S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్వర బాధితులకు తాత్కాలికంగా నాలుగు అదనపు వార్డులు

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 19 : జిల్లా కేంద్రంలోని సర్వజన ఆసుపత్రిలో 350 రోగులకు సరిపడా వైద్యసేవలందించే డాక్టర్లు, సిబ్బంది, వౌలిక వసతులు వున్నాయని అయితే వైరల్ ఫీవర్స్ భయంతో 3 రెట్లు అధికంగా (1006) రోగులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సోమవారం నాటికి ఇన్‌పేషెంట్స్‌గా వున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం జ్వర బాధితుల కోసం మరో నాలుగు అదనపు వార్డులను ఏర్పాటుచేయడానికి సూపరింటెండెంట్ ఛాంబర్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ అదనపు వార్డ్‌ల ఏర్పాటుతో అధికంగా వస్తున్న విష జ్వరాల బాధితులకు వైద్యం అందిస్తామన్నారు.

అనంత టిడిపిలో వార్

అనంతపురం, సెప్టెంబర్ 19:అనంతపురం నగరం ఓవైపు డెంగీ, సీజనల్ వ్యాధుల విజృంభనతో బెంబేలెత్తిస్తుంటే మరోవైపు అధికార పార్టీలోని నేతలు పరస్పరారోపణాస్త్రాలు సం ధించుకుంటుండటంపై నగర వాసు లు విస్తుపోతున్నారు. నగరంలో పారిశుద్ధ్య లోపం, డెంగీ, మలేరియా, విష జ్వరాలు ప్రబలడానికి కారణంగా మేయర్, ఎమ్మెల్యేలంటూ ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి ఆదివారం విలేఖరుల సమావేశంలో చేసిన కామెంట్ అనంతపురం టిడిపిలో సద్దుమణిగిన విభేదాల కుంపటిని మరోమారు రాజేసింది.

నగరంలో పందులు పట్టివేత

అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 19: నగరంలో విష జ్వరాల ప్రభావం అంతకంతకు పెరిగిపోతుండటంతో వీటిని నివారించేందుకు తక్షణమే పందుల యజమానులు స్వచ్ఛందంగా తరలించాలని మున్సిపల్ కమిషనర్ చల్లా ఒబిలేసు పేర్కొన్నారు. సోమవారం కమిషనర్ విలేఖరులతో మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌లాంటి సీజనల్ వ్యాధులకు పందులు కూడా ఒక కారణమవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకోవటం జరిగిందన్నారు.

పాకిస్తాన్‌పై యుద్దం ప్రకిటించాలి

తాడిపత్రి, సెప్టెంబర్ 19: భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తక్షణం పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించాలని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను వెంటనే ధ్వంసం చేయాలని విశ్వహిందూ పరిషత్ రాయలసీమ విభాగ్ అధ్యక్షులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు. యూరి ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదుల దాడిలో అమరులైన 17మంది జవానుల ఆత్మలకు శాంతి చేకూరాలని సోమవారం చల్లా సర్కిల్‌లో విహెచ్‌పి ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించి, పాకిస్తాన్ జాతీయ జెండాను దహనం చేశారు.

సమ్మెటీవ్-1 పరీక్షలకు సర్వం సిద్ధం

అనంతపురం సిటీ, సెప్టెంబర్ 19: నూతన పద్ధతిలో సమ్మెటీవ్-1 త్రై మాసిక పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి విద్యా శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. త్రై మాసిక పరీక్షలు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల, కెజిబివి అన్ని పాఠశాలల్లో ఈ నెల 21 నుండి త్రైమాసిక పరీక్షలు ఒకే రకంగా రహస్య పద్ధతిలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబందించి అన్ని పాఠశాలలకు సోమవారం నుండి త్రైమాసిక పరీక్షలకు సంబందించిన ప్రభుత్వం అందించిన ప్రశ్నపత్రాలు జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో డిసిఈబి అధికారులు రహస్యంగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేశారు.

పొలాల్లో చిరుతల సంచారం!

వజ్రకరూరు, సెప్టెంబర్ 19:నిన్నమొన్నటి వరకు రెండు చిరుతలు కొండ గుట్టల్లో ఊరిచివరి కుంటల్లో నీరు తాగి పోయేవి. సోమవారం పొలాల వెంబడి తిరుగుతూ పట్టపగలే ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అదిగో చిరుతలు, ఇదిగో చిరుతలు అని గూళ్లపాళ్యం గ్రామస్తులు భయాందోళనలు చెందుతున్నారు. రైతులు తమ ఎద్దుల బండితో పొలాలకు వెళ్లడానికి, పశువుల కాపర్లు పశువులను మేపడానికి వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురౌతున్నారు. తోటల్లో పనిచేసే కూలీలు చిరుతల సంచారంతో పనులకు వెళ్లడానికి నిరాకరిస్తున్నారు. లక్షలాది వ్యయం చేసి తోటల్లో పంటలు సాగుచేసిన రైతులు తోటలకు వెళ్లాలంటేనే భయాందోళనలు చెందుతున్నారు.

హోదాతోనే అభివృద్ధి జరగదు

పెనుకొండ, సెప్టెంబర్ 19:ఒక్క ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందబోదని ఎమ్మెల్యే బికె పార్థసారథి పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహ ఆవరణలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలు అంతంత మాత్రంగానే అభివృద్ధి చెందడం చూస్తున్నామన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు ప్రత్యేక హోదాపై రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కరవు నివారణ కింద రాయలసీమ జిల్లాలకు రూ.1100 కోట్లు నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. కరవు నిధుల్లో రూ.250 కోట్లతో నియోజకవర్గంలోని పలు మండలాలకు తాగునీరు అందించడం జరుగుతుందన్నారు.

నగరాభివృద్ధికి జె.సి నిధులిచ్చారా..!

అనంతపురంటౌన్, సెప్టెంబర్ 19: నగరాభివృద్ధికై రెండేళ్ల పాలనా కాలంలో ఎం.పి జె.సి.దివాకరరెడ్డి ఎం.పి ల్యాడ్స్ నుంచి ఒక్క రూపాయి నిధులను కూడా కార్పొరేషన్‌కు ఇచ్చిన పాపాన పోలేదని, ఆయనవి ఉత్తమాటలేనని మేయర్ స్వరూప ధ్వజమెత్తారు. సోమవారం మేయర్ ఛాంబర్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్పొరేషన్‌లో అవినీతి జరిగిందంటూ ఎంపి చేస్తున్న ఆరోపణలపై ఏ విచారణ జరిపినా వాస్తవం కాదని నిరూపించటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. శానిటేషన్‌లో రాష్టస్థ్రాయి అవార్డు పొందిన కమిషనర్ ఓబులేశు కమ్మ కులస్తుడైనంత మా త్రాన ఉండకూడదాయని అన్నారు.

యువకుడి ఆత్మహత్య

పెనుకొండ, సెప్టెంబర్ 19:పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో స్థానిక దర్గాపేటకు చెందిన ముసాపీర్ (22) అనే యువకుడు రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గత కొన్ని నెలలుగా మతిస్థిమితం లేకుండా సంచరిస్తుండేవాడని, మానసిక వైకల్యంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. హిందూపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.
వ్యక్తి ఆత్మహత్య

సాగునీటి ప్రాజెక్టుల పనులపై నిరంతరం సమీక్ష

కర్నూలు, సెప్టెంబర్ 19:జిల్లాలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల పనులపై దసరా నుంచి ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సమాచారం అందింది. హంద్రీ-నీవా, గాలేరు- నగరి, ఎస్‌ఆర్‌బిసి, అవుకు సొరంగంతో పాటు ఇతర పనులపై ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేశారు. దసరా రోజున అమరావతిలో మాస్టర్ కంట్రోల్ రూం ప్రారంభం కానుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఆ తరువాత ప్రతి సోమవారం సిఎం చంద్రబాబు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని వెల్లడించారు.

Pages