S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/02/2016 - 06:30

న్యూఢిల్లీ, జూన్ 1: కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టనున్నారా? ఈ విషయంలో సోనియాగాంధీ తుది నిర్ణయానికి వచ్చేశారా? రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుందా? అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. తర్జన భర్జనల అనంతరం సోనియా ఎట్టకేలకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి. సిడబ్ల్యుసిలో కూలంకషంగా చర్చించి ప్రకటించే అవకాశం ఉందని కూడా అంటున్నాయి.

06/01/2016 - 17:27

ముంబయి: మహరాష్ట్రలోని పుల్గావ్‌లో ఆర్మీ ఆయుధాగారంలో అగ్నిప్రమాదం వల్ల జరిగిన ప్రాణ నష్టానికి కేంద్రానిదే బాధ్యత అని శివసేన ప్రభుత్వంపై మండిపడింది. దీని వెనుక విద్రోహ చర్య ఉందనే అనుమానాలు వస్తున్నాయని వెల్లడించింది. దేశ భద్రతకు సంబంధించిన అంశంపై కేంద్రం బాధ్యతారహితంగా ప్రవర్తించడం సిగ్గుచేటు అని శివసేన తమ పత్రిక సామ్నాలో వెల్లడించింది.

06/01/2016 - 16:36

దిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీ త్వరలోనే అధిష్ఠిస్తారన్న ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. ఇటీవల వరుస ఓటములతో ఆ పార్టీ ప్రతిష్ట మసకబారుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కొత్తతరానికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాహుల్‌కు అధ్యక్ష పదవిని అప్పగించాలని సోనియా భావిస్తున్నారు.

06/01/2016 - 16:35

జమ్ము: నరేంద్ర మోదీ మరో 15 ఏళ్లపాటు ప్రధానిగా కొనసాగుతారని, ఈ విషయంలో కాంగ్రెస్ వారికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బుధవారం జమ్ములో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మోదీ ప్రధానిలా కాకుండా ఈ దేశానికి చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ పాశ్వాన్ ఈ విధంగా స్పందించారు.

06/01/2016 - 16:06

ముంబయి: బాలీవుడ్ హాస్య నటుడు రజాక్ ఖాన్ బుధవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. బాద్‌షా, హాలో బ్రదర్, హెరాఫెరీ, హాసీనా మాన్ జాయేగీ, జోరు కా గులామ్ వంటి 90కిపైగా సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

06/01/2016 - 14:29

చెన్నై: వరసగా రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రజల సమస్యలపై లేఖలు సంధించడం ప్రారంభించారు. తాజాగా పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలంటూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు.

06/01/2016 - 14:27

దిల్లీ: రాయితీ లేని వంటగ్యాస్ (ఎల్‌పిజి) సిలిండర్‌పై 21 రూపాయలు అదనంగా పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. పెంచిన ధర బుధవారం నుంచి అమలులోకి వచ్చింది. దిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 527.50 రూపాయల నుంచి 548.50 రూపాయలకు పెరిగింది. ఈ ధర వివిధ పట్టణాల్లో వివిధ రకాలుగా ఉంటుంది.

06/01/2016 - 14:26

ముంబయి: మహారాష్టల్రోని వార్ధా జిల్లా పుల్గావ్ వద్ద ఆర్మీ ఆయుధాగారంలో అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 18కి చేరింది. సోమవారం రాత్రి మంటలు వ్యాపించడతో 16 మంది మరణించారని అధికారులు ప్రకటించారు. బుధవారం ఉదయం సంఘటన ప్రాంతంలో మరో రెండు మృతదేహాలు లభించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు ఆర్మీ అధికారులతో పాటు 16 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

06/01/2016 - 06:20

న్యూఢిల్లీ, మే 31: పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. పెట్రోల్‌పై లీటర్‌కు 2.58 పైసలు, డీజిల్ లీటర్‌కు 2.26 పైసలు పెరిగాయి. మంగళవారం అర్థరాత్రి నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. తాజా వడ్డింపుతో ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు 65.60 పైసలు, డీజిల్ లీటర్ 53.93 పైసలకు చేరుకుంది. చివరి సారిగా ఈనెల 16న పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి.

06/01/2016 - 05:57

న్యూఢిల్లీ, మే 31: ఆఫ్రికా దేశీయులపై జరుగుతున్న వరుస దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సమాయత్తమైంది. ఢిల్లీలో చోటుచేసుకున్న కాంగో యువకుడి హత్య జాతి విద్వేషనేరం కాదని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేశారు. కాంగో దేశానికి చెందిన యువకుడిపై రెండురోజుల క్రితం కొందరు ఢిల్లీలో దాడికి పాల్పడి హత్య చేసిన విషయం తెలిసిందే.

Pages