.

06/01/2016 - 05:33

న్యూఢిల్లీ, మే 31: ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌కు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు గ్రీన్ ట్రిబ్యునల్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

06/01/2016 - 05:32

నైనిటాల్, మే 31: స్టింగ్ ఆపరేషన్‌కు సంబంధించిన సీడీ కేసులో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ అరెస్టుపై ఆ రాష్ట్ర హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఈ అంశంపై జూన్ 20వ తేదీన తదుపరి విచారణ జరుపనుంది. రావత్‌కు ప్రమేయం ఉన్న స్టింగ్ ఆపరేషన్‌పై దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) గత వారం ఆయనను ప్రశ్నించిన విషయం విదితమే.

,
06/01/2016 - 03:59

భద్రాచలం, మే 31: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మంగళవారం పెను విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా నవాగఢ్ బ్లాక్‌లోని కేతుల్‌నార్ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో పాలు తాగిన చిన్నారుల్లో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో ఛత్తీస్‌గఢ్ సర్కారు ఉలిక్కిపడింది. అస్వస్థతకు గురైన చిన్నారులను నవాగఢ్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు.

Pages