S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/20/2018 - 16:58

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పతిలోని తిక్రి గ్రామంలో కోతులు జరిపిన రాళ్ల దాడిలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. ధార్మసింగ్ అనే డెబ్బయ్ సంవత్సరాల వృద్ధుడు చెట్టు కింద పుల్లలు ఏరుకుంటే అక్కడే పాడుబడిన ఇంట్లో నుంచి వచ్చిన కోతులు ఇటుకలతో చెట్టు ఎక్కుతున్నాయి. ఆ కోతులు వృద్ధుడిపై ఇరవై ఇటుకలు విసిరేశాయి. తీవ్రంగా గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ చనిపోయాడు.

10/20/2018 - 16:53

జమ్మూకాశ్మీర్: ఇక్కడ జరిగిన స్థానిక ఎన్నికల పలితాలు శనివారం వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ ఆరు జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ 75 వార్డులు గెలుచుకోగా, కాంగ్రెస్ 52 వార్డులు గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 45 వార్డుల్లో గెలుపొందారు. బారాముల్లా జిల్లాలో కాంగ్రెస్ ఒక్క వార్డు గెలుచుకోలేదు. బీజేపీ 17 వార్డుల్లో గెలుచుకుంది.

10/20/2018 - 13:20

అమృత్‌సర్: పట్టాల పక్కన దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు రైల్వే అధికారులకు ఎలాంటి సమాచారం లేదని రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్విని లొహాని ఓ ప్రకటనలో వెల్లడించారు. రైల్వే సిబ్బందిని ఎందుకు అప్రమత్తంగా ఉంచలేదని అడిగిన ప్రశ్నకు లొహాని పై విధంగా స్పందించారు. జలంధర్‌-అమృత్‌సర్‌ రైలు నిర్ణీత వేగంతోనే ప్రయాణిస్తోందని, రైలును ఆపేందుకు డ్రైవర్‌ అత్యవసర బ్రేక్స్‌ కూడా వేసినట్లు తెలిసిందని ఆయన వెల్లడించారు.

10/20/2018 - 13:14

తిరువనంతరపురం: ‘50ఏళ్ల తర్వాతే మళ్లీ శబరిమలను దర్శించుకుంటాను’ అంటూ ఓ తొమ్మిదేళ్ల చిన్నారి ప్లకార్డు పట్టుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. అయ్యప్పమాల వేసుకొని తల మీద ఇరుముడి పెట్టుకున్న తొమ్మిదేళ్ల చిన్నారి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘నాకు 50 ఏళ్లు పూర్తయిన తర్వాతే మళ్లీ శబరిమలను దర్శించుకుంటాను. అప్పటి వరకు రాను’ అని అర్థం వచ్చేలా రాసి ఉన్న ప్లకార్డును పట్టుకొని ఆలయంలోకి ప్రవేశించింది.

10/20/2018 - 13:13

బీజాపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్‌ జిల్లా మిర్తూర్‌ అటవీప్రాంతంలో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో మూడు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.

10/20/2018 - 12:44

హోళగొందు: దేవరగట్టులో జరిగిన కర్రల సమరంలో 35 మంది గాయపడ్డారు. ఇద్దరు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. దేవరగట్టు సమీపంలోని మాళమ్మ, మల్లేశ్వర స్వామికి రాత్రి 12 గంటల తరువాత కల్యాణం జరిగిన అనంతరం ఈ ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. ఈ విగ్రహాలను దక్కించుకోవటం కోసం కర్రల సమరం నిర్వహిస్తారు.

10/20/2018 - 12:41

పాట్నా: బీహార్‌లోని బీజేపీ సీనియర్ నేత, బెగుసరయ్ ఎంపీ బోలాసింగ్ (80) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో రామ్ మనోహరిలోహియా ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఎనిమిదిసార్లు శాసనసభ్యుడిగా, రెండుసార్లు లోకసభ సభ్యుడిగా తన సేవలు అందించారు. బీహార్ శాసనసభ్యునిగానూ పనిచేశారు

10/20/2018 - 12:39

న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త స్వామి పరిపూర్ణానంద శనివారం ఉదయం బీజేపీలో చేరారు. బిజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌లతో సమావేశమైన అనంతరం ఆయన రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. అమిత్‌షా తన నివాసంలో ఆయనకు పార్టీ కండువా కప్పి సభ్యత్వ రసీదు ఇచ్చారు. అనంతరం పరిపూర్ణానంద విలేకరులతో మాట్లాడుతూ తొమ్మిది రోజులు పూర్తి నిరాహారంగా ఉండి ఆత్మ పరిశీలన చేసుకున్నానని అన్నారు.

10/20/2018 - 12:35

భువనేశ్వర్:ఒడిసాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భువనేశ్వర్ సమీపంలోని ఉత్తరాచౌక్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. కారు-ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఈ ప్రమాదంలో కారు సమీపంలోని కాల్వలోకి దూసుకుపోయింది. కారులోని నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు కూడా చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

10/20/2018 - 12:34

చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు అల్పపీడనాల వల్ల రాగాల 48 గంటల్లో వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఈ మేరకు చెన్నై వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నైరుతీ రుతుపవనాలు నిష్క్రమణ కూడా దీనికి కారణం. ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించనున్న నేపథ్యంలో ఈ అల్పపీడనాల వల్ల చెన్నై పట్టణంలో రాగాల 48 గంటల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

Pages