S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

06/25/2019 - 04:36

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని స్వామి వివేకానందతో పోల్చటం ఎంతమాత్రం సబబు కాదని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ అమలు చేసిన పలు పథకాల పేర్లు మార్చి అమలు చేస్తోంది తప్ప కొత్తగా ఏమీ చేయటం లేదని దుయ్యబట్టారు. నరేంద్ర మోదీతో పోల్చటం ద్వారా కేంద్ర సహాయ మంత్రి సారంగి స్వామి వివేకానందను అవమానించారని చౌదరి ఆరోపించారు.

06/25/2019 - 04:19

న్యూఢిల్లీ, జూన్ 24: పరిసరాల పరిశుభ్రతలో మెరుగైన ఫలితాలు సాధించిన తెలంగాణ రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు లభించాయి. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వంలో స్వచ్ఛ మహోత్సవ్ అవార్డుల కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ప్రత్యేక వ్యక్తిగత విభాగంలో సిద్దిపేట, ఎర్రవల్లికి చెందిన మొండి భిక్షపతి, జగిత్యాల శాంతక్కపల్లికి చెందిన మొరపు రమ స్వచ్ఛ మహోత్సవ్ అవార్డులు అందుకున్నారు.

06/25/2019 - 04:18

హైదరాబాద్, జూన్ 24: దేశవ్యాప్తంగా ఉన్న 21 న్యాయ విద్య విశ్వవిద్యాలయాల్లోనూ, డీమ్డ్ వర్శిటీలు, ప్రైవేటు వర్శిటీల్లో యూజీ, పీజీ సీట్ల రెండో దశ కేటాయింపుల ప్రక్రియను క్లాట్ కాన్సార్టియం పూర్తి చేసింది. తొలి దశ జాబితాను 14వ తేదీన విడుదల చేయగా, రెండో దశ జాబితాను ఆదివారం రాత్రి విడుదల చేసింది. మూడో జాబితాను ఈ నెల 28వ తేదీన విడుదల చేస్తుంది.

06/25/2019 - 04:05

న్యూఢిల్లీ, జూన్ 24: రాష్ట్ర రాజధాని అమరావతి-విజయవాడ చుట్టూ రింగ్ రోడ్డును అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నదని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు గడ్కరీ సమాధానమిస్తూ రింగ్ రోడ్డును అభివృద్ధి చేసే ప్రాజెక్టుకు తాము ఏనాడో ఆమోదం తెలిపాం..

06/25/2019 - 03:59

న్యూఢిల్లీ, జూన్ 24: మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గడ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ వెంటనే లోపాలు గ్రహించి దిద్దుబాటు చర్యలు తీసుకుని లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిందని మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ అన్నారు. అయితే ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఆ విజయోత్సవ భ్రమల్లోనే ఉండిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

06/25/2019 - 03:52

బెంగళూరు, జూన్ 24: ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి ‘గ్రామ వాస్తవ్య’ (గ్రామాల్లో రాత్రి నిద్ర) పథకం పేరిట ‘డ్రామా’ ఆడుతున్నారని, అధికార కాంగ్రెస్, జేడీ(ఎస్) నేతలు రోజూ వీధి పోరాటాలకు దిగుతున్నారని, కానీ ఇపుడు ప్రజలకు కావాల్సింది కాస్త ప్రశాంతత అని బీజేపీ కర్నాటక అధ్యక్షుడు బి. యెడ్యూరప్ప వ్యాఖ్యానించారు.

06/25/2019 - 03:51

న్యూఢిల్లీ, జూన్ 24: లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవిగా ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషనర్ అశోక్ లవాస వ్యక్తం చేసిన అసమ్మతి వాదనను వెల్లడించలేమని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రధాని మోదీ కోడ్ ఉల్లంఘనపై ఇసి తీసుకున్న నిర్ణయాలపై అశోక్ లవాస అసమ్మతిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

06/25/2019 - 01:17

న్యూఢిల్లీ, జూన్ 24: కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడంతోపాటు జాతీయ హోదా కల్పించాలని టీఆర్‌ఎస్ పార్లమెంటరీ నాయకుడు నామా నాగేశ్వరావు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై లోక్‌సభలో నామా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసిందని.. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం కూడా సహాయం చేయాలని కోరారు.

06/25/2019 - 01:37

న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త అంబికా కృష్ణ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ సోమవారం అంబికా కృష్ణకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యేగా గతంలో పని చేసిన ఆయన ప్రస్తుతం ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఉన్నారు.

06/25/2019 - 00:26

న్యూఢిల్లీ, జూన్ 24: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదన ఏదీ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం స్పష్టం చేశారు. బిహార్, ఆంధ్రప్రదేశ్ ఇతర వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే విషయం పరిశీలనలో ఉన్నదా అంటూ జేడీ-యూ సభ్యుడు కౌషలేంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయం తెలిపారు.

Pages