S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/28/2015 - 18:08

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక 'కాంగ్రెస్ దర్శన్‌' కంటెంట్‌ ఎడిటర్ సుదీప్ జోషిపై వేటు వేసింది. సోనియా గాంధీ, జవహర్లాల్ నెహ్రూలపై ఆ పత్రికలో వచ్చిన వ్యాసాలలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కశ్మీరు, చైనా, టిబెట్‌లకు సంబంధించిన సమస్యలకు కారణం నెహ్రూయేనని పేర్కొన్నారు.

12/28/2015 - 17:59

గౌహతి: కాంగ్రెస్ నేత నోలామొని సేన్ డెకాకు వ్యతిరేకంగా అసోం అంతటా నిరసనలు పెల్లుబికాయి. కేంద్ర మంత్రి స్మతీ ఇరానీని మోదీ రెండో భార్యని ఆరోపించిన డెకాపై బిజెపి కన్నెర్ర చేసింది. వెంటనే అతడిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని కోరింది. డెకాపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వెనకాడుతోంది. అతడి వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పి ఊరుకుంది.

12/28/2015 - 16:30

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలను యూరోప్‌లో చేసుకోనున్నారు. కొన్ని రోజుల పాటు యూరోప్ వెళ్తున్నానని, అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ సుఖసంతోషాలను ఇస్తుందని ఆశిస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు.

12/28/2015 - 16:28

చండీగఢ్ :చండీగఢ్ లో సోమవారం భవనం కుప్పకూలిన దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు మరణించగా మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించిన పోలీసులు సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

12/28/2015 - 13:52

న్యూఢిల్లీ : కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, అజాద్ తదితరులు పాల్గొన్నారు.

12/28/2015 - 13:48

న్యూఢిల్లీ :డీడీసీఏలో అవినీతికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ నైతిక బాధ్యతవహించాలని ఎంపీ కిర్తి అజాద్ అన్నారు. బిజెపి నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ కిర్తి అజాద్ మీడియాతో మాట్లాడుతూ తనపై చర్య తీసుకోవటం పార్టీకే అప్రతిష్ట అని పేర్కొన్నారు. డీడీసీఏ కుంభకోణాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతుందని అన్నారు.

12/28/2015 - 12:38

దిల్లీ: కడప జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం దిల్లీలో నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసింది. వీరి నుంచి కోటి రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన వారిలో ముగ్గురు చైనా దేశీయులు ఉన్నారు.

12/28/2015 - 07:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఇప్పుడున్న పార్లమెంటు భవనం 88ఏళ్ల నాటిది కావడంతో దానిపై ఒత్తిడి పెరిగిపోతోందని, మరోవైపు స్థలం కూడా చాలడం లేదని, అందువల్ల కొత్త పార్లమెంటు భవనం నిర్మిస్తే బాగుంటుందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఒక ప్రతిపాదన చేసారు. అంతేకాక ప్రత్యామ్నాయ స్థలంకోసం ఆమె రెండు మార్గాలను సైతం సూచించారు.

12/28/2015 - 07:12

లక్నో, డిసెంబర్ 27: ఉగ్రవాదులకు భారత్‌లో ఎప్పటికీ చోటు ఉండదని, దేశంలో ఐఎస్ ఎన్నటికీ బలపడబోదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాల విలువలు ఇందుకు పెద్ద అడ్డంకి అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఐఎస్ ఉగ్రవాద సంస్థ భారత్‌లో వేళ్లూనడానికి ప్రయత్నించి విఫలమైందని, సమాజంలో బలంగా ఉన్న కుటుంబ విలువలే దీనికి కారణమని ఆయన అన్నారు.

12/28/2015 - 07:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎం.్ఫల్ కోర్సులు చేస్తున్న వారిలో పురుషుల కన్నా స్ర్తిలే ఎక్కువ మంది ఉన్నారు. అయితే గ్రాడ్యుయేషన్‌లోపు కోర్సుల్లో, డిప్లొమా కోర్సుల్లో మాత్రం స్ర్తిలకన్నా పురుషులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యపై నిర్వహించిన ఒక సర్వేలో ఈ విషయం వెల్లడయింది.

Pages