S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

03/24/2018 - 02:44

జాతీయ ప్రత్యక్ష పన్నుల అకాడామీలో శిక్షణ పూర్తి చేసుకున్న
158మంది రెవెన్యూ అధికారులతో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్

03/24/2018 - 01:33

న్యూఢిల్లీ, మార్చి 23: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ముఖ్యమంత్రి కేసీఆర్ జీవిత విశేషాలు, ప్రస్తుత సంక్షేమ పథకాలకు సంబంధించి బొట్ల మహర్షి రచించిన ‘కేసీఆర్ ప్రగతి ప్రాంగణం’ పుస్తకాన్ని శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. జేఎన్‌యూ వైఎస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జగదీష్‌కుమార్ ఆవిష్కరించారు.
ఖర్గేతో టీ- కాంగ్రెస్ నేతల భేటీ

03/24/2018 - 01:32

న్యూఢిల్లీ, మార్చి 23: ఏపీకి ప్యాకేజీ గురించి కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీని తాను కలిసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని టీటీపీ ఎంపీ సుజనాచౌదరి చెప్పారు. పార్లమెంట్ అవరణలో సుజనాచౌదరి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా తేలేవరకు కేంద్రంతో చర్చలు జరిపే అవకాశం లేదని తేల్చిచెప్పేశారు. ఏ నిర్ణయమైన పార్టీలో చర్చించిన తరువాతనే తీసుకుంటామన్నారు.

03/24/2018 - 01:31

న్యూఢిల్లీ, మార్చి 23: రాజ్యసభలో ఎంపీల తీరుపై చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇది పెద్దల సభేనా? మనం ఎందుకిలా వ్యవహరిస్తున్నాం. దేశ ప్రజలు మన తీరుపై ఎంతో ఆదోళనతో ఉన్నారు’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మన్ మాట్లాడుతూ ‘ప్రతి రోజూ సభ ప్రతిష్టంభనకు గురవుతోంది’ అంటూ తీవ్ర మనస్తాపం చెందారు.

03/24/2018 - 01:26

ముంబయి, మార్చి 23: విమానంలో ప్రయాణికునికి వెజిటేరియన్ మీల్స్ బదులు నాన్‌వెజ్ సరఫరా చేసిందన్న ఆగ్రహంతో కింది స్థాయి ఉద్యోగిపై సూపర్‌వైజర్ చేయిచేసుకున్నాడు. ఈనెల 17న న్యూఢిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్ వెళ్తున్న విమానంలో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. దీనిపై విమానయాన సంస్థ అంతర్గత విచారణకు ఆదేశించింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎయిర్ ఇండియా విమానం ఫ్రాక్‌ఫర్ట్ వెళ్తోంది.

03/24/2018 - 02:17

న్యూఢిల్లీ, మార్చి 23: ఏడేళ్ల క్రితం తన అవినీతి వ్య తిరేక ఉద్యమంతో దేశ ప్రజలు అందరినీ కదిలించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి నివరధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. శుక్రవారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆయన ఈ నిరశనను మొదలుపెట్టారు. 2011లో కూడా ఇదే వేదికపై ఆయన అవినీతి వ్యతిరేక శంఖారావం చేసిన విషయం తెలిసిందే.

03/24/2018 - 00:57

ఎంపీలను నిలదీసిన వెంకయ్యనాయుడు*
సభా గౌరవాన్ని కాపాడాలని హితవు

03/24/2018 - 02:39

న్యూఢిల్లీ, మార్చి 23:ఉత్తర ప్రదేశ్ సహా ఏడు రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీ మరింత బలపడింది. చివరి క్షణం వరకూ ఉత్కంఠ రేకెత్తించిన ఉత్తర ప్రదేశ్‌లోని పది స్థానాల్లో తొమ్మిది సీట్లను కైవసం చేసుకుంది. లోక్‌సభ ఉప ఎన్నికల నష్టాన్ని భర్తీ చేసుకుంటూ రాజ్యసభ ఎన్నికల్లో తన సత్తా చూపించింది.

03/24/2018 - 03:59

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయేపై అవిశ్వాసం పెట్టిన తెదేపా, వైకాపాలకు కొత్త బలం చేకూరింది. గత ఆరు రోజులుగా పార్లమెంట్‌లో సాగుతోన్న డ్రామాను సునిశితంగా పరిశీలిస్తూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అకస్మాత్తుగా ఎన్డీయేపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రయోగించటంతో ఢిల్లీ రాజకీయంలో కొత్త మలుపు చోటుచేసుకుంది.

03/24/2018 - 00:43

ఎస్సీ ఎస్టీల అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీం తాజా తీర్పుపై కేంద్రం తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ శుక్రవారం ధర్నా నిర్వహించింది. అనుకోని అతిధిగా ధర్నాకు తెదేపా ఎస్సీ ఎంపీ శివప్రసాద్ హాజరవడంతో కాంగ్రెస్ విస్తుపోయంది.

Pages