S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/20/2018 - 17:17

భువనేశ్వర్: భారత వైమానిక దళ విమానం ఒకటి ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో మంగళవారంనాడు కుప్పకూలింది. రోజువారీ శిక్షణలో భాగంగా కలైకుంద నుంచి బయలుదేరిన హాక్ విమానం కుప్పకూలినట్టు అధికారులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో ట్రైనీ పైలట్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు.

03/20/2018 - 17:12

గుర్‌దాస్‌పూర్: 2014లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఇరాక్‌లోని మసూల్‌లో కిడ్నాప్ చేసిన భారతీయ కార్మికుల్లో 39 మంది ఐఎస్ ఊచకోతకు గురై మరణించినట్టు, వారి అవశేషాలు లభ్యమైనట్టు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మంగళవారంనాడు రాజ్యసభలో తొలిసారి ప్రకటించిన నేపథ్యంలో హర్జీత్ హసీహ్ పేరు మరోసారి వార్తల్లోకి వచ్చింది.

03/20/2018 - 17:41

ముంబయి: రైల్వే ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ మతుంగ-దాదర్ రైల్వేస్టేషన్‌లో విద్యార్థులు ఆందోళన చేశారు. రైళ్లను ఆపివేశారు. రైల్వే ఉద్యోగ నియామక పరీక్షలు రాసి నెలలు గడస్తున్నా భర్తీ చేయటం లేదని విద్యార్థులు నిరసన వ్యక్తంచేశారు. విద్యార్థుల ఆందోళనతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 60కి పైగా లోకల్ రైళ్ల సర్వీసులు నిలిపివేశారు.

03/20/2018 - 16:36

న్యూఢిల్లీ: ఇరాక్ ఉగ్రవాదులు చేతుల్లో బందీలుగా ఉన్న 39 మంది భారతీయులు ఇకలేరనే విషయం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమ ఆప్తులు ఇంకా తిరిగివస్తారని ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని కోరారు.

03/20/2018 - 16:36

కోల్‌కతా: ఇరాక్‌లో ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉన్న 39 మంది భారతీయులు మృతి చెందటం దురదృష్టకరమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈ వార్త తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని, మృతుల కుటుంబాలను ఓదార్చటానికి మాటలు రావటం లేదని ఆమె ట్వీట్ చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయమని, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు.

03/20/2018 - 16:35

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనపై మార్కులు వేయటానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. తనపై సీబీఐ విచారణ జరుగనున్నదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఆస్తులను ప్రకటిస్తున్నామని అన్నారు. ఎనిమిది శాతం ఉన్న వృద్ధిరేటును 12శాతానికి పెంచామని అన్నారు. పోలవరం టెండర్లలో అవినీతిని నిరూపించాలని డిమాండ్ చేశారు.

03/20/2018 - 17:21

న్యూఢిల్లీ: ఇరాక్‌లో బందీలుగా ఉన్న 39 మంది భారతీయులు మృతి చెందిన విషయాన్ని ఇప్పటి వరకు ఎందుకు గోప్యంగా ఉంచారో వెల్లడించాలని, వారు ఎపుడు చనిపోయారో వెల్లడించాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ డిమాండ్ చేశారు. ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలకు ఇప్పటి వరకు ఆశలు కల్పించారని, ప్రతి ఒక్క భారతీయుడికి ఇది విచారించదగ్గ విషయమని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

03/20/2018 - 16:32

చెన్నై: ఆధ్యాత్మిక పర్యటన ముగించుకుని తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ చెన్నై తిరిగి వచ్చారు. పెరియార్ విగ్రహా ధ్వంసం ఘటనను ఆయన ఖండించారు. నా వెనుక ఉన్నది బిజెపి కాదని దేవుడు ఉన్నాడని అన్నారు. తమిళ ఉగాది పండుగ ఏప్రిల్ 14నాటికి పార్టీ జెండాను ప్రకటించటం లేదని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

03/20/2018 - 16:30

బెంగళూరు: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళకు న్యాయస్థానం 15 రోజులు పెరోల్ మంజూరు చేసింది. ఆమె భర్త నటరాజన్ సోమవారంనాడు కన్నుమూసిన విషయం విదితమే. దీంతో ఆమె పెరోల్‌పై విడుదల అయ్యేందుకు దరఖాస్తు చేసుకోగా న్యాయస్థానం మంజూరు చేసింది. తంజావూరు వదలి వెళ్లకూడదని, ఎలాంటి రాజకీయ సమావేశాలు నిర్వహించరాదని ఆంక్షలు విధించింది.

03/20/2018 - 15:31

న్యూఢిల్లీ: తమిళనాడులోని పుదుక్కొట్టై జిల్లాలో కొందరు గుర్తుతెలియని దుండగులు మంగళవారంనాడు పెరియార్ ఈవీ రామస్వామి విగ్రహాన్ని కూల్చేశారు. 19 శతాబ్దానికి చెందిన ఈ సామాజికవేత్త విగ్రహం తలను తొలగించి తీవ్రంగా అమమానించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Pages