S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/18/2020 - 13:24

న్యూఢిల్లీ: ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తివేయాలని సుప్రీం కోర్టు సూచించింది. అలాగే స్థానిక ఎన్నికలను ప్రభుత్వంతో సంప్రదించకుండా ఆరువారాల పాటు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న చర్యపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో భాగంగా రాష్ట్రంలో విధించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రద్దుచేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

03/18/2020 - 13:23

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బాధితుల సంఖ్య 147కు చేరుకుంది. తాజాగా పశ్చిమబెంగాల్‌లో ఒక వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అలాగే ఈ కరోనా మహారాష్టల్రో తీవ్రస్థాయిలో ఉంది. పూణెలో 28 సంవత్సరాల యువతికి కరోనా నిర్థారణ అయినట్లు కలెక్టర్ నావెల్ కిశోర్ వెల్లడించారు. మహారాష్టల్రో 49 మందికి కోవిడ్-19 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా సోకిన 147మందిలో ముగ్గురు మరణించగా, 14 మంది కోలుకున్నారు.

03/18/2020 - 01:48

న్యూఢిల్లీ, మార్చి 17: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సునామి లాంటిది, ఇది మన ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేయబోతోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికైనా ముంచుకుని వస్తున్న ప్రమాదాన్ని గుర్తించి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

03/18/2020 - 01:45

న్యూఢిల్లీ, మార్చి 17: అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి శ్రీరామునికి చెందినదేనని తీర్పునిచ్చి సంచలనం సృష్టించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ రాజ్యసభ నామినేషన్ అత్యంత వివాదాస్పదమైంది.

03/18/2020 - 01:43

న్యూఢిల్లీ/ముంబయి, మార్చి 17: భారత్‌లో మూడో కరోనా మృతి నమోదైంది. మహారాష్ట్ర రాజధాని ముంబయిలో 63 ఏళ్ల వ్యక్తి వైరస్‌తో మరణించాడు. మంగళవారం నాటికి దేశంలో 137 కరోనా పాజిటీవ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఐరోపా దేశాలు, టర్కీ, యూకే నుంచి భారత్‌లోకి రాకుండా నిషేధం విధించారు. మార్చి 18 నుంచి 31 వరకూ ఇది అమల్లో ఉంటుంది.

03/18/2020 - 01:39

న్యూడిల్లీ, మార్చి 17: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌ను రాజ్యసభకు నామినేట్ చేయటం ద్వారా రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి చేసింది, న్యాయ వ్యవస్థ స్వాతంత్రాన్ని దెబ్బ తీసిందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌మను సింఘ్వి ఆరోపించారు.

03/18/2020 - 01:39

న్యూఢిల్లీ, మార్చి 17: జనాభా లెక్కల సేకరణలో భాగంగా దేశంలోని వెనుకబడిన కులాల జనాభా లెక్కలను కూడా సేకరించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ.హనుమంత రావు ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల వారి ప్రయోజనాలను నిజంగానే పరిరక్షించాలనుకుంటే మొదట వారి జనాభా లెక్కలను సేకరించాలని వీహెచ్ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.

03/17/2020 - 17:50

న్యూఢిల్లీ: ఇరాన్‌లో కరోనాను కట్టడి చేసేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇరాన్ జైళ్లలో మగ్గుతున్న ఖైదీలను, రాజకీయ ఖైదీలతో సహా విడుదల చేయాలని నిర్ణయించారు. అంతేకాదు వారిని మళ్లీ ఎపుడు జైళ్లకు తీసుకురావాలనే విషయంలో ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. ఇరాన్‌లో కరోనా వ్యాపించి ఇప్పటికే 853మంది బలికాగా..మొత్తం 14,991 కేసులు నమోదు అయ్యాయి.

03/17/2020 - 17:50

జమ్మూకాశ్మీర్: కాశ్మీర్‌లో పార్కులు, ఉద్యానవన ప్రదేశాలను మూసివేశారు. ఇక్కడ ఇప్పటి వరకు మూడ కరోనా కేసులు నమోదు కావటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటివరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయగా తాజాగా కరోనా కట్టడికి ఈ నిర్ణయం తీసుకున్నారు.

03/17/2020 - 16:07

న్యూఢిల్లీ: దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాలను పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన ఈరోజు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఇటువంటి పరిస్థితుల్లో మీడియా బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తుందని అన్నారు. ఎంపీలు కూడా తమ తమ నియోజకవర్గాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు.

Pages