S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/24/2018 - 02:26

పంబా, డిసెంబర్ 23: శబరిమలలో అయ్యప్పస్వామిని మహిళలు దర్శనం చేసుకునే విషయంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 11 మంది మహిళల బృందం ఆదివారం స్వామిని దర్శించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని స్థానిక భక్తులు, నిరసనకారులు అడ్డుకుని తరిమికొట్టడతో వారు దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు.

12/24/2018 - 02:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ఢిల్లీ అసెంబ్లీ చేసిన తీర్మానం 1984 అల్లర్లలో ఊచకోతకుగురైన సిక్కుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా విమర్శించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి భారతరత్న పురస్కారాన్ని తొలగించాలని తీర్మానం చేసిన అసెంబ్లీ ఆ తర్వాత ఈ తీర్మానంతో సంబంధం లేదని పేర్కొనడం విడ్డూరమన్నారు.

12/24/2018 - 02:22

లక్నో, డిసెంబర్ 23: సహనానికి భారత్ పెట్టింది పేరని, మన దేశంలో ఉన్నంతమంది సహనశీలురు ప్రపంచంలో ఎక్కడా లేరని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ- భారతదేశంలో ఉన్నంత సహనం మరే దేశంలోనూ లేదని, ఒకవేళ భారతీయుల్లో సహనం నశిస్తే..

12/24/2018 - 02:20

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: శాసనమండలి ఎన్నికల్లో తప్పుడు సమాచారం ఇస్తూ డిక్లరేషన్ దాఖలు చేసే అభ్యర్థులు ఎన్నికైన తర్వాత అనర్హత వేటు వేసే విధంగా చట్టానికి సవరణలు తేవాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. ఈ మేరకు ప్రతిపాదనలను కేంద్రానికి తెలిపారు. శాసనమండలి ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఖర్చుపై పరిమితులు విధించాలని ఈసీ పేర్కొంది.

12/24/2018 - 02:20

కోల్‌కతా, డిసెంబర్ 23: తప్పుడు గణాంకాలతో తన ప్రభుత్వ విజయాలను ఏకరవు పెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఆర్థిక స్థితిగతుల వాస్తవాలు ఒకలా వుంటే, మోదీ గణాంకాలు తిమ్మిని బమ్మిని చేసే రీతిలో వున్నాయని ఆయన అన్నారు.

12/24/2018 - 02:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: పాకిస్తాన్ మైనార్టీల పట్ల ఆకృత్యాలకు, దారుణాలకు పాల్పడిన దేశమని, కొన్ని లక్షల మందిని హతమార్చిన చరిత్ర పాక్‌కు ఉందని బీజేపీ ధ్వజమెత్తింది. భారత్‌లో మైనార్టీలకు భద్రత లేదని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శించింది. పాకిస్తాన్ మైనార్టీలపై జరిగిన దాడుల మధ్య 1947లో ఆవిర్భవించిందన్నారు.

12/24/2018 - 02:17

ముంబయి, డిసెంబర్ 23: కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ఒక వర్గం మీడియా తనపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తూ, తాను చేసిన ప్రకటనలను వక్రీకరిస్తూ, నాపై కుట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం ట్విట్టర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ‘గెలిచినప్పుడు బాగానే ఉంటుంది..

12/24/2018 - 02:15

ముంబయి, డిసెంబర్ 23: ఒకవైపు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు పెనుభారంగా మారుతుండగా, వాటికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లోకి ఇప్పుడిప్పుడే అడుగిడుతున్న బ్యాటరీ వాహనాలకు చార్జింగ్ పెద్ద సమస్యగా పరిణమించింది. వాటి చార్జింగ్‌కు గంటలు గంటల సమయం పడుతుండటంతో వినియోగదారులు వాటిపై అంతగా ఆసక్తి చూపడం లేదు.

12/24/2018 - 04:53

బాలాసోర్ (ఒడిశా): భారత్ రక్షణ రంగం అంబుల పొదిలో అగ్ని-4 క్షిపణి చేరింది. బాలాసోర్ వద్ద బంగాళాఖాతంలో 4000 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను చేధించేందుకు చేపట్టిన అగ్ని-4 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. డాక్టర్ అబ్దుల్ కలాం ద్వీపకల్పంలోని సమగ్ర పరీక్ష రేంజ్ సముదాయం నుంచి అగ్ని-4 క్షిపణిని ప్రయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

12/23/2018 - 00:40

కాకినాడ సిటీ, డిసెంబర్ 22: పెథాయ్ తుపాను కారణంగా దెబ్బతిన్న తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు ఆన్‌షోర్‌లో డ్రిల్లింగ్ నిర్వహించే ఒలిండా స్టార్ రిగ్‌ను సాధారణ స్థితికి తీసుకువచ్చినట్లు ఓఎన్జీసీ ఉన్నతాధికారులు శనివారం విడుదలచేసిన ఒక ప్రకటనలో తెలియజేశారు.

Pages