S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/25/2018 - 01:38

పాక్‌యాంగ్ (సిక్కిం), సెప్టెంబర్ 24: దేశంలో సామాన్యుడు సైతం విమానాల్లో ప్రయాణించాలన్నది తమ ప్రభుత్వ ఆశయమని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారంనాడు ఇక్కడ ఉద్ఘాటించారు. హవాయి చెప్పులు వేసుకునేవారు సైతం విమానాల్లో విహరించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేస్తూ సిక్కింలో మొట్టమొదటి విమానాశ్రయాన్ని ఆయన జాతికి అంకితం చేశారు. ఈశాన్య భారతాన్ని భారత వృద్ధికి శోధక యంత్రంగా మార్చాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.

09/25/2018 - 01:36

రాయ్‌పూర్, సెప్టెంబర్ 24: నక్సల్స్‌కు వారి సానుభూతిపరుల నుంచి మేధో, ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందకుండా తమ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపడుతోందని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్ అన్నారు.

09/25/2018 - 01:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: దేశంలో పది లక్షల మంది జనాభాకు 19 మంది న్యాయమూర్తులే ఉన్నారని న్యాయ మంత్రిత్వశాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. అలాగే దేశ వ్యాప్తంగా కింది కోర్టులను కలుపుకుని 6000 మంది న్యాయమూర్తుల పోస్టుల ఖాళీగా ఉన్నాయని వెల్లడించారు. కింది కోర్టుల్లోనే కేవలం 5000 మంది జడ్జిలను నియమించాల్సి ఉంది. జడ్జిల ఖాళీలకు సంబంధించి గత మార్చిలో కేంద్ర న్యాయశాఖ ఓ నివేదిక రూపొందించింది.

09/25/2018 - 01:35

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఆర్‌ఎస్‌ఎస్ సిఫార్సు చేసిన అధికారులను నియమించడానికి స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్సు (ఎస్‌పిజి) మాజీ చీఫ్ నిరాకరించడం వల్లే ఆయనను పదవి నుంచి తొలగించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు నిరాధారం, అవాస్తవమని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

09/25/2018 - 01:34

దేశ రాజధాని నగరం వర్ష బీభత్సానికి అతలాకుతలమయంది. పెనుగాలుల తీవ్రతకు కుప్పకూలిన ఓ మహావృక్ష దృశ్యమిది.

09/25/2018 - 01:32

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కుంభకోణంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టాలని కాంగ్రెస్ అధినాయకత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కె.వి.చౌదరిని కోరింది.

09/25/2018 - 01:06

అమేథీ, సెప్టెంబర్ 24:రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డారు. దేశానికి కాపలాదారుడ్నని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ పేదల నుంచి సొమ్మును లాక్కుని పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీకి అప్పగించారని రాహుల్ ఆరోపించారు. రాఫెల్ డీల్‌కు సంబంధించి సమాధానం చెప్పాలంటూ మోదీకి అనేక ప్రశ్నలను సంధించారు.

09/25/2018 - 01:02

లక్నో, సెప్టెంబర్ 24: రాజకీయ ప్రయోజనాలను ఆశించే రాఫెల్‌పై కాంగ్రెస్ రాద్ధాంత చేస్తోందని కేంద్ర హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శించారు. రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హోలాండ్ వివరణ ఇచ్చినా కాంగ్రెస్ అదేపనిగా ఆరోపణలు చేయడం సిగ్గుచేటని ఆయన దుయ్యబట్టారు. హోలాండ్ వివరణతో అన్ని అనుమానాలు పటాపంచలయ్యాయని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

09/25/2018 - 00:56

పూరి, సెప్టెంబర్ 24: కాంగ్రెస్ సహా దేశంలోని విపక్షాలన్నింటికీ మోదీ ఫోబియా పట్టుకుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ జరిగిన మహిళల సభలో మాట్లాడుతూ విపక్షాలకు అభివృద్ధిపై ఎలాంటి అజెండా లేదని, మోదీని విమర్శించడమే వారి పని అని అన్నారు.

09/25/2018 - 00:29

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: అమృత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సులభతర జీవన సూచీ-2018లో తెలంగాణకు నాలుగో స్థానం లభించగా, ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. సోమవారం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పూరి అమృత్ పథకంలో భాగంగా ఈజ్ ఆప్ లివింగ్ ఇండెక్-2018 విడుదల చేశారు.

Pages