S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/04/2016 - 07:39

న్యూఢిల్లీ, జూన్ 3: పఠాన్‌కోట్ దాడిని కొనసాగించడంలో పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు సాయపడ్డం వెనుక పాక్ ప్రభుత్వం లేదా దాని ఏజన్సీకి హస్తం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ జాతీయ దర్యాప్తు ఏజన్సీ(ఎన్‌ఐఏ) చీఫ్ చేసినట్లుగా చెప్తున్న ప్రకటన భారత్, పాకిస్తాన్‌ల మధ్య కొత్త వివాదానికి తెరదీసింది.

06/04/2016 - 07:39

న్యూఢిల్లీ, జూన్ 3: తమ బ్యాంక్ ఖాతాలతో ఆధార్ నంబర్లను అనుసంధానం చేసుకోవడానికి బ్యాంకులకు వచ్చే పెన్షనర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని బ్యాంకులు ఆదేశాలు ఇచ్చినట్లు కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ శుక్రవారం చెప్పారు.

06/04/2016 - 07:38

అనంత్‌నాగ్, జూన్ 3: జమ్మూకాశ్మీర్‌లోని బిజ్‌బెహారాలో శుక్రవారంనాడు ఆర్మీ కాన్వాయ్‌పై తీవ్రవాదులు తెగబడ్డారు.

06/04/2016 - 07:37

చెన్నై, జూన్ 3: తమిళనాడులో శుక్రవారం నాటి ఘరో రోడ్డు ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఒక బస్సు, లారీ, కారు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కనీసం 30 మంది గాయపడ్డారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా మెలుంమలైలో ఈ దారుణం చోటుచేసుకుంది. బెరిగైన నుంచి 33 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వేరుశెనగ లోడుతో వస్తున్న లారీని బలంగా ఢీకొంది.

06/04/2016 - 07:35

కోహిమా, జూన్ 3: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు కంచె నిర్మాణం ఈ ఏడాది చివరి నాటికల్లా పూర్తవుతుందని, ఆ తర్వాత ఇరువైపులనుంచి ఏ ఒక్కరు కూడా అక్రమంగా సరిహద్దులు దాటడానికి అనుమతించరని కేంద్ర న్యాయ శాఖ మంత్రి డివి సదానంద గౌడ చెప్పారు.

06/04/2016 - 08:42

మధుర, జూన్ 3: ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న వందలాది మంది మారణాయుధాలతో చేసిన దాడిలో నగర పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పి) ముకుల్ ద్వివేది, స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఒ) సంతోశ్ కుమార్ మృతి చెందారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద ఎత్తున జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య 24కు పెరిగింది.

06/03/2016 - 17:56

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని మేలుమళై ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో 14మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. కర్నాటకకు చెందిన వీరంతా ఓ ప్రైవేటు బస్సులో వెళుతూండగా లారీ ఢీకొట్టింది. దుర్ఘటన స్థలంలోనే 12మంది మరణించగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో పదిహేనుమందికి గాయాలయ్యాయి.

06/03/2016 - 16:13

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు హామీ ఇచ్చారు. శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఎన్నికకు సహకరించిన తెలుగుదేశం పార్టీ అధినేతకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

సమస్యలు ప్రస్తావిస్తా: టిజి

06/03/2016 - 16:11

హైదరాబాద్:రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌నుంచి కేంద్రమంత్రులు సురేశ్‌ప్రభు, సుజనాచౌదరి, నేతలు టిజివెంకటేశ్, విజయసాయిరెడ్డి పోటీ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనారు. తెలంగాణనుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా ఈ మేరకు ఎన్నికల అధికారులనుంచి ధ్రువపత్రాలు అందుకున్నారు.

06/03/2016 - 15:42

చెన్నై:తంజావూరులో జరిగిన సంఘటనలకు సంబంధించి మహమ్మద్ నజీర్‌సహా ఆరుగురిపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసులు నమోదు చేసింది. సామాజిక మాధ్యమం ద్వారా ఐసిస్ తీవ్రవాద సంస్థలోకి సభ్యులను చేరుస్తున్నవీరిపై కేసు నమోదు చేసింది.

Pages