S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/02/2015 - 06:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఏకాభిప్రాయంతోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లభిస్తుందని కేంద్ర మంత్రులెవరు ప్రకటించినా తప్పే అవుతుందని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర సాంకేతికాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వై.ఎస్.చౌదరి స్పష్టం చేశారు. ప్రత్యేక కేటగిరి హోదాను ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.

12/02/2015 - 06:49

రాలెగావ్ సిద్ధి, డిసెంబర్ 1: ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ శాసనసభలో ప్రవేశపెట్టిన జన లోక్‌పాల్ బిల్లుకు కేంద్రం గనుక అడ్డంకులు సృష్టించినట్లయితే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే చెప్పారు.

12/02/2015 - 06:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: విశ్వ భారతి వైస్ చాన్సలర్ సుశాంత దత్త గుప్తాను బర్తరఫ్ చేయడానికి సంబంధించిన ఫైలును రాష్టప్రతి కార్యాలయం మరోసారి తిప్పి పంపింది. గత మూడు నెలల్లో రాష్టప్రతి కార్యాలయం ఈ ఫైలును తిప్పపంపడం ఇది రెండోసారి.

12/02/2015 - 06:48

చెన్నై, డిసెంబర్ 1: కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కుమారుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్తీ చిదంబరంతో సంబంధం ఉన్న వ్యాపార భాగస్వాములకు చెందిన కొన్ని కార్యాలయాలపై ఆదాయం పన్ను విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం సోదాలు జరిపాయి. సోదాలు జరుపుతున్న వాటిలో కార్తీ చిదంబరానికి వాటా ఉన్న ఒక ప్రైవేట్ ఐ కేర్ సంస్థసహా కొన్ని కంపెనీలు ఉన్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపాయి.

12/02/2015 - 06:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను సత్వరం అందించేందుకు వీలుగా ప్రతి ఏటా 50వేల అంగన్‌వాడీ కేంద్రాలను నిర్మించనున్నట్లు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకాగాంధీ వెల్లడించారు. వీటి నిర్మాణానికి అవసరమైన నిధులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి కొంత, ఐసిడిఎస్ బడ్జెట్‌నుంచి మరికొంత కేటాయించడం జరుగుతుందన్నారు.

12/02/2015 - 06:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపెద్ద మాటలు చెబుతున్నారనీ, చేతల్లో మాత్రం ఏమీ ఉండటం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున దాడికి దిగారు. లోక్‌సభలో మంగళవారం అసహనం పెరిగిపోవటం గురించి మాట్లాడుతూ పాకిస్తాన్ నుండి మంచి గుణాలు నేర్చుకోవాలి కానీ చెడ్డ గుణం కాదని మోదీకి హితవు చెప్పారు.

12/02/2015 - 06:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ఇకపై ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్‌లను యాజమాన్యాల ధ్రువీకరణ లేకుండానే పరిష్కరించుకోవచ్చు. ఇపిఎఫ్‌ఓ చందాదారులు తమ దరఖాస్తులను యజమాని ధ్రువీకరణ లేకుండానే దాఖలు చేసుకోవడానికి ఇపిఎఫ్‌ఓ సంస్థ మంగళవారం అనుమతించింది. ఇప్పటివరకు పిఎఫ్ చందాదారులు తమ పిఎఫ్ విత్‌డ్రాయల్స్‌కు సంబంధించిన క్లెయిమ్‌లను ప్రస్తుత లేదా మాజీ యజమానుల ద్వారా స్వయంగా సమర్పించాల్సి వచ్చేది.

12/02/2015 - 04:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: విద్వేష సంఘటన ఎక్కడ జరిగినా అది సమాజానికే కాకుండా దేశానికే మాయని మచ్చ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇలాంటి ఘటనలకు గురయ్యే వారి బాధ మొత్తం దేశానిదేనని స్పష్టం చేసిన ప్రధాని సమైక్యత, సామరస్యంతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని తెలిపారు.

12/02/2015 - 04:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: అవినీతిని పూర్తి స్థాయిలో కళ్లెం వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. లంచం తీసుకునే అధికారులకు విధించే గరిష్ఠ శిక్షాకాలాన్ని అయిదేళ్లనుంచి ఏడేళ్లకు పెంచడానికి ఉద్దేశించిన అవినీతి నిరోధక చట్టం సవరణ బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. 1988 నాటి అవినీతి నిరోధక చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన బిల్లును కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టారు.

12/02/2015 - 04:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: సేంద్రీయ ఎరువులు, జీవ ఎరువులకు రాయితీలు ఇస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి అనంతకుమార్ ప్రకటించారు.

Pages