S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/02/2016 - 14:55

గుజరాత్:గోద్రా సంఘటన అనంతరం చెలరేగిన అల్లర్లలో గుల్బర్గ్‌లో జరిగిన మారణకాండ కేసులో 24మందిని దోషులని ప్రత్యేక న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ కేసులో మొత్తం 66 మంది నిందితులుకాగా 35మంది నిర్దోషులను పేర్కొంది. 11మందికి హత్య కేసులో దోషులని తేల్చింది. దోషులందరికీ సోమవారంనాడు శిక్షలు ఖరారు చేయనుంది. గోద్రా సంఘటన తరువాత గుల్బర్గ్ సొసైటీ ప్రాంతంలో 69మందిని ఊచకోత కోసిన సంఘటన దేశంలో దుమారం రేపింది.

06/02/2016 - 14:54

బాలాసోర్:ప్రజల ఆలోచనా విధానంలో సమూల మార్పులు రావాలని, ఈ కాలంలో ఆడామగా ఒకటేనని, లింగవివక్ష ఉండకూడదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వికాస్‌సభలో ఆయన మాట్లాడారు. ఒడిశాలో అధికారంలో లేకపోయినప్పటికీ ఇక్కడి సమస్యల పరిష్కారంకోసం పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయన విపులంగా వివరించారు.

06/02/2016 - 07:58

భోపాల్, జూన్ 1: మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీచేస్తున్న పాత్రికేయుడు ఎంజె అక్బర్, బిజెపి సీనియర్ నేత అనిల్ దవే ఇద్దరూ అఫిడవిట్‌లో తమకు సొంత కారు లేదని తెలిపారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ టంఖా మాత్రం మెర్సిడెజ్ బెంజ్‌తోపాటు ఐదు వాహనాలు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్‌లో చూపారు. బిజెపి అభ్యర్థి, సీనియర్ జర్నలిస్టు ఎంజె అక్బర్ (65), ఆయన భార్యకు 44 కోట్ల విలువైన ఆస్తులున్నాయి.

06/02/2016 - 07:57

న్యూఢిల్లీ, జూన్ 1: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి జాతీయ కార్యవర్గం అలహాబాద్‌లో ఈ నెల 12, 13తేదీలలో సమావేశం కానుంది. అసోంలో ఘనవిజయంతో ఊపుమీదున్న బిజెపి దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన యూపిలో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది.

06/02/2016 - 07:56

న్యూఢిల్లీ, జూన్ 1: మూడుసార్లు నోటి మాటగా తలాక్ చెప్పి విడాకులు తీసేసుకోవడాన్ని దేశంలోని ముస్లిం మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ వారు పోరాటానికి సైతం సిద్ధమవుతున్నారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బిఎంఎంఏ) సంస్థ నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరాటంలో భాగంగా ఈ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించాలని కోరే ఒక పిటిషన్‌పై 50 వేలకు పైగా ముస్లింలు ఇప్పటికే సంతకాలు చేశారు.

06/02/2016 - 07:55

న్యూఢిల్లీ, జూన్ 1: ఆస్తులు సంపాదించడం తప్పు కాదని, అయితే ఆ ఆస్తులు సక్రమమార్గంలో సంపాదించినవై ఉండాలని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు మూర్ఖమైందని కర్నాటక ప్రభుత్వం వాదించిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘ఆస్తులు సంపాదించడం నేరం కాదు.

06/02/2016 - 07:54

పాట్నా, జూన్ 1: పొలిటికల్ సైన్స్ అంటే వంటలు నేర్పే సబ్జెక్ట్ అట. ఇంటర్మీడియట్‌లో ఆ సబ్జెక్ట్‌లో రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచిన ఓ విద్యార్థిని చెప్పిన సమాధానమిది. అంతేకాదు ఆ అమ్మాయి ఆ పదాన్ని సరిగా ఉచ్చరించలేకపోయింది కూడా. సైన్స్‌లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన మరో విద్యార్థి అయితే తన సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక స్థాయి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక పోయాడు.

06/02/2016 - 07:53

న్యూఢిల్లీ, జూన్ 1: ప్రతి ఒక్కరికీ సొంతింటి కలను నిజం చేయడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లభించే సాయం కొత్తగా సొంతింటిని కట్టుకునే వారికే కాదు, ఇప్పుడున్న ఇంటికి అదనంగా కనీసం 9 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాను చేర్చుకున్నా సరే ఈ పథకం కింద సాయం లభిస్తుంది.

06/02/2016 - 07:53

చెన్నై, జూన్ 1: పెట్రోలు, డీజిలు ధరలను భారీగా పెంచుతూ పెట్రోలియం కంపెనీలు తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం డిమాండ్ చేశారు. కాగా, సిపిఎం సైతం పెట్రో ధరల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ సర్కారు జరపుతున్న వృథా ఖర్చుకు ప్రజలనుంచి ముక్కుపిండి వసూలు చేయడమే ఈ చర్య అని దుయ్యబట్టింది.

06/02/2016 - 07:20

న్యూఢిల్లీ, జూన్ 1: ఖరీఫ్‌లో ధాన్యం కనీస మద్దతు ధరను మరో అరవై రూపాయలు పెంచేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం తమ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఖరీఫ్ ధాన్యం కనీస మద్దతు ధరను క్వింటాలుకు 1,410 నిర్ణయించటం తెలిసిందే.

Pages