S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడే మోదీ రాక

హైదరాబాద్, నవంబర్ 24: రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, కేంద్రీయ పోలీస్ సంస్థల అధిపతుల 51వ వార్షిక సమావేశం శుక్రవారం ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమిలో మూడు రోజులపాటు జరుగునున్న సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారు. ఈ సమావేశం సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులకు రాష్టప్రతి పోలీస్ పథకాలను, పోలీస్ పథకాలను ప్రదానం చేస్తారు. ఈ జాతీయ సదస్సును 2013 వరకు ప్రతి యేటా ఢిల్లీలో నిర్వహిస్తూ వచ్చారు.

నెలాఖరులో తిరుమలకు కెసిఆర్

హైదరాబాద్, నవంబర్ 24:తిరుమల శ్రీవారికి, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి ముఖ్యమంత్రి కెసిఆర్ మొక్కులు చెల్లించుకోనున్నట్టు అధికార వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే తిరుపతికి వచ్చి శ్రీవారికి కానుకలు సమర్పించుకోనున్నట్టు తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శ్రీనివాసుడికి వజ్రకిరీటం, తిరుచనూరు పద్మావతి అమ్మవారికి బంగారు హారాన్ని సమర్పించేందుకు రూ. 5కోట్లను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది చెల్లించింది. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ ఆభరణాలను టిటిడి తయారు చేయించింది.

నల్ల పన్ను 60%?

న్యూఢిల్లీ,నవంబర్ 24: ఆదాయంతో పొంతన లేని డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తే రెండు వందల శాతం పెనాల్టీ పన్ను విధించే విధానాన్ని సవరించటం గురించి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. రెండున్నర లక్షల కంటే ఎక్కువ డబ్బును బ్యాంకు ఖాతాల్లో జమ చేసి అది వారి ఆదాయంతో సరితూగకపోతే రెండు వందల శాతం పెనాల్టీ విధిస్తామని కేంద్ర ఆదాయం పన్ను శాఖ ఇంతకు ముందు హెచ్చరించటం తెలిసిందే. ఇంత భారీ పెనాల్టీ భయంతోనే నల్లకుబేరులు బైటకు రావడం లేదనే అంశంపై ఈ సమావేశంలో దృష్టి సారించినట్టు తెలుస్తోంది.

పేదలకు సెల్‌ఫోన్లు

అమరావతి, నవంబర్ 24: రాష్ట్రంలో మొబైల్ ఫోన్లు లేని పేదలందరికీ ఫోన్లు సమకూర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. డిజిటల్ లావాదేవీలు జరపడానికి వీలుగా అందరికీ ఫోన్లు ఉండాలని, అందుకే ఈ ఆలోచన అమలు చేయాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ నుండి బ్యాంకర్లు, ఆర్బీఐ అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు. సాధారణ పరిస్థితులు వచ్చేవరకు ఈ కసరత్తు కొనసాగించాల్సిందేనన్నారు. 1వ తేదీ కల్లా ప్రజల ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు లేకుండా చూడడమే మన ముందున్న లక్ష్యమన్నారు. 28, 29వ తేదీ కల్లా రాష్ట్రానికి మరో రూ.

పెద్దనోట్ల రద్దు వ్యవస్థీకృత దోపిడీ

న్యూఢిల్లీ, నవంబర్ 24: పెద్దనోట్ల రద్దు అంశంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వాన్ని చీల్చిచెండాడారు. ఐదు వందలు, వెయ్యి నోట్ల రద్దు ద్వారా ప్రధాని మోదీ వ్యవస్థీకృత దోపిడి, చట్టబద్ధ మోసానికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల జిడిపి రెండు శాతం పడిపోతుందని హెచ్చరించారు.

నోట్ల మార్పిడి బంద్

అర్ధరాత్రి నుంచే అమలు
పాత వెయ్యినోటుతో బిల్లుల చెల్లింపు నిలిపివేత
పాత 500నోటుతో చెల్లింపులకు 15వరకు గడువు
2 దాకా టోల్ రుసుం మినహాయింపు
3నుంచి 15దాకా రూ.500తో టోల్ పన్ను స్వీకరణ
విదేశీయులకు వారానికి రూ.5వేల వరకు నగదు మార్పిడి
కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయాలు

ఏకతాటిపైకి పీఠాధిపతులు

హిందూ ధర్మంపై దాడులకు అడ్డుకట్ట
పల్లెల్లోకి ధార్మిక సాహిత్యం
హిందూ స్ఫూర్తి కార్యక్రమాల నిర్వహణ
ఎజెండా వెల్లడించిన చినజీయర్, పరిపూర్ణానంద, సుబుధేంద్ర

రాష్ట్రంలో కార్ల ఇంటీరియర్స్ కంపెనీ

విజయవాడ, నవంబర్ 24: ఆటోమొబైల్ ఇంటీరియర్స్‌కు ప్రఖ్యాతిగాంచిన అంటోలిన్ ఇంజనీరింగ్ గ్రూప్ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో గురువారం సమావేశమయ్యారు. ఆడి, మెర్సిడిస్ వంటి దిగ్గజ కార్లకు ఈ సంస్థ తయారు చేసిన ఇంటీరియర్ పరికరాలు వినియోగిస్తున్నారు. పుణె, చెన్నైలలో ప్రస్తుతం ఆంటోలిన్ సంస్థకు తయారీ కేంద్రాలు ఉన్నాయి. అమరావతిలో నూతనంగా తమ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి అంటోలిన్ ఇంజనీరింగ్ గ్రూప్ సుముఖంగా ఉంది.

మూల్యం చెల్లించాల్సిందే..

విదేశాల నుంచి నల్లధనాన్ని తెప్పించే అవకాశం శూన్యం కావడంతో ప్రధాని మోదీ తన ప్రతిష్టను పెంచుకునేందుకు, కొన్ని రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు పెద్దనోట్లను రద్దు చేసినట్టు కనిపిస్తోంది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం కీలక నిర్ణయం అయినప్పటికీ- సాధ్యాసాధ్యాలను, భవిష్యత్ పరిణామాలను ఆలోచించకుండా పెద్దనోట్లను రద్దు చేశారు. పెద్దనోట్లను రద్దు చేశామంటూనే 2వేల రూపాయల నోటును విడుదల చేయడం మరో పొరపాటు. నోట్ల రద్దుతో జనం నానాపాట్లు పడుతున్నారు. 2వేల రూపాయల నోట్ల వల్ల బడాబాబులు నగదును మరింత భారీగా, సులువుగా దాచుకునేందుకు అవకాశం కలిగింది.

లోబడ్జెట్ పెళ్లి..!

‘‘కెవ్వు.. ఎవడ్రా నువ్వు.. నా చెయ్యి పట్టుకున్నావ్.. ‘షీ టీమ్’ను పిలిచానంటే నీ తాట తీస్తారు.. పిచ్చి సన్నాసీ’’
‘‘చెంప ఛెల్లుమనిపించావేంటి డార్లింగ్? పెళ్లయ్యాక ఎలాగూ తప్పదు. నేను విఘ్నేష్‌ను.. ఇదిగో నా ఐడెండిటీ కార్డు. బ్యాంకులో టోకెన్ సంపాదించే సరికి ఇలా మారిపోయాను. మన పెళ్లికి విఘ్నాలన్నీ తొలగిపోయినట్టే. ఒకే కానె్వంట్, ఒకే కాలేజీ, ఒకే కంపెనీలో ఉద్యోగం, ఇప్పుడు ఒకే ఇంటి వారమవుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఒకటవుతున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది డార్లింగ్’’
‘‘సారీ డియర్.. చెరిగిపోయిన జుట్టు, చిరిగి పోయిన షర్టు చూసి ఎవడో ఏబ్రాసి వెధవ చేయి పట్టుకున్నాడనుకున్నాను.’’

Pages