S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/11/2018 - 03:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న తరుణంలో అన్ని పార్టీల్లోనూ జయాపజయాల గుబులు పట్టుకుంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో ఇటు అభ్యర్థులు, అటు పార్టీల అధినేతలూ కూడా గందరగోళంలో పడిపోయారు.

12/11/2018 - 02:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రజల అణచివేత, హక్కుల పరిరక్షణకు ఢిల్లీలో వందలాది మంది గళం విప్పారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సోమవారం సెంట్రల్ ఢిల్లీలోని పార్లమెంట్ వీధిలో భారీ ర్యాలీ జరిగింది. 65 రోజుల క్రితం చేపట్టిన ‘సంవిధాన్ సమ్మన్ యాత్ర’ రాజధాని ఢిల్లీకి చేరుకుంది.

12/11/2018 - 02:48

మొహాలి (పంజాబ్), డిసెంబర్ 10:ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజలు చాలా ‘స్పష్ట’మైన సందేశానే్న ఇవ్వబోతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ పరాజయం తప్పదన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం రైతుల్ని భారంగా పరిణిస్తోందని పేర్కొన్న ఆయన దేశంలో రైతుల సమస్యలు పెరిగిపోతున్నాయని, నిరుద్యోగం కూడా ఆందోళనకర స్థాయికి చేరుకుందన్నారు.

12/11/2018 - 02:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: వివాదాస్పద అయోధ్య స్థలంలో రామమందిర నిర్మాణంపై మంగళవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మోదీ ప్రభుత్వం కనుక బిల్లు ప్రవేశపెట్టకపోతే సమావేశాలను సజావుగా జరగనీయబోమని శివసేన హెచ్చరించింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బిజేపీ మిత్రపక్ష పార్టీ అయిన శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే ఈ హెచ్చరికలు జారీచేశారు.

12/11/2018 - 02:43

తిరువనంతపురం, డిసెంబర్ 10: శబరిమల అంశంపై బీజేపీ చేపట్టిన ‘చలో సచివాలయం’ కార్యక్రమం సోమవారం హింసాత్మకంగా మారింది. ర్యాలీతో ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆందోళనకారులను రెచ్చగొట్టడానికి పోలీసులు వాటర్ కెనన్, టీయర్ గ్యాస్‌ను వినియోగించారు. ఇదే అంశంపై కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టింది.

12/11/2018 - 02:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీ (ఆర్‌ఎల్‌ఎస్‌పి) అధ్యక్షుడు, కేంద్రమంత్రి ఉపేంద్ర కుష్వాహా సోమవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను కేవలం రబ్బర్ స్టాంపుల స్థాయికి దిగజార్చారని, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా బిహార్‌లోని వెనుకబడిన కులాల వారిని మోసగించారని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఆరోపించారు.

12/11/2018 - 02:59

బాలసోర్: దాదాపు ఐదు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే శక్తి కలిగిన అగ్ని-5 క్షిపణిని భారత్ సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిసా తీరంలోని అబ్దుల్‌కలామ్ దీవి నుంచి అణుసామర్థ్యం గల ఈ క్షిపణి ప్రయోగ పరీక్ష నిర్వహించారు. పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన అగ్ని క్షిపణిని పరీక్షించడం ఇది ఏడోసారి.

12/11/2018 - 00:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది. మంగళవారం నుంచి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షతన పార్లమెంట్ లైబ్రరీలో

12/11/2018 - 00:33

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడిగా, వాడిగా జరుగనున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం నాయకత్వంలో సమాయత్తమవుతున్న ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ సిద్ధం అవుతుంటే, ప్రతిపక్షాలు ఎన్‌డీఏ ప్రభుత్వంపై పెద్దఎత్తున దాడి చేసేందుకు ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

12/11/2018 - 00:13

ముంబయి, డిసెంబర్ 10: కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అంశాలపై తీవ్ర విభేదాలను ఎదుర్కొంటున్న రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ (55) సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. రెండోసారి కూడా ఈ పదవి దక్కేందుకు అవకాశం ఉన్నప్పటికీ నిర్ణీత పదవీకాలానికి ఎనిమిది నెలల ముందుగానే ఉర్జిత్ రాజీనామా చేయడం గమనార్హం.

Pages