S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/13/2019 - 23:02

బెంగళూరు, జూలై 13: మాతృ భాషను ప్రాథమిక బోధనా భాషగా పాఠశాలల్లో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు. కనీసం మాతృ భాషను ప్రాథమిక దశలోనైనా అమలు చేయడం వల్ల దాని పట్ల విద్యార్థుల్లో అవగాహన పెరగుతుందని ఆయన అన్నారు. భాషలు అనేవి ప్రజలను అన్ని అంశాల్లో సమీకృతం చేసే విధంగా ఉండాలని సుస్థిర అభివృద్ధికి దోహదం చేసేవి కావాలని ఆయన అన్నారు.

07/13/2019 - 22:59

కోల్‌కత్తా, జూలై 13: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారితో సహా 107 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు ముకుల్ రాయ్ శనివారం నాడిక్కడ వెల్లడించారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు తమ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే చేరబోతారని అన్నారు. ఎమ్మెల్యేల్లో మెజారిటీ సభ్యులు తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన వారేనని ఆయన వెల్లడించారు.

07/13/2019 - 13:53

ఢిల్లీ: నగరంలోని జిల్‌మిల్ ఇండస్ట్రియల్ ఏరియాలో రబ్బరు ఫ్యాక్టరీలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 26 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పతున్నారు.

07/13/2019 - 13:30

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాల వల్ల జనజీవనం అతలాకుతలం అవుతుంది. గంగానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దని జాలర్లను హెచ్చరించారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు.

07/13/2019 - 13:24

న్యూఢిల్లీ: సోషల్‌మీడియాలో పరిచయం అయిన పాకిస్థాన్ యువతితో చాటింగ్, వీడియో కాలింగ్ చేసి మాట్లాతుండే రవీందర్ కుమార్ అనే జవాన్‌ను అరెస్టు చేశారు. దేశ భద్రతకు సంబంధించిన విషయాలపైన, ఆయుధాలకు సంబంధించిన విషయాలు మాట్లాడటమే కాకుడా ఆయుధాల ఫొటోలు తీసి పంపినట్లు గుర్తించారు. దీంతో అరెస్టు చేసి కస్టడీకి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి..

07/13/2019 - 13:21

బెంగళూరు: రాజకీయ సంక్షోభం వల్ల సంకీర్ణ ప్రభుత్వానికి మరింత బలం చేకూరిందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సీఎం కుమారస్వామి అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధమైన విషయమై మాట్లాడుతూ నమ్మకం ఉంది కాబట్టే విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యామని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని, అదే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

07/13/2019 - 13:20

బెంగళూరు: అసమ్మతి ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కర్ణాటక మంత్రి డికే శివకుమార్ మళ్లీ రంగంలోకి దిగారు. అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని సీఎం కుమారస్వామి ప్రకటించటంతో కాంగ్రెస్ మంత్రి అయిన శివకుమార్ తన బుజ్జగింపు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శనివారం తెల్లవారు జామున అసమ్మతి ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజ్ ఇంటికి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. ఆయన వెంట ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరన్ కూడా ఉన్నారు.

07/13/2019 - 13:19

లక్నో: ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత మూడు రోజులుగా అక్కడ కురుస్తున్న వర్షాలకు 15మంది చనిపోగా.. జంతు, ఆస్తి నష్టం అధికంగా ఉంది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

07/13/2019 - 13:17

న్యూఢిల్లీ: అసోంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలో 33 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఇప్పటి వరకు ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 27 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి ఏడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

07/13/2019 - 04:26

న్యూఢిల్లీ: మహిళల ఆరోగ్య స్థితిగతులపై ప్రత్యేకంగా దృష్టిసారించి మెరుగైన సేవలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అలాగే చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తరిమికొట్టడంతో పాటు పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. బీజేపీ మహిళా ఎంపీలతో శుక్రవారం ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీకి గరిష్ట స్థాయిలో 41మంది మహిళా ఎంపీలు ఉన్న విషయం విదితమే.

Pages