S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/03/2016 - 04:19

న్యూఢిల్లీ, జూన్ 2: యోగ విద్యను ప్రపంచవ్యాప్తంగా మరింత పాపులర్ చేయడం కోసం మొట్టమొదటిసారిగా యోగ విద్యలో స్వల్పకాలిక కోర్సు చేయడానికి వచ్చే విదేశీయులకు టూరిస్టు వీసా, ఇ-టూరిస్టు వీసాను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

06/03/2016 - 04:19

న్యూఢిల్లీ, జూన్ 2: దేశ ప్రజలకు చల్లని కబురు. నైరుతి రుతుపవనాలు మరో నాలుగైదు రోజుల్లో దేశంలోకి ప్రవేశిస్తాయని వాతావరం శాఖ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది సగటుకంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని వారు వెల్లడించారు. సాధారణ నుంచి అతి సాధారణ స్థాయిలో వర్షాలుంటాయని చల్లని కబురు చెప్పారు. సగటు కంటే ఎక్కువగా వర్షాలుపడే అవకాశం 96 శాతం ఉందన్నారు.

06/03/2016 - 04:16

న్యూఢిల్లీ, జూన్ 2: ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీని త్వరలోనే పార్టీ అధ్యక్షుడిగా నియమించవచ్చన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌పై వ్యంగ్య బాణాలు విసిరారు. ‘రాహుల్ గాంధీని కాంగ్రెస్ అధ్యక్షుడ్ని చేయడం అంటే బిజెపికి ‘అచ్ఛేదిన్’(మంచిరోజులు) రావడమే’అని ఒక ఇంగ్లీషు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు.

06/03/2016 - 04:11

న్యూఢిల్లీ, జూన్ 2: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని అధ్యక్షుడుగా నియమిస్తే రాజీనామా చేసి స్వంత పార్టీని ఏర్పాటు చేసుకుంటానని చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు అజిత్ జోగి హెచ్చరించి సంచలనానికి తెరతీశారు. రాహుల్‌కు పార్టీ పగ్గాలు అప్పగించటాన్ని పలువురు సీనియర్ నాయకులు గట్టిగా వ్యతిరేకిస్తున్న తరుణంలో అజిత్‌జోగి తిరుగుబాటు బావుటా ఎగురవేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

,
06/03/2016 - 02:42

అహ్మదాబాద్, జూన్ 2: పధ్నాలుగేళ్ల క్రితం గుజరాత్‌లో నాటి కాంగ్రెస్ ఎంపీ ఇషాన్ జాఫ్రీ సహా 69మందిని కిరాతకంగా ఊచకోత కోసిన గుల్బర్గ్ సొసైటీ కేసులో 24 మందికి శిక్ష పడింది. అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఈ కేసులో గురువారం తీర్పు చెప్పింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పిబి దేశాయ్ ఈ కేసులో తీర్పు చెప్తూ బీజేపీ సిట్టింగ్ కార్పొరేటర్ బిపిన్ పటేల్ సహా 36మందిని నిర్దోషులుగా విడుదల చేశారు.

06/02/2016 - 20:16

న్యూదిల్లి:అక్రమంగా భూములు ఆక్రమణ, అధోజగత్తు నాయకుడు దావూద్ ఇబ్రహీంకు ఫోన్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర సీనియర్ మంత్రి ఏక్‌నాథ్ ఖాడ్సెపై ‘వాస్తవాల’తో కూడిన నివేదికను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు సమర్పించానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. రెండు కుంభకోణాల్లో మంత్రి పాత్రపై ఇరువరు నేతలూ సుదీర్ఘంగా చర్చించారు.

06/02/2016 - 17:59

న్యూదిల్లి:కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకురాలు షీలాదీక్షిత్ మద్దతు తెలిపారు. సోనియా స్థానంలో రాహుల్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలని ఆమె సూచించారు. రాహుల్ బృందంలో యువనేతలకు స్థానం కల్పించేదుకు పార్టీలోని సీనియర్లు వివిధ బాధ్యతలనుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ఆమె స్పష్టం చేశారు.

06/02/2016 - 17:44

న్యూథిల్లి:మరో నాలుగురోజుల్లో నైరుతి రుతుపవనాలు రానున్నాయి. ఈనెల 7వ తేదీనాటికి కేరళను అవి తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనావేస్తోంది. గత ఏడాదికన్నా అధికంగా ఈసారి వర్షపాతం నమోదవుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.

06/02/2016 - 17:15

ముంబై:ఆర్థిక రాజధాని ముంబైలోని అత్యంత రద్దీ ప్రాంతమైన కొలాబాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం మధ్యాహ్నం రీగల్ సినిమా సమీపంలోని బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న ముగ్గురిని రక్షించారు. 12 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్‌మెన్ పనిచేస్తున్నారు.

06/02/2016 - 15:55

న్యూదిల్లి:కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను ఆ పార్టీ యువనేత రాహుల్‌గాంధీ చేపడితే బిజెపికి మంచిరోజులు వచ్చినట్టేనని మానవవనరుల శాఖ మంద్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. రాహుల్‌కు కాంగ్రెస్ పగ్గాలు అందిస్తారని వస్తున్న వార్తలపై ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వ్యాఖానిస్తూ ఈ వ్యంగ్యోక్తి విసిరారు. జెఎన్‌యు సంఘటనసహా పలు అంశాలపై ఆమె నిర్మొహమాటంగా మాట్లాడారు.

Pages