S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/09/2018 - 02:52

హీమాన్‌కు 83ఏళ్లు. దశాబ్దాలపాటు హిందీ చిత్రసీమను ఏలిన ధర్మేంద్ర తన 83వ జన్మదినోత్సవాన్ని శనివారం అభిమానుల మధ్య జరుపుకున్నారు. తన సినీ ప్రస్థానాన్ని ముఖ్యంగా బంధినీ చిత్రంలో తనకు అవకాశం లభించడమన్నది మరపురాని జ్ఞాపకమని ఓ పుస్తకంలో పేర్కొన్నారు

12/09/2018 - 02:50

శబరిమల, డిసెంబర్ 8: కేరళలోని శబరిమలలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయప్ప ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. క్యూలైన్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వార్షిక యాత్ర సీజన్ ప్రారంభమైన ఇరవై రోజుల తరువాత శనివారం ఆలయం భక్తులతో కోలాహలంగా కనిపించింది. మహిళలకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పు తరువాత శబరిమల పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి.

12/09/2018 - 02:46

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశాభివృద్ధిలో ప్రవాస భారతీయ యువత భాగస్వామలు కావాలని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పిలుపునిచ్చారు. భారత్ విదేశాలకు రాయబారుల్లా పనిచేసి అభివృద్ధికి పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎనిమిది దేశాలకు చెందిన 40 మంది భారత సంతితి యువతతో శనివారం ఆయన సమావేశమయ్యారు. ఏ దేశంలో ఉంటున్నా మాతృభూమిని మరచిపోవద్దని ఆయన హితవుచెప్పారు.

12/09/2018 - 02:45

కపుర్తలా (పంజాబ్), డిసెంబర్ 8: పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంపై రెండేళ్ల క్రితం నిర్వహించిన సర్జికల్‌ దాడుల ద్వారా స్పష్టమైన హెచ్చరికలను జారీ చేశామని, భవిష్యత్తులో ఎటువంటి దుస్సాహసానికి దిగిన తగినబుద్ధి చెబుతామని ఆర్మీనార్తరన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ చెప్పారు.

12/09/2018 - 02:45

రాంచీ, డిసెంబర్ 8: లోక్‌తాంత్రిక్ జనతాదళ్ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు శరద్ యాదవ్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేపై చేసిన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ విషయంపై తన విచారాన్ని వ్యక్తం చేస్తూ ఆమెకు లేఖ రాస్తానని ఆయన శనివారం చెప్పారు.

12/09/2018 - 02:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అనుచరుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ శనివారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

12/09/2018 - 02:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: దేశ రాజధానిలోని టీటీడీ దేవస్థానం బాలాజీ మందిర్‌లో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం, రుద్రాభిషేకం శనివారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం ఉదయం రుద్రాభిషేకం, సాయంత్రం శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది.

12/09/2018 - 01:23

భందేర్వా (జమ్ము-కశ్మీర్): దేశంలో మతసామరస్యం, సోదరభావానికి ఇంతకుమించిన దృష్టాంతం లేదు. ముఖ్యంగా హిందూ-ముస్లింల మధ్య అగాథాన్ని పెంచుతున్న పరిస్థితులు ప్రబలుతున్న తరుణంలో ఓ ముస్లింను మెజార్టీ హిందువులు తమ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సోదరభావానికి, సామరస్యపూర్వక జీవనానికి గీటురాయి. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో భేలన్-ఖరోతి గ్రామం ఇందుకు అద్దం పట్టింది.

12/09/2018 - 01:13

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు వెనకాడబోనని బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించారు. రామాలయ నిర్మాణం అంశాన్ని జనవరిలో లిస్టు చేస్తే, రెండు వారాల్లో విచారణ పూర్తయి గెలుస్తాం. తన పిటిషన్‌ను కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయని, అది సబబు కాదని అన్నారు.

12/08/2018 - 16:33

లక్నో: బులంద్‌షహర్ హింసాకాండ నేపథ్యంలో సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్‌పీ) కృష్ణ బహదూర్ సింగ్‌పై బదిలీ వేటు పడింది. ఈనెల 3న గోవధ జరిగిందంటూ మూకదాడి చోటుచేసుకున్న ఘటనలో ఇన్‌స్పెక్టర్ సుబోధ్ కుమార్ సింగ్‌, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఎస్పీ కృష్ణ బహదూర్ సింగ్‌ను తాజాగా లక్నోకు బదిలీ చేసి, ఆయన స్థానంలో సీతాపూర్ ఎస్పీ ప్రభాకర్ చౌదరిని నియమించారు.

Pages