S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/17/2018 - 12:37

శ్రీనగర్‌ : జమ్ము-కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని ఫతే కదల్‌ ప్రాంతంలో బుధవారం ఉదయం
జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక జవానుతో సహా ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో నలుగురు భద్రతా సిబ్బందికి గాయాలైనట్లు అధికారులు
తెలిపారు.

10/17/2018 - 12:26

కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు మండల పరిధి పెద్దహోతూరు సమీపంలో ఇవాళ వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రాలీ ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా..మరో 15 మంది తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు నుంచి ఎల్లార్తి దర్గాకు ట్రాలీ ఆటోలో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.

10/17/2018 - 12:19

కేరళ: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలను లోపలకు అనుమతించబోమంటూ భారీ సంఖ్యలో ఆందోళనకారులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. శబరిమలకు ప్రధాన ప్రవేశద్వారమైన నిలక్కల్‌ (శబరిమలకు 20 కి.మీ. దూరం) వద్ద మహిళలు, బిజెపి సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో, పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు.

10/17/2018 - 12:14

నీలక్కల్‌ : శబరిమల ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశాన్ని నిరసనకారులు అడ్డుకుంటున్న క్రమంలో ఆలయ ప్రవేశ ద్వారం ఉన్న నీలక్కల్‌ పరిసర ప్రాంతాల్లో కేరళ ప్రభుత్వం గట్టి భద్రతా చర్యలు చేపట్టింది. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

10/17/2018 - 04:10

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: భారత పారిశ్రామిక రంగం నైతిక కార్పొరేట్ విధానాలను అనుసరించాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. కొన్ని సంఘటనలు మొత్తం పారిశ్రామిక రంగం ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఇక్కడ ఆయన అసోచాం సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ నైతిక సుపరిపాలనను పెంపొందించాల్సిన బాధ్యత చాంబర్లపై ఉందని అన్నారు.

10/17/2018 - 02:48

లక్నో/ గోరఖ్‌పూర్, అక్టోబర్ 16: అలహాబాద్ నగరం పేరును ప్రయాగ్‌రాజ్‌గా మార్చాలనే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. అలహాబాద్ నగరం పేరును మార్చడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయలేదు. ఈ నగరానికి ఉన్న పాత పేరునే పునరుద్ధరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.

10/17/2018 - 02:44

పాట్నా, అక్టోబర్ 16: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికల విజయాల్లో కీలక భూమిక పోషించిన వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ జేడీయూ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ నియామకం ద్వారా బీహార్ అధికార పార్టీలో కిశోర్‌ది నెంబర్-2 స్థానమన్న విషయాన్ని విస్పష్టంగా తెలిపారు.

10/17/2018 - 01:58

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: రక్షణ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని భారత్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లు నిర్ణయించాయి. ఇరు దేశాల సైన్యం సాంకేతిక విజ్ఞానాన్ని పంచుకోవడం, శిక్షణ, రక్షణ ఉత్పత్తుల రంగంలోనూ కలిసి ముందుకు సాగాలని సంకల్పించాయి. భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, యూఏఈ రక్షణ శాఖ సహాయ మంత్రి బొవార్డి అల్ ఫలాసీల మధ్య మంగళవారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది.

10/17/2018 - 01:54

భోపాల్, అక్టోబర్ 16: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ వ్యవహార శైలియే కాదు, ఆయన మాట తీరు భిన్నంగానే ఉంటుంది. అనేక వివాదాలకు కేంద్ర బిందువు కావడమే కాకుండా, ఇతరత్రా పార్టీ వ్యవహారాల్లోనూ కల్లోలం రేపిన దిగ్విజయ్ సింగ్ తాజాగా మధ్యప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు అంతే విస్మయాన్ని కలిగిస్తున్నాయి.

10/17/2018 - 01:53

ఢిల్లీ, అక్టోబర్ 16: రాజస్తాన్ బీజేపీ నాయకత్వంలో ఎలాంటి విభేదాలు లేవని ఆ పార్టీ సీనియర్ నేతలు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వసుంధర రాజే పట్ల పూర్తి మద్దతు వ్యక్తమవుతోందని, పార్టీలోని అన్ని వర్గాలు ఆమె నాయకత్వాన్ని బలంగా సమర్థిస్తున్నాయని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ అన్నారు.

Pages